"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మెట్ల సత్యనారాయణ రావు

From tewiki
Jump to navigation Jump to search
మెట్ల సత్యనారాయణ రావు
మెట్ల సత్యనారాయణ రావు


తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు

వ్యక్తిగత వివరాలు

జననం (1942-01-04) జనవరి 4, 1942 (వయస్సు 79)
అల్లవరం మండలం కొమరగిరిపట్నం, తూర్పుగోదావరి జిల్లా
మరణం డిసెంబరు 25 2015
హైదరాబాదులోని నిమ్స్
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
మతం హిందూ

మెట్ల సత్యనారాయణ రావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి [1] ఇటీవలే జాతీయ పార్టీగా అవతరించిన తెలుగుదేశం కమిటీలను ప్రకటించినప్పుడు ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను ఉపాధ్యక్ష పదవిని ఇచ్చారు.

జీవిత విశేషాలు

ఆయన తూర్పు గోదావరి జిల్లా లోని అల్లవరం మండలం కొమరగిరిపట్నం లో 1942 జనవరి 4 న మెట్ల రామ్మూర్తి, సరస్వతి దంపతులకు జన్మించారు. 1974లో రంగరాయ మెడికల్‌ కాలేజీలో వైద్య విద్య పూర్తి చేశారు.[2]

రాజకీయ జీవితం

ఆయన రాజకీయ జీవితం 1982లో తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైనది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి ఆయన గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.[3] 1982లో ఆయన అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. తరువాత 1994, 1999 లలో కూడా శాసనసభ్యునిగా ఎన్నికైనారు.[4]] 1996 నుంచి 1999 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో మెట్ల సత్యనారాయణ ఆరోగ్యమంత్రిగా పనిచేశారు. కొంతకాలం పాటు ప్రజారాజ్యం పార్టీలోనికి చేరినా 2009 లో తిరిగి తెలుగుదేశం పార్టీలోనికి తిరిగి వచ్చి ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు.[5] [6]

మరణం

ఆయన డిసెంబరు 25 2015 న ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

మూలాలు

  1. "డీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మెట్ల కన్నుమూత: సంతాపం తెలిపిన సీఎం". Archived from the original on 2015-12-28. Retrieved 2015-12-25.
  2. మాజీ మంత్రి మెట్ల మృతి [permanent dead link]
  3. మాజీమంత్రి మెట్ల సత్యనారాయణ కన్నుమూత
  4. [http://eci.nic.in/archive/electionanalysis/AE/S01/partycomp55.htm Election Commission of India - State Elections 2004
  5. "TDP vice president Metla Satyanarayana passes away". Archived from the original on 2015-12-26. Retrieved 2015-12-25.
  6. "తెలుగుదేశం కమిటీలలో తూర్పు గోదావరికి పెద్ద పీట". Archived from the original on 2016-03-07. Retrieved 2015-12-25.

ఇతర లింకులు