"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మార్తాండవర్మ

From tewiki
Jump to navigation Jump to search

కేరళ లోని తిరువాన్కూరు ఒక గొప్ప రాచరిక వ్వవస్థ. ఆరాజ్యం లోని అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైనది. ఈ ఆలయం పేరుననే తిరువనంతపురానికి ఆ పేరు వచ్చినది. ఒకప్పుడు దీన్ని పట్టువీట్టల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుంబాలు నిర్వహించే వారు. కాల గమనంలో ఈ ఆలయం ట్రావెన్ కూర్ సంస్థాన సంస్థాపకుడైన మార్తాండ వర్మ చేతిలోకి వచ్చింది.

ఈ రాజ తాము పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని, ఆలయం లోని శంఖాన్నే తమ రాజ్యానికి గుర్తుగా పెట్టుకున్నారు. ప్రస్తుతము ఉన్న విశాలమైన (వైవిధ్యమైన) గోపురాన్ని 1568 లో నిర్మించారు. ఆలయంలో మూల విరాట్ ను 1208 సాలగ్రామ లతో తయారు చేసారు. ఈ భారీ విగ్రహాన్ని చూడడానికి మూడు ద్వారాల గుండా చూడాలి. ఆది శేషుని పై పవళించి నట్లు ఉన్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తల భాగం, మధ్య ద్వారం గుండా చూస్తే బొడ్డు, అందులో పుట్టిన తామర పువ్వు, మూడో ద్వారం ద్వారా చూస్తే పాద భాగం కనిపిస్తాయి.

ఆలయంలో దేవునికి సంబంధించిన సంపద నేల మాళిగలలో దాచి ఉన్నదని తెలుసు. ఈ గదులను అయితే కొన్ని వందల సంవత్సరాలుగా తెరిచి చూసిన పాపాన పోలేదు. 1860 లో మూసివేసిన కొన్ని గదులను మాత్రం 1950 లో సీల్ వేశారు. స్వాతంత్ర్యానంతరం స్థానిక ఆలయాలన్నిటిని ట్రావెంకూర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసినా, ఈ ఆలయాన్ని మాత్రం రాజ కుటుంబీకులే తమ పర్యవేక్షణ క్రిందనే ఉంచు కున్నారు. ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితిర్ తిరునాళ్ బలారామ వర్మ ను అప్పటి ప్రభుత్వం రాజ ప్రముఖ్ గా ప్రకటించింది. ఆ రాజ కుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ధర్మకర్త లుగా కొనసాగారు. ప్రస్తుతం ఉత్తరదామ్ తిరుణాల్ మార్తాండ వర్మ ధర్మకర్తగా కొనసాగుతున్నాడు. రాజకుటుంబం పెద్ద ఉత్రాడం తిరుణాల్ మార్తాండ వర్మ మరణిం చారు. అయన వయస్సు 91 సంవత్సరాలు. ఆయన వయస్సు . ప్రఖ్యాత పద్మనాభ స్వామి ఆలయానికి ఆయన ఆలయ ట్రస్టు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు

మూలాలు:ఈనాడు దిన పత్రిక, ఆంధ్ర జ్యోతి దిన పత్రిక 27.12.2013 (కరెంట్ అపైర్స్) : See more at: https://web.archive.org/web/20131228061214/http://www.andhrajyothy.com/node/45908#sthash.NLQhQvuW.dpuf