"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మూస:అసెంబ్లీ నియోజకవర్గం 1

From tewiki
Jump to navigation Jump to search

ఆదిలాబాదు జిల్లాలోని 10 శాసనసభ (అసెంబ్లీ) నియోజకవర్గాలలో సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. భౌగోళికంగా అదిలాబాదు జిల్లా తూర్పువైపున ప్రాణహిత నది ఒడ్డున ఉన్న ఈ నియోజకవర్గం 1962 నుండి 1999 వరకు వరుసగా ఒక్కో అభ్యర్థికి రెండేసి సార్లు గెలిపించింది. 1962 నుండి 1978 వరకు వరుసగా నాలుగు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, 1983, 1985, 1999 లలో తెలుగుదేశం గెలుపొందింది. 2004 ఎన్నికలలో విజయం కాంగ్రెస్‌కు వరించింది. ఈ నియోజకవర్గం మరో 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. రాష్ట్రంలోనే మొదటి నంబరు అసెంబ్లీ నియోజకవర్గం స్థానం ఈ నియోజకవర్గానికి లభించింది. ఇదివరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గం తొలి నంబరు ఉండగా ప్రస్తుతం ఆ స్థానం దీనికి లభించింది.