"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మృతి

From tewiki
(Redirected from మృత్యువు)
Jump to navigation Jump to search

మృతి [ mṛti ] mṛiti. సంస్కృతం mṛi = to die.] నామవాచకం గా. Death చావు అని అర్ధం.

మృతిబొందు mṛiti-bondu. v. n. To die. చచ్చు.

మృతుడు mṛituḍu. n. One who is deceased, or dead. చచ్చినవాడు. జీవన్మృతుడు dead while alive.

మృతము mṛitamu. adj. Dead, expired. చచ్చిన.

మృతమర్త్యుడు mṛita-nashṭamu. a dead man.

మృతనష్టము. adj. Dead, merged, extinct, as a family or heirship. వారు మృతనష్టమైపోయినాడు the family became extinct.

మృత్యువు mṛityuvu. n. Death. మరణము. The god of death, కృంతాంతుడు, మరణాధిదేవత. 1. చంపెడు దేవత. తొల్లి ప్రజాపతి ప్రజల సృజియించి పదపడి తత్సంహారము లేమిఁజేసి భూమికి తదీయ భారము దుర్భరము అగుట అనుసంధించి రక్తాస్యయు, అసితాంగయు, అరుణాంబరయును అగు ఒక ఇంతిని కల్పించి దానికి ఈపేరు పెట్టి జంతుసంహారమునకు నియమించెను. అందుకు ఆమె పరమదుఃఖిత అయి ఇంత కష్టపు పనిని నేను చేయచాలను అని కన్నీరు తొరగ ఏడ్వగా బ్రహ్మదేవుడు ఆ అశ్రుబిందువులను తన పాణిపుటంబులబట్టి ఆబిందువులు ఎన్ని ఉన్నవో అన్నియు అన్నిరోగములు అయి జంతువులను చావచేయగలవు అనియు, లోభమును క్రోధమును ఈర్ష్యయు అసూయయు జంతువుల శరీరములను వికలత పొందింపఁగలవు అనియు చెప్పి ఆమృత్యుదేవిని సమాధానపఱచి పంపెను.

మృత్యుంజయుడు mṛityun-jayuḍu. n. The victor over death, i.e., Siva. చిరంజీవి.

మృత్యుసూతి mṛityu-sūti. n. That which bears young, and then dies, i.e., the crab, which, like the viper, is supposed to be destroyed by its young. పీత.