"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మూల కణం

From tewiki
Jump to navigation Jump to search

అన్నిట్లోనూ కాకపోయినా, ఎన్నో బహుకణ కణాలు ఉంటాయి. కణ విభజన ద్వారా ఇవి సంఖ్యలో పెరుగుతూ, విభేదన చెందుతూ విస్తృత వైవిధ్యం గల ప్రత్యేక కణాలుగా మారుతాయి. 1960 లలో ఎర్నెస్ట్ ఎ. మక్కల్లో, మరియు జేమ్స్ ఇ. టిల్ అనబడే కెనేడియన్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల మూలంగా మూల కణాల రంగం ఎంతో పురోగమించింది.

స్తమన్య జీవులలో దొరికే మూల కణాలలో రెండు ముఖ్యమైన రకాలు ఉంటాయి: 1) పిండ మూల కణాలు: ఇవి బ్లాస్టోసిస్ట్ లలోని అంతరంగ కణ రాశి నుండి వెలికి తీయబడతాయి. 2) ఎదిగిన మూల కణాలు: ఇవి ఎదిగిన ధాతువులలో కనిపిస్తాయి.

ఎదుగుతున్న పిండంలోని మూల కణాలు, అన్ని రకాల ప్రత్యేక పిండ ధాతువులుగాను విభేదన చెందగలవు. ఎదిగిన జీవాలలో, మూల కణాలు మరియు పూర్వ కణాలు, దేహం ధాతువుల్లో దోషాలని చక్కదిద్దడం, నాశనం అయిపోయిన ప్రత్యేక కణాలని తిరిగి భర్తీ చెయ్యడం వంటి పనులు చేస్తుంటాయి. ఇవి కాక పునరుజ్జీవితం కాగల అవయవాలలో చచ్చిపోయిన ధాతువు స్థానంలో కొత్త ధాతువు వచ్చే సహజ ప్రక్రియలో కూడా ఈ ఎదిగిన మూలకణాలు పాత్ర వహిస్తాయి.

ఎలుక మూలకణాలతో గుండె కండరాల సృష్టి

ఎలుక పిండం నుంచి సేకరించిన మూలకణాల సహాయంతో ప్రయోగశాలలో గుండె కండరాలను సృష్టించడంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు విజయం సాధించారు. ఈ కండరాలను ఉపయోగించి హృదయ సంబంధ సమస్యల్ని పరిష్కరించే వీలుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.(ఈనాడు19.10.2009)