"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ముదివర్తి కొండమాచార్యులు

From tewiki
Jump to navigation Jump to search

ముదివర్తి కొండమాచార్యులు నెల్లూరు జిల్లా గూడూరు వాస్తవ్యుడు. ఇతడు 1923, సెప్టెంబర్ 2న జన్మించాడు. ఇతడు మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ‘విద్వాన్‌’ పట్టా పుచ్చుకున్నాడు. నెల్లూరు జిల్లా పరిషత్తు ఉన్నతపాఠశాలల్లో 30 సం||లు ప్రధానాంధ్రపండితుడిగా పనిచేసి ఉద్యోగ విరమణచేశాడు. 1980లో తిరుమల తిరుపతి దేవస్థానంవారి పుస్తక ప్రచురణ విభాగంలో ఉపసంపాదకునిగా చేరి ఆ విభాగం సంచాలకునిగా పనిచేశాడు[1].

రచనలు

 • హిందూ ధర్మ పరిచయము, స్తోత్ర మంజరి - సముద్రాల లక్ష్మణయ్యతో కలిసి
 • ముకుందమాల
 • చ్యవనమహర్షి
 • అన్నమయ్య విన్నపాలు
 • ఆనంద నిలయము
 • అమృతసారము
 • శ్రీనివాసతేజము
 • బ్రహ్మగాంధర్వము
 • మధూకమాల
 • కూనలమ్మ
 • వీరమనీడు
 • ధర్మదీక్ష - ఖండకావ్యం
 • నారాయణమ్మ
 • త్యాగమూర్తి చారిత్రక నవల
 • రాజర్షి
 • కనిష్ఠ భిక్షువు
 • కుమార రాముడు
 • పూర్ణాహుతి

మూలాలు