"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మృదుల సిన్హా

From tewiki
Jump to navigation Jump to search
మృదులా సిన్హా
మృదుల సిన్హా


గోవా గవర్నర్
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
26 ఆగస్టు 2014
ముందు ఓం ప్రకాష్ కోహ్లీ

వ్యక్తిగత వివరాలు

జననం (1942-11-27) 27 నవంబరు 1942 (వయస్సు 78)
ముజఫాపూర్, బీహార్, బ్రిటిష్ ఇండియా
జీవిత భాగస్వామి డా,రాం కృపాల్ సిన్హా
నివాసము రాజ్ భవన్ (గోవా), డోనా పౌలా (గోవా)[1]
మతం హిందూ

మృదుల సిన్హా (జననం 1942 నవంబరు 27) గోవా రాష్ట్రానికి గవర్నర్.[2] ఆమె రాజకీయ నాయకురాలు కావడమే కాక, సుప్రసిద్ధ హిందీ రచయిత్రి కూడా.[3][4]

తొలినాళ్ళ జీవితం

మృదులా సిన్హా బీహార్ రాష్ట్రం, మిథిలా ప్రాంతానికి చెందిన ముజఫర్‌పూర్ జిల్లాలోని చప్ర ధరంపూర్ గ్రామంలో నవంబర్ 27, 1942న జన్మించింది. ఆమె  తండ్రి  బాబు  చబిలే సింగ్,  తల్లి అనుపా  దేవి.  ఆమె గ్రామంలోనే ఉన్న స్థానిక పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తిచేసింది. ఆ తరువాత లఖిసరై జిల్లాలోని బాలికా విద్యాపీఠ్ అనే రెసిడెన్షియల్ పాఠశాలలో చదువు కొనసాగించింది.[5] చిన్నప్పటినుంచే హిందీ సాహిత్యం  పట్ల  ఇష్టం  పెంచుకున్న  ఆమె,  తరువాత  హిందీ  భాషలో  గద్య  సాహిత్యం రాయడం  ప్రారంభించింది. ఆమె బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేయుటకు ముందు ఆమె తల్లిదండ్రులు డా.రాం కృపాల్ సిన్హాతో వివాహం చేయుటకు నిశ్చయించారు. అతడు బీహార్ లోని ముజఫర్‌పూర్ లో కళాశాల అధ్యాపకునిగా పనిచేసేవాడు. వివాహం తరువాత ఆమె తన విద్యభ్యాసాన్ని కొనసాగించి మనోవిజ్ఞాన శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసింది. ఆమె మోతీహరి లోని డా. ఎస్.కె.నిన్హా మహిళా కళాశాలలో అధ్యాపకురానిగా చేరింది. కొంత కాలం తరువాత ఆమె భర్త డాక్టరేట్ డిగ్రీని పొందాడు. ఆమె తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి ముజఫర్‌పూర్ లో పాఠశాలను ప్రారంభించింది. అక్కడ ఆమె భర్త కళాశాలలో పనిచేస్తుండేవాడు. ఆమె స్థాపించిన పాఠశాల ఆదర్శవంతంగా ఉండటం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులను పొందింది.

వృత్తి

ఆమె తన భర్త ప్రోత్సాహంతో, రచనా నైపుణ్యాలను పెంపొందించుకొంది. ఆమె లఘు కథతో ప్రయోగాత్మకంగా రచనను ప్రారంభించింది. ఆమెకు గ్రామీణ సంప్రదాయాలు మరియు సాంస్కృతిక విషయాలపై ఆసక్తి ఉండేది. ఆమె ఈ అంశాలపై అనేక లఘు కథలను వ్రాసింది. ఆమె భర్త పనిచేసే ప్రాంతంలో గల గ్రామీణ ప్రజల నుండి అనేక జానపద కథలను సేకరించింది. వాటిలోని అనేక కథలు హిందీ భాషా పత్రికలలో ప్రచురితమయ్యాయి. తరువాత వాటిని రెండు సంపుటాలుగా "భీహార్ కి లోక్ కథాయేం" (బీహార్ జానపథ కథలు) వెలువరించింది. ఆమె అనేక నవలలు మరియు "రాజమాత విజయరాజె సింధియా" జీవిత చరిత్ర "ఏక్ థీ రానీ ఐసే భీ"ని రచిందింది. ఈ పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఒక సినిమా నిర్మాణం జరిగింది. [6]

సమాజ సంక్షేమం కోసం రాం కృపాల్ సిన్హా యొక్క నిబద్ధత కారణంగా ఆయన జిల్లాస్థాయిలో రాజకీయ రంగం వైపు దృష్టి సారించాడు. ప్రారంభంలో మృదులా భర్తకు సహాయ సహకారాలనందించేది. జిల్లా కమిటీ ఎన్నికల కోసం ప్రచార సమయంలో నియోజక వర్గంలోని మహిళలకు చేరుకోవడంలో తన భర్తకు సహాయపడింది.

ఆమెకు స్థానిక సంప్రదాయాలు మరియు సంస్కృతిని తన జ్ఞానంతో గుర్తించి, స్థానిక ప్రజలతో (ప్రత్యేకంగా స్త్రీలతో) బలమైన అనుబంధం ఏర్పరచుకుంది. ఆమె సాంఘిక సంక్షేమం కొరకు బలమైన ఆసక్తి మరియు నిబద్ధతను అభివృద్ధి చేసుకుంది. కానీ ఆమెకు ఎన్నికల రాజకీయాలపై ఆసక్తి ఉండేది కాదు. ఆమె ఎప్పుడూ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆమె సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డుకు చైర్ పర్సన్ గా ఉన్నారు. [7]

రాజకీయ జీవితం

ప్రస్తుతం ఆమె భర్త భీహార్ రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్నాడు. [8] ఆమె ఆగస్టు 2014 వరకు భారతీయ జనతా పార్టీకి జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా ఉండేది. [9] 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో ఆమె భారతీయ జనతా పార్టీ కోసం ప్రచారాన్ని చేసింది. ఆమె బి.జె.పి మహిళా మోర్చా (స్త్రీ విభాగం) కు ఇన్-ఛార్జిగా ఉంది. 2014 ఆగస్టు 25 న ఆమె గోవాకు గవర్నర్ బాధ్యతలు స్వీకరించింది. ఆమె భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చే ప్రారంభించబడిన స్వచ్ఛ భారత్ అభియాన్కు అంబాసిడర్ గా నియమితురాలయింది. [10][11] గోవా గవర్నర్ గా సేవలందిస్తున్న కాలంలో ఆమె రాజ్ భవన్ లో ప్రతిదినం పూజ చేయుటకు ఒక ఆవు, దూడలను స్వీకరించింది. [12][13]

సాహితీ సేవలు

 • ఏక్ థీ రానీ ఐసీ భీ (లఘు జీవిత చరిత్ర)
 • నయీ దేవయానీ (నవల)
 • ఘర్‌వాస్ (నవల)
 • జో మెహందీ కో రంగ్ (నవల)
 • దేఖా మై చోటే లగే (కథలు)
 • సీతా పూనీ బోలీ (నవల)
 • యయవారి ఆంఖోం సె (ఇంటర్వ్యూలు)
 • బీహార్ కి లోక్ కథాయేం -I (కథలు)
 • బీహార్ కీ లోక్ కథాయేం -II (కథలు)
 • దై బీగా జమీన్ (కథలు)
 • మాత్ర్ దే నహీ హై ఔరత్ (మహిళా స్వేచ్ఛ)
 • నారీ న కథ్‌పుటిల్ న ఉదన్‌పరి - యాష్ పబ్లికేషన్స్., న్యూఢిల్లీ
 • అపనా జీవన్ - యాష్ పబ్లికేషన్స్., న్యూఢిల్లీ
 • అంతిమ్‌ ఇచ్చా - యాష్ పబ్లికేషన్స్., న్యూఢిల్లీ
 • పరితప్త్ లంకేశ్వరి (2015) [14]
 • ముఝే కుచ్ కహనా హై ( 2015 కవిత) - యాష్ పబ్లికేషన్స్., న్యూఢిల్లీ
 • ఔరత్ ఆవిక్షిత్ పురుష్ నహీ హై - యాష్ పబ్లికేషన్స్., న్యూఢిల్లీ
 • చంతా ఔర్ చింతాకె ఇంద్రధనుషాయేం రంగ్ (2016) - యాష్ పబ్లికేషన్స్., న్యూఢిల్లీ
 • ఇండియన్ వుమెన్ న్యూ ఇమేజస్ ఆన్ ఏన్సియెంట్ ఫౌండేషన్ (2016) - యాష్ పబ్లికేషన్స్., న్యూఢిల్లీ
 • యా నారీ సర్వ్‌భూతేషు (2016) - యాష్ పబ్లికేషన్స్., న్యూఢిల్లీ
 • రెల్ఫికేషన్స్ (2017) - యాష్ పబ్లికేషన్స్., న్యూఢిల్లీ
 • ఏక్ సాహిత్య తీర్థ్ స్వ లౌత్కర్ - యాష్ పబ్లికేషన్స్., న్యూఢిల్లీ

[15][16] సినిమాలు & టెలివిజన్ : మృదులా సిన్హా రచించిన "జో మెహందీ కో రంగ్" నవల టెలివిజన్ సీరియల్ కొరకు స్వీకరించారు. ఆమె రాసిన లఘు కథ "దత్తక్ పీఠ" మరియు విజయరాజ సింధియా రాజపథ్ సె లోక్ పథ్ పార్ యొక్క జీవిత చరిత్రలు సినిమాలుగా నిర్మించబడినవి. ఆమె రాసిన ప్రధాన సాహిత్య పనులు జాతీయ పురస్కార విజేత అయిన సినిమా నిర్మాత గుల్‌బహర్ సింగ్ స్వీకరించాడు.

ఆంగ్లంలోనికి అనువాదాలు

 • ప్లేమ్స్ ఆఫ్ డిసైర్ [17]

మరాఠీ లోనికి అనువాదాలు

 • అనుతప్త్ లంకేశ్వరి, రాజశ్రీ ఖండేపర్కార్ చే అనువదింపబడింది[18]

గుర్తింపులు

ఆమె ముజఫర్‌బాద్, బీహార్ లోణి బాబాసాహెబ్ భీంరావ్ అంబేద్కర్ బీహార్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందింది.[19][20]

మూలాలు

 1. http://www.rajbhavangoa.org/page.php?id=30
 2. "PRESS COMMUNIQUE". Press Information Bureau. 26 August 2014. Retrieved 26 August 2014.
 3. "Sheila Dikshit resigns; Kalyan Singh is new Governor of Rajasthan". Indian Express. PTI. 26 August 2014. Retrieved 26 August 2014.
 4. "Mridula Sinha appointed Goa Governor". Goa News. Goa News Desk. 26 August 2014. Retrieved 26 August 2014.
 5. Balika Vidyapeeth
 6. Cite error: Invalid <ref> tag; no text was provided for refs named IE-App2
 7. "Governing Body, Social action through integrated work". SATHI. 2008-11-19. Retrieved 2008-11-19.
 8. "Want to Serve People: New Goa Governor Mridula Sinha". The New Indian Express. IANS. 26 August 2014. Retrieved 26 August 2014.
 9. "National Executive - Bharatiya Janata Party". Archived from the original on 3 July 2014. Retrieved 26 August 2014.
 10. http://timesofindia.indiatimes.com/india/Swachh-Bharat-PM-Modi-ropes-in-nine-people-including-Tendulkar-Salman-Khan-Baba-Ramdev/articleshow/44085909.cms
 11. http://www.narendramodi.in/pm-launches-swachh-bharat-abhiyaan/
 12. http://www.heraldgoa.in/Goa/Cowshed-at-Raj-Bhavan-gets-a-cow/81231.html
 13. http://www.thehindu.com/news/national/other-states/goa-governor-adopts-cow-for-daily-worship/article6615560.ece
 14. https://www.amazon.in/Paritapt-Lankeshwari-Mridula-Sinha/dp/935186166X
 15. "Books by Mridula Sinha". flipkart.com. Retrieved 26 August 2014.
 16. "Books by Mridula Sinha". books.google.com. Google Books. Retrieved 26 August 2014.
 17. Cite error: Invalid <ref> tag; no text was provided for refs named G-books2
 18. http://www.prudentmedia.in/general/author-governormridula-sinhas-book-translated-in-marathi.html
 19. http://www.telegraphindia.com/1150715/jsp/bihar/story_31540.jsp#.VgWD1dLzrIU
 20. http://www.goainfomedia.com/bihar-university-to-confer-honarary-d-litt-on-smt-mridula-sinha/

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).