"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మిథాలి రాజ్

From tewiki
Jump to navigation Jump to search
మిథాలి రాజ్
[[Image:|154px|]]
వ్యక్తిగత సమాచారం
కెరీర్ గణాంకాలు
TestsODIs
మ్యాచ్‌లు 8 93
పరుగులు 522 2776
బ్యాటింగ్ సగటు 52 45.50
100లు/50లు 1/3 2/20
అత్యుత్తమ స్కోరు 214 114*
ఓవర్లు 12 64.5
వికెట్లు 6
బౌలింగ్ సగటు 12.16
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 0
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 0 n/a
అత్యుత్తమ బౌలింగ్ 0 3/12
క్యాచ్ లు/స్టంపింగులు 7/- 23/-

As of మార్చి 27, 2007
Source: [1]

1982, డిసెంబర్ 3న జన్మించిన మిథాలి రాజ్ (Mithali Raj) భారతదేశపు మహిళా క్రికెట్ క్రీడాకారిణి. 1999లో తొలిసారిగా అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో ప్రవేశించి ఐర్లాండ్ పై 114 పరుగులు సాధించి నాటౌట్ గా నిల్చింది. 2001-02 లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండుపై లక్నోలో ఆడింది. ఇంగ్లాండ్ పై టాంటన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ లో 264 పరుగులు సాధించి మహిళా క్రికెట్ లో ప్రపంచ రికార్డు సృష్టించింది. 2005 మహిళా ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఆమె భారత జట్టుకు నేతృత్వం వహించింది. స్వతహాగా బ్యాటింగ్ చేసే మిథాలి అప్పుడప్పుడు బౌలింగ్ కూడా వేసేది. 2003లో ఆమెకు అర్జున అవార్డు పురస్కారం లభించింది. ఆమె చిన్నప్పుడు భారత సాంప్రదాయ నృత్యం అయిన భరత నాట్యంలో శిక్షణ పొంది వేదికలపై నాట్యం చేసేది. ప్రస్తుతం మిథాలి భారతీయ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నది.

క్రీడా జీవితం

మిథాలి తన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాజీవితంలో 93 వన్డేలలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి 45.50 సగటుతో 2776 పరుగులు సాధించింది. ఇందులో 2 సెంచరీలు, 20 అర్థ సెంచరీలు ఉన్నాయి. వన్డేలలో ఆమె అత్యధిక స్కోరు 114 నాటౌట్. టెస్టులలో 8 మ్యాచ్‌లు ఆడి 52 సగటుతో 522 పరుగులు సాధించింది. ఇందులో ఒక సెంచరీ, 3 అర్థ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో ఆమె అత్యధిక స్కోరు 214 పరుగులు. ఇదే ఆమె యొక్క ఏకైక సెంచరీ.

అవార్డులు

భారత క్రీడారంగంలో అత్యున్నతమైన అర్జున అవార్డు 2003లొ మిథాలి రాజ్ కు ప్రధానం చేయబడింది.

బయటి లింకులు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).