ముచ్చటగా ముగ్గురు

From tewiki
Jump to navigation Jump to search
ముచ్చటగా ముగ్గురు
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
నిర్మాణం యార్లగడ్డ సురేంద్ర
డి. రామానాయుడు (సమర్పణ)
కథ ఎస్.ఎస్.క్రియేషన్స్
చిత్రానువాదం రేలంగి నరసింహారావు
తారాగణం చంద్రమోహన్ ,
తులసి,
పూర్ణిమ
సంగీతం చక్రవర్తి
సంభాషణలు డి.వి.నరసరాజు
ఛాయాగ్రహణం ఎస్. హరినాథ్
కూర్పు డి. రాజగోపాల్
నిర్మాణ సంస్థ ఎస్.ఎస్. క్రియెషన్స్
భాష తెలుగు

ముచ్చటగా ముగ్గురు1985 లో విడుదలైన హాస్య చిత్రం, ఎస్ఎస్ క్రియేషన్స్ పతాకంపై రామానాయుడు సమర్పణలో [1] రేలంగి నరసింహారావు దర్శకత్వంలో యార్లగడ్డ సురేంద్ర నిర్మించాడు.[2] ఇందులో చంద్ర మోహన్, రాజేంద్ర ప్రసాద్, తులసి, పూర్ణిమ ప్రధాన పాత్రల్లో నటించగా చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[3] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టైంది.[4]

కథ

రాధా (తులసి), వాణి (పూర్ణిమ) తోబుట్టువులు, అనాథలు. లింగారావు (అల్లు రామలింగయ్య) ఇంట్లో అద్దెకుంటున్నారు. లింగారావు డబ్బు మనిషి. వారిని ఎప్పుడూ అద్దెకు ఇబ్బంది పెడుతూంటాడు. కాని అతని భార్య శేషమ్మ (నిర్మలమ్మ) వారిని తన సొంత కుమార్తెలుగా చూసుకుంటుంది. రాంబాబు (చంద్ర మోహన్) యువకుడూ, చలాకీ అయిన వ్యక్తి. ఉద్యోగం కోసం నగరానికి వస్తాడు. అతనికి ఉండటానికి తక్కువ అద్దెలో ఇల్లు కావాలి. అనుకోకుండా అతను ఈ ఇద్దరు సోదరీమణులను కలుసుకుంటాడు. వారితో కలిసి ఒకే ఇంట్లో నివసించడానికీ, అద్దెను పంచుకోవడానికీ ఒక ప్రణాళికను తయారుచేస్తాడు. ఇద్దరు సోదరీమణులు ఎలాగూ అద్దె భరించలేక పోతున్నారు. అతను తమ పిన్ని కొడుకుగా పరిచయం చేసి రాంబాబును తమతో పాటు ఇంటిలో ఉండనిచ్చేలా చేస్తారు. ఆ ఇద్దరు అమ్మాయిలు, అతనూ ఒకే ఇంట్లో నివసించే కామిక్ కథే మిగతా సినిమా.

నటవర్గం

సాంకేతిక వర్గం

 • కళ: భాస్కర రాజు
 • నృత్యాలు: ఆంథోనీ
 • కథ: ఎస్ఎస్ క్రియేషన్స్ యూనిట్
 • సంభాషణలు: డి.వి.నరస రాజు
 • సంగీతం: చక్రవర్తి
 • ఛాయాగ్రహణం: ఎస్.హరీనాథ్
 • కూర్పు: డి.రాజా గోపాల్
 • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అక్కినేని వెంకటరత్నం
 • ప్రెజెంటర్: డి.రమానాయిడు
 • నిర్మాత: యర్లగడ్డ సురేంద్ర
 • చిత్రానువాదం - దర్శకుడు: రేలంగి నరసింహారావు
 • బ్యానర్: ఎస్ఎస్ క్రియేషన్స్
 • విడుదల తేదీ: 1985 మే 10

పాటలు

ఎస్ పాట పేరు గాయకులు పొడవు
1 "ముచ్చటగా ముగ్గురం" ఎస్పీ బాలు, పి.సుశీల, ఎస్పీ శైలజ 4:12
2 "చినుకు వచ్చి తాకాలా" ఎస్పీ బాలు, పి.సుశీల 3:56
3 "ఓహో తారక" ఎస్పీ బాలు 4:26
4 "కొంగా కొంగా" మాధవపెద్ది రమేష్, ఎన్. బాబు, మంజు, రమోలా 3:43

మూలాలు