మిన్నెకల్లు

From tewiki
Jump to navigation Jump to search


మిన్నెకల్లు
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

మిన్నెకల్లు, ప్రకాశం జిల్లా, సంతమాగులూరు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523 302., ఎస్.ట్.డి.కోడ్ = 08404.

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

  1. ఈ గ్రామంలో 49.35 సెంట్ల విస్తీర్ణంలో పాతచెరువు ఉంది. దీని నీటి నిలువ సామార్ధ్యం 10 సెంట్లు. 69.42 సెంట్ల విస్తీర్ణంతో ఉన్న కొత్తచెరువు నీటినిలువ సామర్థ్యం 13 సెంట్లు. ఈ చెరువులలో చేపపిల్లలను వేసి, పెంచి, పట్టుకొని హక్కుకొరకు, రెండు సంవత్సరములకొకసారి బహిరంగ వేలం నిర్వహించి వచ్చిన ఆదాయాన్ని గ్రామపంచాయతీకి జమచేయుదురు. [3]
  2. తారకరామ తంగేడుమిల్లి మేజరు ఎత్తిపోతల పథకం.

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి తన్నీరు గురువులు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ ముప్పాళ్ళ శ్రీనుబాబు ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

  1. శ్రీ చంద్రశేఖరస్వామివారి ఆలయం.
  2. శ్రీ రామాలయం:- మిన్నేకల్లు గ్రామంలోని శ్రీరామాలయంలో, శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణం, కన్నులపండువగా నిర్వహించెదరు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటారు. [1]
  3. శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి 19 ఎకరాల మాగాణి భూమి మాన్యంగా ఉంది. కౌలు రూపంలో ప్రతి సంవత్సరం, లక్షల రూపాయల ఆదాయం వచ్చుచున్నా, ఆలయ నిర్మాణాన్నీ, అభివృద్ధినీ ఎవరూ పట్టించుకునేవారు లేరు. [4]

గ్రామ విశేషాలు

ఈ గ్రామంలోని ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన మహేంద్ర అను విద్యార్థి, చిన్నప్పటినుండి, ప్రభుత్వ పాఠశాలలోనే కష్టపడి చదివి తన ప్రతిభతో, ఇడుపులపాయలోని ఐ.ఐ.ఐ.టి.లో సీటు సాధించి, అక్కడగూడా బాగా చదివి బి.టెక్.లో అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకాన్ని పొందినాడు. 2014, ఆగస్టు-4వ తేదీన హైదరాబాదులో నిర్వహించిన, రాజీవ్ గాంధీ వైఙానిక సాంకేతిక విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో, గవర్నర్ శ్రీ నరసింహన్ గారి చేతులమీదుగా బంగారు పతకాన్ని అందుకుని మట్టిలో మాణిక్యంగా నిలిచాడు. ఇతడు ఇంజనీరింగ్ చదువుచూ ఉండగానే ఇన్ ఫోసిస్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపిక కావడం మరో విశేషం. [2]

మూలాలు

వెలుపలి లింకులు

[1] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, ఏప్రిల్-9; 1వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2014, ఆగస్టు-5; 9వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, డిసెంబరు-19; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, డిసెంబరు-22; 2వపేజీ.