"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మించాలంపాడు (దుర్గి)

From tewiki
Jump to navigation Jump to search

మించాలంపాడు (దుర్గి) గుంటూరు జిల్లా, దుర్గి మండలానికి చెందిన గ్రామం.

మించాలంపాడు (దుర్గి)
—  గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/ఆంధ్ర ప్రదేశ్" does not exist.

అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°25′27″N 79°29′34″E / 16.42423°N 79.492722°E / 16.42423; 79.492722
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం దుర్గి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 522612
ఎస్.టి.డి కోడ్ 08642

ఈ ప్రాంతం పేరు వింటే 'పుల్లరి ఉద్యమం' గుర్తుకొస్తుంది. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వారిలో కన్నెగంటి హనుమంతు రావు పుట్టిన పురిటి గడ్డ. ఆయన నడిపిన ఉద్యమాలకు చూసి ఆనాటి తెల్లదొరలు గడగడలాడారు. ఆనాటి 'అడవి పుల్లరి' ఉద్యమం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. మరి 66ఏళ్ల స్వాతంత్య్ర ఫలాలు ఆ ప్రాంతానికి అందాయా తెల్లదొరల హయాంలో పల్నాడు ప్రాంతంలో పశువులను అడవిలో మేపాలంటే ఒక్కొక్క పశువుకు రెండు రూపాయల చొప్పున 'పుల్లరి' కట్టాల్సి వచ్చేది. 1920లో సహాయ నిరాకరణ ఉద్యమానికి ఆకర్షితుడైన కన్నెగంటి హనుమంతు అడవి పుల్లరికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం లేవదీశాడు. దీంతో ఆయన మీద పగబట్టిన బ్రిటీష్ ముష్కరులు 1922 ఫిబ్రవరి 22న అత్యంత క్రూరంగా కాల్చి చంపారు.అనేక మందిని జైళ్లలో పెట్టారు. దేశ స్వాతంత్య్ర కోసం ఇంతటి త్యాగం చేసిన ఆ ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు అందాయా? స్వాతంత్య్రానంతర భారత దేశాన్ని చూసి దు:ఖిస్తున్న గ్రామాల్లో మించాలంపాడు కూడా ఒకటి. గుంటూరుజిల్లా దుర్గి మండలంలోని ఈ గ్రామం స్వాతంత్య్ర ఫలాలను వెక్కిరిస్తోంది.