"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం
| ||||||||||||||||||||||||
మూస:Campaignbox Third Anglo-Mysore War |
మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం (1789-92) దక్షిణ భారతదేశంలో మైసూరు సామ్రాజ్యానికీ, ఈస్టిండియా కంపెనీ-మిత్రరాజ్యాలైన హైదరాబాద్ నిజాం, మరాఠాలతో జరిగిన యుద్ధం. మొత్తం నాలుగు ఆంగ్లో మైసూరు యుద్ధాల్లో ఇది మూడవది.
నేపథ్యం
మైసూరు రాజ్యపు పరిపాలకుడైన టిప్పు సుల్తాన్, అతనికి ముందు తండ్రి హైదర్ అలీ కాక బ్రిటీష్ సైన్యంతో దీనికి ముందు జరిగిన యుద్ధాలలో రెండుసార్లు తలపడ్డారు. మొదటి ఆంగ్లో-మైసూరు యుద్ధం 1760లో జరిగి స్పష్టమైన ఫలితాలు లేకుండానే ముగిసింది. ఐతే ఈ యుద్ధానంతరం సంధిలో భావి సంఘర్షణల్లో ఒకరికొకరు సహకరించుకోవాలని నిబంధించారు. మరాఠా సామ్రాజ్యంతో జరిగిన అనంతర యుద్ధాల్లో బ్రిటీష్ వారు మైసూరుకు సహకారం చేయకపోవడం, మైసూరు శత్రువులకు లాభం కలిగించేలా వ్యవహరించడం హైదర్ అలీకి బ్రిటీషర్లపై అయిష్టత ఏర్పడేందుకు కారణమయ్యింది. 1779లో ఫ్రెంచి-నియంత్రణలో ఉన్న మహె పోర్టు బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ తీసుకుంది. హైదర్ ఈ పోర్టు ద్వారానే సైనిక సంపత్తిని స్వీకరిస్తూండడంతో ఆయనకు ఇది అత్యంత కీలకమైనది. దీని కారణంగా రెండవ ఆంగ్లో-మైసూరు యుద్ధం ప్రారంభమైంది.
![]() |
Wikimedia Commons has media related to Third Anglo-Mysore War. |