మేడూరు (పమిడిముక్కల)

From tewiki
Jump to navigation Jump to search
మేడూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పమిడిముక్కల
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి స్వాతి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషులు 2,202
 - స్త్రీలు 2,155
 - గృహాల సంఖ్య 1,328
పిన్ కోడ్ 521247
ఎస్.టి.డి కోడ్ 08676

మేడూరు, కృష్ణా జిల్లా, పమిడిముక్కల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 247., ఎస్.టీ.డీ.కోడ్ = 08676.

Contents

గ్రామ చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరులపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పమిడిముక్కల మండలం

పమిడిముక్కల మండలం మొత్తం ప్రాంతంతో పాటు, పట్టణ ప్రాంతం కూడా ఉంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

ఈ గ్రామానికి సమీపంలో ఈలూరు (ఐలూరు), కుదేరు, కృష్ణాపురం, చోరగుడి, పమిడిముక్కల గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు

వుయ్యూరు, మొవ్వ, తోట్లవల్లూరు, కొల్లిపర

గ్రామానికి రవాణా సౌకర్యం

వుయ్యూరు, కూచిపూడి నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 40 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

యలమంచిలి వెంకటరత్నం స్మారక (Y.V.R.M) జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

ఈ గ్రామానికి చెందిన కీ.శే. యలమంచిలి వెంకటరత్నం, వారి కుమారుడు రామమోహనరావు, ఈ పాఠశాల నిర్మాణానికి స్థల దాతలు. [5]

కృష్ణా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఇటీవల విజయవాడలోని ఆంధ్ర లయోలా కలాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో. ఈ పాఠశాలలో పదవ తరగతి చదువుచున్న ఎం.బిందులత అను విద్యార్థిని, 800 మీటర్ల పరుగు పందెంలో ప్రథమస్థానంలో నిలిచి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనది. 2017,ఆగస్టులో కడప జిల్లాలోని ప్రొద్దటూరులో నిర్వహించు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో ఈమె పాల్గొంటుంది. [6]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

శ్రీ వేణుగోపాల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం.

బ్యాంకులు

భారతీయ స్టేట్ బ్యాంక్. ఫోన్ నం. 08676/282235.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

ధూళిపూడిపాలెం, మేడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

2013 జూలైలో మేడూరు గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి గుళ్ళపల్లి స్వాతి సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి ఆలయం

ఈ ఆలయంలో, కార్తీకమాసం సదర్భంగా, కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం నుండి సాయంత్రం వరకూ, ప్రత్యేకపూజలు చేయుదురు. మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి కార్తీక దీపాలు వెలిగించెదరు. అనంతరం స్వామివారికి తీర్ధప్రసాదాలు పంపిణీ చేయుదురు. [3]

శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, చెరుకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలో జన్మించిన ప్రముఖులు

శ్రీ యలమంచిలి హనుమంతరావు

బాపట్ల వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ బి.ఎస్.సి., చదివిన వీరు, తొలుత పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో వ్యవసాయశాఖలో డిమానుస్టేటరుగా ఉద్యోగంలో చేరినారు. అ శాఖలో అంచెలంచలుగా పైకి వస్తూ, 1971లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆకాశవాణిలో చేరినారు. 1992లో ఆకాశవాణిలో అసిస్టెంట్ డైరెక్టరుగా నియమితులైన వీరు, రైతులకు ఉపయోగపడే పరిచయ, సంభాషణలు, సూచనలు, సలహాలు, చర్చాగోష్టులు, నాటికలు, వాస్తవ చిత్రణలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు. రైతులు మెరుగైన ఫలసాయం పొందేలా చేసారు. పదవీ విరమణ అనంతరం వీరు 1996 నుండి 2004 వరకు ఈటీవీలో సేవలందించారు. ఈటీవీలో ప్రసారమగుచున్న అన్నదాత కార్యక్రమం రూపకల్పనలో వీరు తనదైన ముద్ర వేసినారు. ఆరు దశాబ్దాలుగా రైతుసేవలో మమేకమై, వారి ఉన్నతికి పరితపించిన శ్రీ హనుమంతరావు, 78 సంవత్సరాల వయసులో, 2016, జనవరి-20న హైదరాబాదులో అనారోగ్యంతో కన్నుమూసినారు. [4]

శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ

ప్రముఖ రంగస్థల నటుడు.

గ్రామ విశేషాలు

ఈ గ్రామంలో 2016, ఫిబ్రవరి-21వ తెదీ ఆదివారంనాడు, యలమంచిలి వారి ప్రథమ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. [5]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4533.[3] ఇందులో పురుషుల సంఖ్య 2281, స్త్రీల సంఖ్య 2252, గ్రామంలో నివాస గృహాలు 1115 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1320 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 4,357 - పురుషుల సంఖ్య 2,202 - స్త్రీల సంఖ్య 2,155 - గృహాల సంఖ్య 1,328

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamidimukkala/Meduru". Retrieved 24 June 2016. External link in |title= (help)
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-08.

వెలుపలి లింకులు

[2] ఈనాడు కృష్ణా; 2013,జూలై-25; 8వపేజీ. [3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2013,నవంబరు-28; 2వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2016,జనవరి-21; 19వపేజీ. [5] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-22; 2వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2017,ఆగస్టు-21; 2వపేజీ.