మొదటి ప్రపంచ యుద్ధంలో భారత సైన్యం పాత్ర

From tewiki
Jump to navigation Jump to search

మొదటి ప్రపంచ యుద్ధంలో భారత సైన్యం పెద్ద సంఖ్యలో డివిజన్లు, స్వతంత్ర బ్రిగేడ్లను యూరోపియన్, మెడిటరేనియన్, మధ్య ప్రాచ్య యుద్ధరంగాల్లో పనిచేసేందుకు పంపింది. పదిలక్షలకు పైగా భారత సైనికులు విదేశాల్లోని ఈ యుద్ధంలో పాల్గొనగా యుద్ధరంగంలో 62 వేలమంది మరణించారు, మరో 67 వేలమంది గాయపడ్డారు. మొత్తానికి కనీసం 74,187 మంది భారత సైనికులు ఈ యుద్ధసమయంలో మరణించారు.

మొదటి ప్రపంచ యుద్ధంలో భారత సైన్యం జర్మన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జర్మన్ తూర్పు ఆఫ్రికాలోనూ, పశ్చిమ యుద్ధరంగంలోనూ పోరాడారు. మొదటి వైప్రెస్ యుద్ధాల్లో పోరాడి ఖుదాదాద్ ఖాన్ విక్టోరియా క్రాస్ పొందిన తొలి భారతీయుడయ్యారు. భారతీయ డివిజన్లను ఈజిప్టు, గల్లిపోలీ కూడా పంపారు, దాదాపు 7 లక్షల మంది మెసపటోమియాలో ఒట్టోమాన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారు.[1] కొన్ని డివిజన్లను విదేశాలకు పంపగా మిగిలిన డివిజన్లు భారతదేశంలో వాయువ్య సరిహద్దుకు రక్షణగానూ, అంతర్గత భద్రత కోసం, శిక్షణ విధుల్లోనూ ఉండిపోయాయి.

1942 నుంచి భారత కమాండర్-ఇన్-ఛీఫ్ గా విధులు నిర్వర్తించిన ఫీల్డ్-మార్షల్ సర్ క్లాడ్ ఆకిన్లెక్ - భారత సైన్యం వారికి (బ్రిటీషర్లకు) లేకపోయి ఉంటే రెండు యుద్ధాలను దాటుకు రాగలిగేవారు కాదు అని పేర్కొన్నారు.[2][3]

కిచనెర్ సంస్కరణలు

1902లో హెర్బర్ట్ కిచనెర్ భారత సైన్యానికి కమాండర్-ఇన్-ఛీఫ్ గా పనిచేశారు, ఆయన ఐదేళ్ళ టర్మ్ పూర్తయ్యాకా మరో రెండేళ్ళు కొనసాగించారు. ఈ సమయంలోనే ఆయన భారత సైన్యంలో సంస్కరణలు చేశారు.[4] సంస్కరణల వల్ల అప్పటివరకూ మూడు ప్రెసిడెన్సీలకు వేర్వేరుగా ఉన్న మూడు సైన్యాలను ఒకే భారత సైన్యంగా చేశారు.[5] ఇదే సమయంలో, ప్రిన్స్ లీ స్టేట్స్ అందుబాటులో ఉంచే రెజిమెంట్లు ఇంపీరియల్ సర్వీస్ ట్రూప్స్ గా పిలవడం ఆరభించారు.[5] బ్రిటీష్ సైన్యం భారత సైన్యంతో పాటుగా భారతదేశం సేవకు సైన్యాన్ని పంపించారు. బ్రిటీష్, భారత సైన్య విభాగాలు సహా ఆర్మీ ఆఫ్ ఇండియా అన్న కమాండ్ స్ట్రక్చర్ ఏర్పరిచారు. భారత సైన్యం కొత్త ఏర్పాటులో 9 డివిజన్లు ఉండేవి. ప్రతీ డివిజన్లోనూ ఒక సైనిక దళం, మూడు కాల్బలాలు ఉండేవి. ఈ తొమ్మిది డివిజన్ల బయట 3 స్వతంత్ర కాల్బలాలు భారతదేశానికి సేవచేసేవి.[6] ఒక బర్మా డివిజన్, ఆడెన్ బ్రిగేడ్లకు సరఫరాలు అందించేందుకు కూడా భారత సైన్యం బాధ్యత వహించేది.[6]

Notes

References

  1. Empty citation (help)
  2. http://www.cwgc.org/foreverindia/context/indian-army-in-2nd-world-war.php
  3. http://www.newindianexpress.com/magazine/article1433642.ece?service=print
  4. Sumner, p.3
  5. 5.0 5.1 Heathcote, p.184
  6. 6.0 6.1 Perry, p.83