రంగనాయకమ్మ

From tewiki
Jump to navigation Jump to search
రంగనాయకమ్మ

రంగనాయకమ్మ సుప్రసిద్ధ మార్కిస్టు, స్త్రీవాద రచయిత్రి. ఈమె రచనల్లో రామాయణాన్ని మార్క్సిస్టు దృక్పధంతో విమర్శిస్తూ రాసిన రామాయణ విషవృక్షం ఒకటి. స్త్రీవాద రచయిత కావడం వల్ల 'పురుష వ్యతిరేకి'గానూ, రామాయణ విషవృక్షం రాయడం వల్ల 'బ్రాహ్మణ వ్యతిరేకి' గానూ ఈమెకి పేరు.

ఆమె వ్రాసిన నవల స్వీట్ హోం.

జీవితం

రంగనాయకమ్మ, పశ్చిమ గోదావరి జిల్లా బొమ్మిడి గ్రామములో 1939లో జన్మించారు. ఈమె తాడేపల్లిగూడెంలో ఉన్నత పాఠశాలలో చదివి 1955లో ఎస్.ఎస్.ఎల్.సీ ఉత్తీర్ణురాలయ్యారు. ఈమె తల్లితండ్రులు ఉన్నత చదువులకొరకు దూరప్రాంతములోని కళాశాలకు పంపించి చదివించలేని కారణముగా ఈమె విద్యాభ్యాసము అంతటితో ఆగిపోయింది.

రంగనాయకమ్మ 1958లో సాంప్రదాయకముగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొన్నారు. కానీ విరుద్ధ భావాలతో కొనసాగలేక 1970లోవివాహము నుండి బయటపడ్డారు. అప్పటి నుండి తన కంటే వయసులో పది సంవత్సరాలు చిన్నవాడు, తన అభిమాని, పాఠకుడు అయిన బీ.ఆర్.బాపూజీ (అలియాస్ గాంధీ) తో కలసి నివసిస్తున్నారు.

ఇంటి పేరు

తన మొదటి రచనల్లో తండ్రి ఇంటి పేరుతో 'దద్దనాల' రంగనాయకమ్మగా పాఠకులకి పరిచయం. 1958 నుంచి 1970 మధ్య కాలంలో 'ముప్పాళ' రంగనాయకమ్మగా పరిచయం. మొదటి వివాహం నుంచీ బయటపడిన తరువాత తన పేరు నుంచీ 'ముప్పాళ' తీసేసి కేవలం 'రంగనాయకమ్మ'గా పరిచయం.

రచయిత్రిగా

విమర్శకురాలిగా

ఈమె అనేక విషయాల పై అనేక విమర్శలు చేస్తుంటారు. గాంధి లాంటి పేరొందిన వ్యక్తుల్ని కూడా విమర్శించారు. వరవరరావు గారు చేతకాని వాళ్ళని కొజ్జా వాళ్ళతో పోలుస్తూ ఒక కవిత వ్రాసినప్పుడు స్త్రీలని, కొజ్జావాళ్ళని కించపరిచే భాష వాడడం ఎందుకు తప్పో వివరిస్తూ రంగనాయకమ్మ గారు వ్యాసం వ్రాసారు. ఆ వ్యాసం చదివి వరవరరావు గారు వెంటనే తప్పుని అంగీకరించారు. అసమానత్వం నుంచి అసమానత్వం లోకే ఈమె వ్రాసిన విమర్శనాత్మక రచనలలో ఒకటి.

వివాదాలు

ఈమె వ్రాసిన నవల 'జానకి విముక్తి' ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్ గా వస్తూ ఉన్న రోజుల్లోనే వివాదాస్పదం కావడం వల్ల మధ్యలోనే ఆగి పోయింది. తరువాత ఆ నవల పుస్తక రూపంలో విడుదల అయ్యింది. నీడతో యుద్ధం పుస్తకంలో గోరా, జయగోపాల్, సి.వి., ఎమ్.వి. రామ మూర్తి వంటి నాస్తిక రచయితల్ని విమర్శిస్తూ ఈమె వ్యాసాలు వ్రాయడం వల్ల విశాఖపట్నం నాస్తికులు ఈ సీరియల్ ని నిలిపి వెయ్యలని కోరుతూ పత్రిక ఎడిటర్లకి ఉత్తరాలు వ్రాసారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో తీవ్ర సంచలనం కలిగించిన యండమూరి వీరేంద్రనాథ్ నవల 'తులసిదళం' ని విమర్శిస్తూ 'తులసిదళం కాదు గంజాయి దమ్ము' అనే వ్యాస సంకలనం వ్రాసారు. వాటిలో యండమూరితో బాటు ఆ నవలకు ముందుమాట వ్రాసిన డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావును కూడా విమర్శించడం వల్ల అతను పరువు నష్టం దావా వేసి గెలిచాడు.[ఆధారం చూపాలి]

"జన సాహితి" సంస్థలో రంగనాయకమ్మ

మరిన్ని వివరాలకోసం జన సాహితితో మా విభేదాలు పుస్తకం గురించిన వ్యాసం చూడండి.

నవలలు

ఇతర రచనలు

బయటి లంకెలు