"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మేవాడ్

From tewiki
Jump to navigation Jump to search
మేవాడ్ రాజ్య మ్యాప్

మేవాడ్ లేదా మేవార్  అనేది పశ్చిమ భారతదేశంలోని  రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రదేశం. రాజ్ పుత్ ల రాజ్యం ఇది. రాజస్థాన్, గుజరాత్మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇప్పటి భిల్వారా, చిత్తోర్ గఢ్, రాజ్ సమంద్ , ఉదయపూర్ ప్రాంతాలు కలిపి అప్పటి మేవాడ్ రాజ్యం.

కొన్ని శతాబ్దాల కాలం పాటు మేవాడ్ సామ్రాజ్యం లేదా ఉదయపూర్ సామ్రాజ్యంగా రాజ్ పుత్ రాజుల పాలనలో ఉంది. ఆ తరువాత బ్రిటిష్ పరిపాలనలో ఒక రాచరిజ రాజ్యంగా ఉంది.

దీని అసలు పేరు మేధ్ పాత్. శివుని పేరైన మేధాపతేశ్వర్ అనే పేరు నుంచి వచ్చింది. కాల క్రమంలో మేవార్ అనీ మేవాడ్ అని పిలవడం మొదలైంది. ఈ రాజ్యం ఆరావళీ పర్వతాలలో ఉంది. ఆ పర్వతాలు మేవాడ్ కు వాయువ్యాన ఉన్నాయి. ఉత్తరంలో అజ్మేర్ ఉండగా, గుజరాత్, రాజస్థాన్ లోని వగద్ ప్రదేశాలు దక్షిణంలోనూ, మధ్యప్రదేశ్ లోని మాళ్వా ప్రాంతం ఆగ్నేయ దిశలోనూ, రాజస్థాన్ లోని హడోటీ ప్రదేశం తూర్పులోనూ ఉన్నాయి.

భౌగోళిక అంశాలు

మేవాడ్ రాజ్య ఉత్తర ప్రదేశం ఏటవాలుగా ఉంటుంది. అక్కడ బెడచ్, బనస్ అనే నదులు, వాటి ఉపనదులు ప్రవహిస్తున్నాయి. యమనా నదికి ఉపనది అయిన చంబల్ రాజ్యానికి వాయువ్య ప్రాంతంలో ప్రవహిస్తోంది. దక్షిణ ప్రాంతం పర్వతమయంగా ఉండి, బనస్ నది, దాని ఉపనదులను విడదీస్తోంది. ఈ ప్రాంతం నుంచే సబర్మతీ, మాహీ నదులు, వాటి ఉపనదులూ గుజరాత్ రాష్ట్రంలోని ఖంభట్ ప్రాంతంలోకి ప్రవహిస్తాయి. ఈ రాజ్యానికి వాయువ్య దిశలో ఆరావళీ పర్వతాలు సహజ సరిహద్దుగా ఉంటుంది. ఈ పర్వతాల్లో దొరికే మార్బుల్, కోటా రాళ్ళు అక్కడి వారు తమ ఇళ్ళు నిర్మించుకునేందుకు సంప్రదాయంగా వాడుతూ వస్తున్నారు.

ఈ ప్రాంతంలో కతైవర్-గిర్ అడవులు ఉన్నాయి. అలాగే జైసమంద్, కుంభల్గడ్, బస్సీ, సీతామాతా వన్యప్రాణుల అభయారణ్యాలు కూడా ఈ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి.

మేవాడ్ ప్రాంతం అతి ఎక్కువ ఉష్ణ వాతావరణం కలిగినది. సంవత్సరానికి 660 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అవుతుంది ఇక్కడ. ఈ రాజ్య నైరుతి ప్రాంతంలో వర్షపాతం ఎక్కువ కాగా, ఈశాన్య ప్రాంతంలో తక్కువ నమోదు అవుతుంది. నైరుతీ రుతుపవనాల సమయంలో జూన్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో ఎక్కువగా ఇక్కడ వర్షాలు పడతాయి.

చరిత్ర

ఉదయపూర్ రాజ్యాన్నే మేవాడ్ సామ్రాజ్యం అని కూడా అంటారు. బ్రిటీష్ పరిపాలనా సమయంలో ఇది ఒక రాచరిక రాజ్యంగా ఉండేది.

530లో మేవాడ్ రాజ్యం మొదలైంది. తరువాతి కాలంలో ఎక్కువగా అప్పటి దాని రాజధాని అయిన ఉదయపూర్ పేరుతోనే పిలిచేవారు. 1568లో అక్బర్ చిత్తోర్గడ్ ను గెలుచుకున్నారు. అది అప్పటి మేవాడ్ రాజ్యానికి రాజధానిగా ఉంది. అప్పట్నుంచీ దాదాపు 150ఏళ్ళ పాటు మొఘల్ రాజుల పరిపాలనలోనే ఉంది. 1949లో భారతదేశంలో కలిసేటప్పటికీ మేవాడ్ ను చట్టరీ రాజ్ పుత్ లు పరిపాలిస్తున్నారు. మోరి, గుహిలోట్, సిసోడియా వంశాల వారు దాదాపు 14000 ఏళ్ళ పాటు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. సిసోడియా రాజపుత్ వంశం పరిపాలించే సమయానికి మేవాడ్ రాజధాని చిత్తోర్ గడ్ గా ఉంది.

మహారాణా పేరుకు చరిత్ర

మేవాడ్ రాజులు మహారాజా అనే పదానికి బదులు మాహారాణా(మంత్రి) అనే పదాన్నే ఉపయోగించేవారు. ఈ ప్రాంతానికి నిజమైన మహారాజు శివుడు అని వారి భావం. అక్కడ ఏక్ లింగ్ జీ పేరుతో కొలువై ఉన్న శివుడే ఆ రాజ్యానికి అసలైన రాజు అని పరిపాలించే రాజు ఆయనకు మంత్రి అన్న భావనతో వారు మహారాణా బిరుదునే వాడేవారు.

మూలాలు