మెట్రిక్యులేషన్

From tewiki
Jump to navigation Jump to search
ఆక్స్‌ఫర్డ్ వద్ద జరిగే మెట్రిక్యులేషన్ వేడుక

మెట్రిక్యులేషన్ (ఆంగ్లం: Matriculation) లాటిన్ పదమైన మెట్రిక్యులా (Matricula) - అనగా చిన్న జాబితా, అనే పదం నుంచి పుట్టి, విస్తృతార్థంలో, నమోదు చేసుకోవాల్సినది లేదా ఏదైనా ఒక జాబితాలో చేర్చుకోవాల్సినది అనే అర్థాన్నిస్తుంది. ఉదాహరణకు, స్కాటిష్ వంశావళి శాస్త్రాల్లో, మెట్రిక్యులేషన్ అంటే కులబిరుదు సంబంధ చిహ్నాల నమోదు అని అర్థం. అయినప్పటికీ, సాధారణమైన అర్థంలో, ఒక విశ్వవిద్యాలయ ప్రవేశ సంబంధ లాంఛనప్రాయమైన విధానాన్ని లేదా సరిసమానమైన ప్రాథమిక అభ్యర్థనలను సముపార్జించి ప్రవేశానికి అర్హత సాధించడాన్ని సూచిస్తుంది.

ప్రదేశాన్ని అనుసరించి

ఆస్ట్రేలియా

1960లు మరియు 1970ల వరకు, ఉన్నత పాఠశాల యొక్క చివరి సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించి ఫార్మ్ 6ను పూర్తి చేయడాన్ని సూచించడానికి "మెట్రిక్యులేషన్" క్లుప్తంగా "మెట్రిక్" ను (ఇతర కామన్వెల్త్ దేశాల మాదిరిగా) ఉపయోగించేవారు. అది తృతీయ విద్యలో ప్రవేశానికి ప్రాథమిక అభ్యర్థనగా ఉండేది.

బంగ్లాదేశ్

బంగ్లాదేశ్‍లో, క్లుప్తంగా "మెట్రిక్" అనేది 10వ సంవత్సరంలో జరిగే సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ (ఎస్‍ఎస్‍సి)ని సూచిస్తుంది, ఇది సాధారణంగా ఆంగ్ల GCSE కి సమం.

కెనడా

కెనడాలో, కొన్ని పాత విశ్వవిద్యాలయాల్లో సంబంధిత ("ఫ్రోష్") ఉదంతాల్లో[citation needed] ఈ పదాన్ని ఉపయోగిస్తారు, అయినప్పటికీ, యూనివర్సిటీ అఫ్ కింగ్స్ కాలేజ్‍తో సహా, కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికీ లాంఛనప్రాయంగా మెట్రిక్యులేషన్ వేడుకలను జరుపుకుంటారు. కింగ్స్ వద్ద జరిగే వేడుక దాదాపు ఆక్స్‌ఫర్డ్ లేదా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల్లో జరిగే మెట్రిక్యులేషన్ వేడుకల మాదిరిగానే ఉంటుంది. ఓంటారియోలో గ్రేడ్ 13 దశ కొనసాగుతున్నప్పుడు, గ్రేడ్ 12 యొక్క తృప్తికరమైన ముగింపును జూనియర్ మెట్రిక్యులేషన్‍గా పరిగణనలోకి తీసుకునేవారు. 13వ గ్రేడ్ ను తృప్తికరంగా పూర్తిచేస్తే అది సీనియర్ మెట్రిక్యులేషన్. ప్రస్తుతం నోవా స్కాటియాలో, 11వ గ్రేడ్ అనేది జూనియర్ మెట్రిక్యులేషన్ మరియు 12వ గ్రేడ్ పూర్తవడాన్ని సీనియర్ మెట్రిక్యులేషన్ అంటున్నారు.

చెక్ రిపబ్లిక్

చెక్ రిపబ్లిక్ దేశంలో, ప్రాగ్ లోని కరోలినమ్ యొక్క గ్రేట్ హాల్ (మాగ్నా ఔలా) వద్ద మెట్రిక్యులేషన్ జరుగుతుంది. ప్రాగ్ లోని చార్లెస్ విశ్వవిద్యాలయం వద్ద తమ చదువులను కొనసాగించబోయే విద్యార్థులు ఆ వేడుకకు హాజరవుతారు. విద్యార్థి విధులను స్వీకరించడానికి మరియు విద్యార్థి హక్కులను గ్రహించడానికి జరిపే ప్రదర్శనే దీని ముఖ్యోద్దేశ్యం. ఈ వేడుకలో భాగంగానే విశ్వవిద్యాలయ విద్యార్థుల మెట్రిక్యులేషన్ ప్రమాణ స్వీకారం మరియు విజ్ఞాన విభాగ దండాన్ని సూచనప్రాయంగా ముట్టుకోవడం మరియు డీన్‍తో కరచాలనం చేయడం లాంటి విధులు నిర్వర్తిస్తారు.

డెన్మార్క్

డెన్మార్క్ ‍లో, కోపెన్‍హాగన్ విశ్వవిద్యాలయం ప్రతి సంవత్సరం మెట్రిక్యులేషన్ వేడుకను నిర్వహిస్తుంది. ఆ వేడుక విశ్వవిద్యాలయపు ప్రధాన కట్టడంలోని హాల్ అఫ్ సెరెమొనీలో జరుగుతుంది. విద్యావిషయమైన దుస్తుల్లో మరియు ఇతర రాచచిహ్నాలతో ఉన్న రెక్టర్ మరియు డీన్‍లతో కూడిన ఊరేగింపుతో ఆ వేడుక ప్రారంభమౌతుంది. రెక్టర్ వివిధ విభాగాల జాబితా చదువుతూంటే, ఆయా విభాగాలకు చెందిన విద్యార్థులు తమ విభాగాన్ని పేర్కొనగానే గట్టిగా అరుస్తూండగా వేడుక కొనసాగుతూ ఉంటుంది. రెక్టర్ మరియు డీన్‍లు మళ్ళీ ఊరేగింపులో వేడుకను వదిలిన తర్వాత, విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కొత్త విద్యార్థుల ప్రవేశాన్ని గుర్తించే పార్టీ జరిగిన తర్వాత, రెక్టర్ తన ప్రసంగాన్ని వినిపిస్తాడు.

భారతదేశం

భారతదేశంలో, సాధారణంగా మెట్రిక్యులేషన్‍ అనే పదాన్ని పదవ తరగతి (పదవ గ్రేడు) తో ముగిసే, ఉన్నత పాఠశాల యొక్క ఆఖరి సంవత్సరానికి సూచికగా వ్యవహరిస్తారు, ఇక సాధారణంగా "మెట్రిక్యులేషన్ పరీక్షలు" అని పిలిచే నేషనల్ బోర్డు పరీక్షలు లేదా స్టేట్ బోర్డు పరీక్షల ఉత్తీర్ణతను బట్టి ఆ విద్యార్హతను సాధించబడుతుంది. మెట్రిక్యులేషన్ కొరకు ప్రాంతీయ భాషలు కూడా ఎంచుకోదగినప్పటికీ, ఆంగ్లమే దానికి ప్రామాణిక భాష. మెట్రిక్యులేషన్, లేదా 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు చాలా వరకు 15-16 సంవత్సరాల వయసుగలవారై ఉంటారు. సఫలమైన ఉత్తీర్ణత మీద, ఒక విద్యార్థి తన చదువును జూనియర్ కళాశాలలో కొనసాగించవచ్చు. 11వ మరియు 12వ తరగతులను సాధారణంగా "మొదటి సంవత్సరం జూనియర్ కళాశాల" మరియు "రెండవ సంవత్సరం జూనియర్ కళాశాల" గా వ్యవహరిస్తారు. 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు చాలా వరకు 17-18 సంవత్సరాల వయసుగలవారై ఉంటారు. CBSE మరియు ICSE పీఠాలు పన్నెండవ తరగతి పాఠ్యాంశాలను జాతీయంగా నిర్వహిస్తే, రాష్ట్రీయ పీఠాలు రాష్ట్ర-స్థాయిలో నిర్వహిస్తాయి. మౌలికంగా బోధనా ప్రణాళికను CBSE చేత నిర్ధిష్ట పరిచినా, పాఠశాలను మరియు ప్రాంతాన్ని బట్టి విద్యలో నాణ్యత మారుతూ ఉంటుంది.

పాకిస్తాన్

పాకిస్తాన్‍ లో, మెట్రిక్యులేషన్ (క్లుప్తంగా "మెట్రిక్"అని వ్యవహరిస్తారు) అనే పదం 9 మరియు 10 గ్రేడ్ ల ఆఖరి పరీక్షలను సూచిస్తుంది. దాని ఫలితంగా SSC (సెకండరీ స్కూల్ సర్టిఫికేట్) లేదా TSC (టెక్నికల్ స్కూల్ సర్టిఫికేట్) జారీ చేయబడుతుంది. SSC (లేదా TSC) తర్వాత విద్యార్థులు 11 సంవత్సరపు విద్య కోసం కళాశాలలో చేరుతారు. 11 మరియు 12 సంవత్సరాల కళాశాల విద్య పూర్తయిన తర్వాత వారు ఇంటర్మీడియేట్ సర్టిఫికేషన్ (HSSC - హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్) పొంది, విశ్వవిద్యాలయ ప్రవేశార్హతను సంపాదిస్తారు.

దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికాలో, "మెట్రిక్యులేషన్" (క్లుప్తంగా "మెట్రిక్" అని వ్యవహరిస్తారు) అనే పదం సాధారణంగా ఉన్నత పాఠశాలకు చెందిన ఆఖరి సంవత్సరాన్ని సూచిస్తుంది మరియు ఆ విద్యార్హత ఉన్నత పాఠశాల నుండి గ్రాడ్యుయేట్ అవ్వడం ద్వారా సంక్రమిస్తుంది, అయినా ఖచ్చితంగా చెప్పాలంటే అది విశ్వవిద్యాలయ ప్రవేశానికి కనీసావసరంగా పరిగణింపబడుతుంది.

యునైటెడ్ స్టేట్స్

యునైటెడ్ స్టేట్స్ లో, లాంఛనమైన మెట్రిక్యులేషన్ ఆచారాన్ని కలిగి ఉన్న విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు: అన్నా మేరియా కళాశాల, అసంప్షన్ కళాశాల, బెల్‍మోంట్ అబ్బే కళాశాల, బోస్టన్ కళాశాల,[1] కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం, రైస్ విశ్వవిద్యాలయం, సెయింట్ లియో విశ్వవిద్యాలయం, టఫ్ట్స్ విశ్వవిద్యాలయం, వర్జీనియా మిలటరీ ఇన్‍స్టిట్యూట్, మౌంట్ హోలీఓక్ కళాశాల, డార్ట్‌మౌత్ కళాశాల, కెన్యన్ కళాశాల,[2] విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం-బారాబూ/సౌక్ కౌంటీ, మారియెట్టా కళాశాల,[3] ట్రినిటీ కళాశాల, కలమాజూ కళాశాల, లియోన్ కళాశాల, అల్బియోన్ కళాశాల,మౌంట్ యూనియన్ కళాశాల,[4] హామ్‍లైన్ విశ్వవిద్యాలయం,[5] లిండన్ స్టేట్ కళాశాల,[6] సెయింట్ మేరీ విశ్వవిద్యాలయం (కాన్సాస్) మరియు వాల్ష్ విశ్వవిద్యాలయం. ఇతర విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల వద్ద, "మెట్రిక్యులేషన్" అనేది డిగ్రీ సంపాదించుకోవాలనుకునే ఒక విద్యార్థి చేత ఏదైనా విశ్వవిద్యాలయం లేదా కళాశాల వద్ద కేవలం ఒక విద్యార్థిగా జాబితాలో చేర్పించడానికి లేదా నమోదు చేపించడానికి, కాగితాలకు సంబంధించిన మరియు మెయిల్ లేదా ఆన్‍లైన్‍లో[citation needed] సంబాళించబడే ఒక కార్యం. ఏదైనా ఒక విశ్వవిద్యాలయం, వాస్తవంగా డిగ్రీ కొరకై తమ ప్రామాణ్యాలను కూడబెట్టుకుంటున్న "మెట్రిక్యులేషన్ విద్యార్థులు", మరియు ప్రామాణ్యాలను[citation needed] పొందకుండా తమ పాఠ్యాంశాలను "తనిఖీ" చేసుకుంటూ లేదా తరగతులకు వెళ్తున్న "నాన్-మెట్రిక్యులేటెడ్" విద్యార్థుల మధ్య వివక్ష చూపవచ్చు.

కొన్ని వైద్య పాఠశాలలు మెట్రిక్యులేషన్‍ను తెల్ల కోటు వేడుకలో ప్రముఖంగా పేర్కొంటాయి. ఉదాహరణకు, UAB స్కూల్ అఫ్ మెడిసిన్[7] అలాగే చేస్తుంది.

సూపర్ బౌల్ IVలో, పక్క నుంచి మైక్రోఫోన్‍ను ధరించిన అమెరికన్ పుట్‍బాల్ కోచ్ హాంక్ స్ట్రామ్, అతని కాన్సాస్ సిటీ చీఫ్స్ తో " బాయ్స్, మైదానంలో ఉన్న బంతిని నేలమీదే కొద్ది కొద్దిగా మెట్రిక్యులేటిన్’ చేస్తూండండి" అని ఫుట్‍బాల్‍ను స్కోరు దిశగా నెట్టే ప్రక్రియ గురించి చెబుతూ, టెలివిజన్ ప్రసారంలో భాగంగా కనిపించాడు. అప్పటి నుండి, మరియు ప్రత్యేకంగా 2005లో స్ట్రామ్ చనిపోయినప్పటి నుండి, క్రీడా వ్యాఖ్యాతలు "బంతిని నేలమీదే మెట్రిక్యులేట్ చేయండి" అనే శబ్దాన్ని అదే అర్థాన్ని స్ఫురించే విధంగా వాడటం మొదలెట్టారు. అయినప్పటికీ, ఈ పదాన్ని ఇలా ఉపయోగించడానికీ నిజంగా ఆ పదం యొక్క అసలైన ఉపయోగానికీ ఎలాంటి సంబంధం లేదు.

యునైటెడ్ కింగ్‌డమ్

ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్,[8] బ్రిస్టల్ మరియు డర్హమ్ లకు చెందిన ఆంగ్ల విశ్వవిద్యాలయాల్లో, కొత్త విద్యార్థులు విశ్వవిద్యాలయపు రిజిస్టర్ (లాటిన్ మెట్రిక్యులా లో) లోనికి చేర్చుకోబడి, వాళ్ళు విశ్వవిద్యాలయపు సభ్యులుగా మారుతున్నప్పుడు జరిగే వేడుక సందర్భంగా ఆ పదాన్ని ఉపయోగిస్తారు. వేడుక సమయంలో మెట్రిక్యులాండ్స్, సబ్‍ఫస్క్ తో ఉన్న అకడెమిక్ దుస్తులను ధరించాలనేది ఆక్స్‌ఫర్డ్ నిబంధన. కేంబ్రిడ్జ్ మరియు డర్హమ్ ల వద్ద, కళాశాలల మధ్య అకడెమిక్ దుస్తులు ధరించడానికి సంబంధించిన నిబంధనలు మారుతూంటాయి. డర్హమ్ లోని కొన్ని కళాశాలలు విడిగా మెట్రిక్యులేషన్ వేడుకలు జరుపుకుంటాయి.

స్కాట్లాండ్ లోని పురాతన విశ్వవిద్యాలయాల వద్ద, విశ్వవిద్యాలయపు నిబంధనలును శిరసావహిస్తూ, ఆ సంస్థకు మద్దతునివ్వడానికి చేసే ప్రతిజ్ఞ, స్పాన్సియో అకాడెమికాకు సంతకాలు పెట్టడంలో మెట్రిక్యులేషన్ కలుగజేసుకుంటుంది.

అధికారిక వేడుక అనేదే ఉండని బ్రిటిష్ విశ్వవిద్యాలయాల్లో, విశ్వవిద్యాలయ సభ్యునిగా మారే వివిధ సంస్థల కార్యనిర్వాహక ప్రక్రియల్లో "మెట్రిక్యులేషన్", "ఎన్‍రోల్‍మెంట్", "రిజిస్ట్రేషన్" అనే పదాలు తరచుగా అంతర్గతంగా మారుతూ ఉపయోగించబడతాయి.

ఆక్స్‌ఫర్డ్ మరియు కేంబ్రిడ్జ్ ల వద్ద, ముందుగా లేదా మెట్రిక్యులేషన్ కాగానే జరిపే, రెస్పాన్షన్స్ ఎట్ ఆక్స్‌ఫర్డ్ మరియు ప్రీవియస్ ఎగ్జామినేషన్ ఎట్ కేంబ్రిడ్జ్ గా వాడుకలో ఉండి, 1960లో రద్దైన ప్రవేశ పరీక్షలతో మెట్రిక్యులేషన్ ఇంతకు ముందు భాగస్వామిగా ఉండేది. అనంతరం విశ్వవిద్యాలయ-విస్తృత ప్రవేశ పరీక్షలు ఆ రెండు విశ్వవిద్యాలయాల్లో తిరిగి-ప్రవేశపెట్టబడ్డాయి, కానీ 1995లో అవి రద్దుచేయబడ్డాయి. అప్పటి నుండి ఎక్కువగా నిర్ణీత పాఠ్యాంశ-ఆధారిత పరీక్షలు పరిచయం చేయబడ్డాయి.

ఇన్‍కార్పొరేషన్

ఒక కళాశాలలో సభ్యునిగా మారే క్రియతో పాటుగా లేదా ఆక్స్‌ఫర్డ్ యొక్క హాల్ అఫ్ ద యూనివర్సిటీస్ లేదా కేంబ్రిడ్జ్ లేదా డబ్లిన్, ట్రినిటీ కళాశాలలో సభ్యునిగా మారుతున్నప్పుడు, మెట్రిక్యులేషన్ కాకుండా ఇన్‍కార్పొరేషన్ అనే అంశం ఉన్న విశ్వవిద్యాలయ సభ్యునిగా మారుతున్నప్పుడు ఈ మూడు విద్యాసంస్థల్లో(అతడుగానీ ఆమెగానీ వాళ్ళు మెట్రిక్యులేట్ అయిన ఈ మూడు విద్యాసంస్థలకు చెందిన కళాశాల లేదా హాల్ లలో చేరుతున్నప్పుడు కాకుండా) ఏదైనా ఒకదానిలో అప్పటికే మెట్రిక్యులేట్ అయి ఉన్న ఇన్‍కార్పొరాండ్ (ఇన్‍కార్పొరేట్ కాగోరు వ్యక్తి) ప్రశ్నింపబడుతాడు.

హాంకాంగ్

హాంగ్ కాంగ్ లో, ఆరవ-తరగతి పూర్తికావడంతో అంతర్గతంగా మార్చుకునే వీలున్న పదంగా దీన్ని వ్యవహరిస్తారు. సర్టిఫికేట్ అఫ్ ఎగ్జామినేషన్స్ కు కూర్చున్న తర్వాత, అర్హులైన విద్యార్థులు రెండు సంవత్సరాల ఆరవ-తరగతి విద్యను పొందుతారు, అది పూర్తయిన తర్వాత వాళ్ళు ఎ-లెవెల్ పరీక్షల కోసం కూర్చుంటారు. చాలా వరకు ఉన్నత పాఠశాలలు ఆరవ-తరగతి పథకాన్ని అందజేస్తాయి, మరియు అక్కడ కొన్ని ఆరవ-తరగతి కళాశాలలు కూడా ఉన్నాయి.

సూచనలు

  1. "Conversations in the First Year - Boston College". Bc.edu. 2010-08-25. Retrieved 2010-09-14.
  2. http://www.kenyon.edu/x6916.xml
  3. "URL retrieved 2007-August-26". Marietta.edu. Retrieved 2010-09-14.
  4. 2008-April-11 న యూఆర్‍ఎల్ పునఃసమీకరించబడింది
  5. admin. "Hamline University | Saint Paul, Minnesota". Hamline.edu. Retrieved 2010-09-14.
  6. "Lyndon - A Vermont State College". Lyndonstate.edu. Retrieved 2010-09-14.
  7. www.uab.edu
  8. మూస:Vennకేంబ్రిడ్జ్ లోని ఏదైనా కళాశాలలోకి ప్రవేశిస్తున్న ఎవరైనా విద్యార్థి కోసం నిరంతరంగా వాడుతున్న ACAD డేటాబేస్ లోని మెట్రిక్యులేషన్ అనే పదానికి ఒక ఉదాహరణగా