ముక్కు

From tewiki
Jump to navigation Jump to search
మానవ నాసిక ముఖం పక్కవైపు నుండి

ముక్కు లేదా నాసిక (ఆంగ్లం: Nose) తల ముందుభాగంలో ఉండే జ్ఞానేంద్రియం. పైకి కనిపించే ముక్కు మానవుల ముఖం మధ్యలో ఇది ముందుకి పొడుచుకుని వచ్చియుంటుంది. ముక్కుకు క్రిందిభాగంలో రెండు నాసికారంధ్రాలుంటాయి. పైభాగం గొంతుతో కలిసి ఉంటుంది. ముక్కు యొక్క ఆకృతిని ఎథమాయిడ్ అస్థిక, రెండు నాసికలను విభజించే నాసికా స్థంభం అనే మృదులాస్థిక (కార్టిలేజ్) నిర్ధారిస్తాయి.

భాషా విశేషాలు

ముక్కు నిర్మాణం, ఘ్రాణనాడి.

తెలుగు భాషలో ముక్కు పదానికి చాలా ప్రయోగాలున్నాయి.[1] ముక్కును నాసిక అంటారు. పక్షి ముఖాన్ని కూడా ముక్కు అని పిలుస్తారు. "చనుముక్కు" (a nipple) అంటే వక్షోజాల మధ్యనుండే చనుమొనలు. ముక్కు మొగము ఎరగనట్టు మాట్లాడినాడు అనగా మనిషిని గుర్తుపట్టనట్లుగా ఉన్నాడు అని ప్రయోగిస్తారు. ముక్కు: బాధతో మూల్గడానికి కూడా ముక్కుతున్నాడు అంటారు. కొన్ని పదార్ధాలు పాడయిపోవడాన్ని కూడా ముక్కిపోయాయి అంటారు. ఉదా: ముత్యాలు ముక్కిపోయినవి. ముక్కురంధ్రములు లేదా నాసాపుటములు. బలిష్టమైన జంతువులను అదుపుచేయడానికి వాని ముక్కులోపలినుండి త్రాడు దూర్చి పట్టుకుంటారు. దీనిని "ముక్కుత్రాడు" లేదా "ముకుత్రాడు" అంటారు. సులోచనము, కండ్లద్దములను "ముక్కద్దము" అని కూడా పిలుస్తారు. ముక్కమ్మి లేదా ముక్కుకమ్మి (ముక్కు + కమ్మి.) లేదా ముక్కర (ముక్కు + రాయి.) ఒక విధమైన నాసాభరణము. A nostril, నాసికారంధ్రము. ముక్కిడి (ముక్కు + ఇడి) ముక్కులేని. ముక్కిడిరోగము ముక్కు ఎముక పాడై దూలము చదునుగా మారి ముక్కు లేనట్లుగా కొన్ని వ్యాధులలో జరుగుతుంది. ముక్కుదూలము లేదా ముకుదూలము రెండు ముక్కు రంధ్రాల మధ్యగల దూలము లేదా ముక్కునడిమి యెముక. ముక్కుపొడి అనగా నస్యము, పొడుము. "ముక్కుపోగు" (A nose ring) అనేది ముక్కుమ్మి, నత్తు. ముక్కులు అనగా మిక్కిలి చిన్ననూకలు.

ఆరోగ్య సంబంధ విపత్తులు

The danger triangle of the face.

ముక్కుకు, దాని పరిసర ప్రాంతానికి ఉన్న ప్రత్యేకమైన రక్తప్రసరణ వలన నాసికా ప్రాంతములో సంభవించే తిరోగామి ఇన్ఫెక్షన్లు మొదడు వరకు చేరే అవకాశమున్నది. ఈ కారణంగానే నోటి ఇరువైపుల కొనలనుండి ముక్కు పైభాగము వరకు ఉన్న త్రిభుజాకారపు ప్రదేశాన్ని (ముక్కు, మాక్షిల్లా ఉన్న ప్రాంతం) వైద్యులు ముఖం యొక్క ప్రమాద త్రిభుజం (The danger triangle of the face) అని భావిస్తారు.

ముక్కు నుండి రక్తస్రావం (Epistaxis) సామాన్యంగా మనం చూసే వ్యాధి లక్షణం. జలుబు, ముక్కు దిబ్బడ (Nasal congestion) కొన్ని ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్స్ లోనూ కనిపిస్తుంది. వాతావరణ పరిస్థితులు లేదా అలర్జీ వలన కూడా ఇలా జరగవచ్చును. ఇలాంటి కొన్ని వ్యాధులలో వాసన తెలియకుండా పోతుంది (Anosmia or Loss of smell sensation).

ముక్కులోని ఎండిన పొక్కుల్ని తీయడానికి ప్రయత్నించడం (Nose-picking) ఒక చెడు అలవాటు. దీని మూలంగా ఇన్ఫెక్షన్స్, రక్తస్రావం మొదలైన ప్రమాదాలు జరుగుతాయి. ఇది మానసిక వ్యాధిగా మారి ముక్కులోని వెంట్రుకల్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తారు (Rhinotillexomania).

చిన్నపిల్లలు ముక్కులో వివిధ రకాలైన వస్తువుల్ని ఉంచుకుంటారు. ఇవి లోపల ఆడ్డంపడి తొలగించడానికి శస్త్రచికిత్స అవసరం కూడా కలుగుతుంది. గట్టిగా గాలిపీల్చినప్పుడి ఇవి ఊపిరితిత్తులలోనికి పోయి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది.

శుశ్రుతుడు కాలంలో ప్లాస్టిక్ సర్జరీ మొదటిసారిగా ముక్కు మీదనే జరిగింది. కొన్ని ప్రమాదాలలోను, వ్యాధులలోనే కాక అందంగా ఉండాలనుకునే కొంతమంది మహిళలు తమ ముక్కును శస్త్రచికిత్సతో మార్చుకుంటున్నారు.

మానవుని ముక్కు ఆకృతి

మానవ నాసికలు వివిధ ఆకృతులలో ఉంటాయి. ముక్కులను వాటి ఆకృతి ఆధారము వర్గీకరించటానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. ఈ దిగువ ఉదాహరణలు ఎడెన్ వార్విక్ (జార్జ్ జేబెట్) రాసిన నేసాలజీ నుండి గ్రహించబడినవి. ఈ 19వ శతాబ్దపు కరపత్రము ముక్కు ఆకృతులను ఫ్రెనాలజీలో లాగా వివిధ మానవ స్వభావాలతో వ్యగ్యంగా అన్వయించింది. ఈ పత్రము అప్పట్లో బాగా ప్రాచుర్యములో ఉన్న ఫ్రెనాలజీ అనే వివాదస్పదాంశాన్ని ఎద్దేవా చేయటానికి ఉద్దేశించింది.

ఇన్ఫెక్షన్

రసిక అటువంటి సాధారణ జలుబు లేదా ఇన్ఫ్లుఎంజా వంటి ఇతర వ్యాధుల యొక్క ఒక లక్షణం ఉంటుంది . ఈ అంటువ్యాధులు సమయంలో, నాసికా మ్యూకస్ ముక్కు రంధ్రాలను నింపి, అధిక శ్లేష్మం ఉత్పత్తి. ఇది కూడా రసిక వైరల్ పరిణామ ఫలితంగా సూచించబడింది. ఇది చాలా దారుణంగా హాని కలిగించవచ్చు పేరు ఊపిరితిత్తులు, శ్వాసనాళ, వ్యాప్తి చెందకుండా సంక్రమించకుండా నిరోధించడానికి,, ఉపయోగకరంగా లేని ఒక ప్రతిస్పందన కావచ్చు హోస్ట్, కానీ దాని స్వంత పెంచడానికి వైరస్ రూపొందింది. రసిక ఈ ఇన్ఫెక్షన్ల వల్ల సాధారణంగా సిర్కాడియన్ లయలను సంభవిస్తాయి. ఒక వైరల్ సంక్రమణ కాలంలో, సైనసిటిస్ (అనునాసిక కణజాలం వాపు) మే మ్యూకస్ మరింత శ్లేష్మం విడుదల దీనివల్ల, జరుగుతాయి. తీవ్రమైన సైనసిటిస్ వైరల్ ఇన్ఫెక్షన్ వాపు నాసల్ పాసేజ్ కలిగి ఉంటుంది. ఒకటి లేదా ఎక్కువ నాసికా పాలిప్స్ కనిపిస్తుంది ఉన్నప్పుడు దీర్ఘకాలిక సైనసిటిస్ సంభవిస్తుంది. ఈ ఒక మళ్ళి గోడలో అలాగే వైరల్ సంక్రమణ వలన కూడా చేయవచ్చు కారుతున్న ముక్కు[2]

  • తరగతి 1: రోమన్, లేదా కొక్కి ముక్కు.
  • తరగతి 2: గ్రీకు ముక్కు లేదా నిటారు ముక్కు. ఈ తరగతి ముక్కు తిన్నగా ఒక గీతలాగా ఉంటుంది
  • తరగతి 3: నూబియన్ ముక్కు, లేదా వెడల్పాటి నాసికల ముక్కు. ఈ తరగతి ముక్కు కొసను వెడల్పుగా ఉండి, విశాలంగా, లావుగా ఉంటుంది. భృకుటి నుండి క్రిందికి క్రమంగా వెడల్పు అవుతుంది. మిగిలిన ముక్కులన్నీ పార్శ్వ ముఖంలో చూపిస్తే దీన్ని మాత్రం ముఖానికి ఎదురుగా చూడవచ్చు.
  • తరగతి 4: గద్ద ముక్కు. ఇది సన్నగా మొనదేలి ఉంటుంది
  • తరగతి 5: చట్టి ముక్కు
  • తరగతి 6: నింగి ముక్కు

మూలాలు

  1. బ్రౌన్ నిఘంటువులో ముక్కు పదానికి గల ప్రయోగాలు.[permanent dead link]
  2. "how to stop a runny nose". youngstershub.com. Jan 20, 2015. Archived from the original on 2015-10-08. Retrieved Jan 20, 2015.

బయటి లింకులు