"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మామిడిపూడి వేంకటరంగయ్య

From tewiki
Jump to navigation Jump to search
మామిడిపూడి వేంకటరంగయ్య
150px
మామిడిపూడి వేంకటరంగయ్య
పుట్టిన తేదీ, స్థలం1889, జనవరి 8
నెల్లూరు జిల్లా పురిణి
మరణం1981, జనవరి 13
హైదరాబాదు
వృత్తిరచయిత, విద్యావేత్త
జాతీయతభారతీయుడు

సంతకందస్త్రం:Mamidipudivrsign.jpg

మామిడిపూడి వెంకటరంగయ్య (1889 - 1981) రచయిత, విద్యావేత్త, ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. ఈయన విజ్ఞాన సర్వస్వ నిర్మాత కూడాను.

బాల్యము, విద్యాభ్యాసము

ఈయన 8 జనవరి 1889లో నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిణి గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వెంకటేశమ్, నరసమ్మ.

బాల్యంలో తెలుగు, సంస్కృతం అభ్యసించిన తర్వాత ఆంగ్ల విద్య కోసం మద్రాసు లోని పచ్చయప్ప కళాశాలలో చేరారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి 1907 లో బి.ఎ.పరీక్షలో మొదటి తరగతిలో మొదటివాడిగా ఉత్తీర్ణులయ్యారు. తర్వాత పచ్చయప్ప కళాశాలలో పనిచేస్తూ అదే విశ్వవిద్యాలయం నుండి చరిత్ర, ఆర్థిక, రాజకీయ శాస్త్రాలలో ఎం.ఏ. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. చదువుతున్న కాలంలోనే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ప్రముఖ రచయిత, విద్యావేత్త, ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. ఈయన విజ్ఞాన సర్వస్వ నిర్మాత.

ఉద్యోగము

రఘుపతి వెంకటరత్నం నాయుడు ప్రోత్సాహం మీద కాకినాడ లోని పిఠాపురం రాజావారి కళాశాలలో చరిత్రాధ్యాపకులుగా 1910లో చేరి 1914 వరకు నిర్వహించారు. తరువాత విజయనగరం మహారాజా కళాశాలలో ఆర్థిక, రాజకీయ శాస్త్రాలలో అధ్యాపకులుగా 1927 వరకు పనిచేశారు. ఆ కాలంలో యువరాజైన అలకనారాయణ గజపతికి విద్యాదానం చేశారు తర్వాత సంస్థానంలో దివానుగా నియమితులయ్యారు.

వీరు సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా 1958 లో మొదటి సంపుటాన్ని విడుదల చేశారు.

ఇతనికి భారత ప్రభుత్వం 1968లో పద్మ భూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది.

వ్యక్తిత్వం

ఎంతటి చిన్నవారైనా, చర్చలో ఎదుట వ్యక్తి నోరు విప్పితే, ఆయన మౌనంగా వినేవారు. చివరి రోజులలో మంచం మీద పడుకునే వ్రాసేవారు, చదివే వారు. మరొకరికి డిక్టేట్ చేసే అలవాటు లేదనేవారు. విమాన ప్రయాణం అంటే ఆయనకు భయం. రైల్లోనే ప్రయాణించేవారు. ఆయన ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డికి సన్నిహితులు. అయితే 1968-69లో ఆంధ్రజ్యోతి దిన పత్రికను దృష్టిలో పెట్టుకుని, ప్రెస్ బిల్ అసెంబ్లీలో బ్రహ్మానందరెడ్డి తెచ్చారు. పత్రికా స్వేచ్ఛను హరించే ఆ బిల్లును వెంకట రంగయ్యగారు తీవ్రంగా విమర్శించారు. బ్రహ్మానంద రెడ్డి ప్రెస్ బిల్ ను మూలబెట్టేశారు

నరిశెట్టి ఇన్నయ్యతో కలిసి ఆంధ్రలో స్వాతంత్ర్య సమరం అనే తెలుగు గ్రంథాన్ని జాయింట్ రచయితలుగా వ్రాశారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1972లో ప్రచురించగా, సర్వీస్ కమిషన్ విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా పెట్టారు. సోక్రటీస్ భారతదేశంలోని గుర్గాన్ జిల్లాలోని ఓ గ్రామంలో తిరుగాడితే ఎలా ఉంటుందన్న విషయంపై ఈ గ్రంథాన్ని కల్పించి రాశారు. మామిడిపూడి వెంకటరంగయ్య నెల్లూరి జిల్లాలోని గ్రామంగా మార్చి అనువదించారు[1]

ఇతనికి భారత ప్రభుత్వం 1968 లో పద్మ భూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది.

మరణం

వీరు 1981, జనవరి 13వ తేదీ హైదరాబాదులో తమ 93వ యేట మరణించారు. మరణించేనాటికి వీరికి భార్య, ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు[2].

మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్

మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ ప్రస్తుతం సికింద్రాబాద్లో 1982 స్థాపించబడింది. దీనికి ఇతని మనుమరాలు శాంతా సిన్హా కార్యదర్శిగా పనిచేస్తూ అనాథ పిల్లల గురించి నిర్విరామంగా కృషిసల్పుతున్నారు. ఈమెకు పద్మశ్రీ, రామన్ మెగసెసే పురస్కారం లభించాయి.

మూలాలు

  1. వెంకటరంగయ్య, మామిడిపూడి (1929). సోక్రటీసు యొక్క సందేశం. Retrieved 9 December 2014.
  2. విలేకరి (14 January 1981). "ఆచార్య మామిడీపూడి కాలధర్మం". ఆంధ్రపత్రిక దినపత్రిక (సంపుటి 67, సంచిక 281). Retrieved 2 February 2018.[permanent dead link]

బయటి లింకులు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).