"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మొదలియార్

From tewiki
Jump to navigation Jump to search
మొదలియార్
Ptrajan.jpg
Mylswamy Annadurai.jpg
AR Rahman.jpg
పో తి రాజన్ • బారతిదాసన్ • అన్నాదురై • మైల్‌స్వామి అన్నాదురై • ఎ.ఆర్.రెహమాన్
మొత్తం జనాభా
చెప్పుకోదగ్గ జనాభా ఉన్న ప్రాంతాలు
తమిళనాడు
భాషలు
తమిళం
మతం
హిందూమతము, క్రైస్తవ మతము
సంబంధిత జాతులు
ద్రవిడర్

ముదలియార్, మొదలియార్ కూడా, ముదలి మరియు మొదలె అనేవి తమిళ కులాలని సూచించే పదాలు. ఇది గౌరవార్థక శీర్షిక తమిళ భాషలో మొదటి స్థానం గల వ్యక్తి అన్న అర్థం గల ముదలి పదం నుండి పుట్టింది, ఈవ్యక్తి దక్షిణ భారతదేశపు మధ్య యుగపు ఉద్యోగసామ్య అధికారులలో, సైన్య అధికారులలో పెద్ద స్థానంలో ఉన్న వ్యక్తి [1].

ఈ ఇంటిపేరు సాధారణంగా భారతీయ తమిళులలో చలామణిలో ఉంది, తమిళ ప్రవాసుల మూలంగా దక్షిణ భారతపు ఇతర ప్రాంతాలలో కూడా ఇది వాడుకలో ఉంది.వీరికి తమిళనాడులో అత్యధిక హోదా ఉంది, వీరు మిగతా సాంప్రదాయ కులాలైన గౌండర్, తేవర్, ముథురాజ, వేల్లలార్, పిళ్ళై మొదలైనవారితో సమానం.

పదవ్యుత్పత్తి శాస్త్రం

ముదలియార్ పదానికి అర్థం మొదటి నాగరికులు లేదా మొదటివాళ్ళు అని.ముదలి పదం నాగరత్తార్ సంస్థలోని స్థానాన్ని సూచించడానికి కూడా ఉపయోగిస్తారు, ఇది వెల్లలార్ కులానికి కూడా వర్తిస్తుంది. వీరికి చోళ/చేర/పాండ్య రాజ్యాలతో దగ్గరి సంబంధాలున్న గొప్ప చరిత్ర ఉంది. మరింత వివరణ కోసం వెల్లలార్ చూడండి.

చరిత్ర

కరికాళ అతని కొడుకు ఆతొండై కురుంబర్ల మీద యుద్ధం గెలిచిన తరువాత తొండై మండలా న్ని 24 కొట్టములుగా విడగొట్టి వెల్లలార్ అధికారులకి ఇచ్చేసి వారికి ముదలి లేదా ముదలియార్ [2][3][4] అన్న బిరుదల్ని ఇచ్చాడు, దీని అసలు అర్థం మొదటి నాగరీకులు లేదా మొదటివాళ్ళు అని.

తొండై మండలంకి చెందిన కొంతమంది ముదలి వంశీయులు మధ్యయుగపు కవి కంబర్ సమయంలో శ్రీలంకకి వలసపోయారు. ఉదాహరణకి సిలోన్ లోని కొంతమంది తమిళులు వారి మూలాన్ని నాయనార్ సాధువులుగా మారిన ఈ వర్గానికి చెందినవారితో ఉన్నట్లు కనుగొన్నారు. పుస్తకం: ది తమిళ్స్ ఇన్ ఎర్లీ సిలోన్ బై సి. శివరత్నం సిలోన్ లోని కొంతమంది ముదలియార్లు తనినాయక ముదలియార్ చెందినవారని (వారిలో ఒకరు), ఈయన తొండై మండలం నుండి సిలోన్ కి వలస వెళ్ళిన గొప్ప శైవవెల్లలార్ [5]

మానకండ ముదలి అనే తొండై నాడు వెల్లాల రాజు కంబన్ మీద వ్యవసాయాన్ని పొగుడుతూ రాసిన అతని పుస్తకం ఎరెంజపాటుకు గానూ కనకవర్షం కురిపించాడు. తనినాయగ, సేయుర్ వెల్లాల నేడున్టివ అధికారిగా నియమించబడ్డాడు. [6]

ఇంకా ఇతర ఆధారాలు ఉదాహరణకి 17వ శతాబ్దంలో ప్రఖ్యాత ముస్లిం వ్యాపారి మరక్కాయర్కి మధురై నాయక రాజు ముదలి పిళ్ళై అనే బిరుదిచ్చాడు.[7]

థామస్ ఎ. టింబర్గ్ పుస్తకం "జ్యూస్ ఇన్ ఇండియా" ప్రకారం కోచిన్ రాజు కూడా ముదలి అన్న బిరుదు పొందాడు. [8]

అగముదయార్ వంటి కులాలు కూడా ప్రాచీన కాలాలలో రెజిమెంట్లులో పనిచేసినందుకుగానూ ముదలి పేరును వాడేవారు.Cite error: Invalid <ref> tag; invalid names, e.g. too many[unreliable source?]

ఈ పేరు వాడుక బాగా చలామణిలో ఉండి, దెసిగర్, ఖోజియా వెల్లలార్ మరియు కరైయార్ల[9]లో తక్కువ వాడుకలో ఉంది.

గట్టి ముదలియార్

గట్టి ముదలియర్లు నాయక రాజుల రాజ్యంలో అతి ప్రమాదకరమైన ప్రాంతం కావేరిపురానికి అధికారులు, ఇది కావేరి నదికి కుడి వైపున ఉండి వారి ఆలోచనల రాజధానిగా మైసూర్ పీఠభూమి వరకు వ్యాపించింది. వారి శక్తికి కేంద్రం తారామంగళం, ఇక్కడ వారు గొప్ప దేవాలయాన్ని నిర్మించారు. వారి ఆధిక్యత తూర్పున తలైవాసల్ వరకు, పడమట ఈరోడ్ జిల్లాలోని ధారాపురం వరకు మరియు దక్షిణాన కరూర్ జిల్లా వరకు వ్యాపించింది. గట్టి ముదలియార్లచేత నిర్మించబడిన నైపుణ్య ప్రాధాన్యతగల కోతలు ఒమాలుర్ మరియు అత్తూర్లు. 1635 ఎ.డి.కి బీజాపూర్, గోల్కొండ ముస్లిం సుల్తానులు దక్షిణాన్ని ఆక్రమించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు, తిరుమలై నాయకుడు పాలకోడ్ ప్రాంతం బీజాపూర్ క్రిందకి రావాలని కోరుకున్నాడు. మధ్యలో సేరనాగపట్నపు కంఠీరవ నరసరాజా 1641 ఎ.డి.లో గట్టి మొదలియార్లనుండి కోయంబత్తూర్లోని చాలా ప్రదేశాలను తీసేసుకున్నాడు.

ముదలియార్ పేరు అనేక కులాలలో వాడుకలో ఉంది. ఈకులాలు బ్రాహ్మినులు కానీ అగ్ర కులాల క్రిందకి వస్తాయి (NBFC). ముదలియార్ పేరు వాడుకలో ఉన్న కొన్ని కులాలు:

బెంగుళూరు ముదలియార్లు

దక్షిణ బెంగుళూరు జనాభాలో అధిక శాతం ముదలియార్లు ఉన్నారు (ఉల్సూర్ సరస్సు, MG రోడ్డు, హైగ్రౌండ్ చుట్టుప్రక్కల). MG రోడ్డు & చుట్టుప్రక్కల ప్రాంతాలలోని ప్రముఖ భవనాలన్నీ ఒకప్పుడు ముదలియార్లవే (ఉదా||గంగారమ్స్, ప్లాజా సినిమా మొదలైనవి) విధానసౌధకి ఎదురుగా ఉన్న ప్రఖ్యాత "అత్తర కచ్చేరి" లేదా రెడ్ కోర్టు హౌస్ ప్రముఖ ముదలియార్ కంట్రాక్టర్ చే నిర్మించబడింది. విడ్సర్ మానోర్ (పంచనక్షత్రాల హోటల్) చుట్టూ ఉన్న పాలటియాల్ ఇళ్ళు నేడు కూడా సంపన్న ముదలియార్ కుటుంబీకుల ఆధీనంలో ఉన్నాయి. ది బెంగళూర్ ఎగ్జిబిషన్ సాధారణంగా రాయ్ బహుదూర్ ఆర్కోట్ నారాయణస్వామి ముదలియార్ ట్రస్ట్ ఆధీనంలో ఉన్న ఉల్సూర్ లోని RBANMS గ్రౌండ్లో జరుగుతుంది. ఈ ట్రస్ట్ దానికి అనుసంధానంగా అనేక బడులు మరియు కళాశాలలను కలిగిఉంది. ప్రఖ్యాత క్విజ్ మాస్టర్ అవినాష్ ముదలియార్ ఇంకొక అతి ప్రాచుర్య ముదలియార్.

హైదరాబాద్ ముదలియార్లు

ముదలియార్లు అధిక సంఖ్యలో సికింద్రాబాద్ లోని బోయిగూడా, పద్మారావు నగర్, మారేడ్ పల్లి పరంటలలో ఉన్నారు. వీరు కొన్ని కళాశాలలతోపాటు ప్రముఖ విద్యార్థినుల పాఠశాల "కీస్ హై స్కూలు"ను నడుపుతున్నారు. "పద్మారావు నగర్" అని పిలువబడే ప్రఖ్యాత నివాస ప్రాంతం కీ.శే. దివాన్ బహదూర్ పద్మారావు ముదలియార్ పేరు మీద పెట్టబడింది. శ్రీలంక ముదలియార్లు ఎక్కువ మొత్తంలో శ్రీలంక వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మొదట ముదలియార్లు ఒకే కుల శాఖకి చెందినప్పటికీ వివిధ కులాలకి చెందినవారు కూడా ముదలియార్లు కావచ్చు. రాజకీయ అభివృద్ధి ప్రవృత్తి వలన ముదలియార్ కులపు పేరు నుంచి శీర్షికగా మారింది, ఇది ముదలియార్లని నాయక స్థానం వైపుకి మళ్ళించింది. తొందరలోనే అందరు నాయకులు ముదలియార్ పేరును తీసుకోవడం మొదలుపెట్టారు.

ముదలియార్లు ద్రావిడులు

ముదలియార్లు తమిళం మాట్లాడే ద్రావిడులు. భిన్న సంస్కృతులతో కలయిక వలన ముదలియార్లు అనేక ఉప శాఖలని వారి కలయికల మీద ఆధారపడి వృద్ధి చేశారు. దీనిని మనం 19వ శతాబ్దంలో ముదలియార్లు ఏర్పరిచిన జస్టిస్ పార్టీ ద్వారా కూడా చూడవచ్చు, వీరు ప్రభుత్వ ఉద్యోగాలలో బ్రాహ్మినేతరులకు సమాన ప్రాతినిధ్యం కోసం పోరాటం చేసారు. ముదలియార్ శాఖల వృద్ధి-ముదలియార్ శాఖలకి కొన్ని ఉదాహరణలు చారిత్రకంగా ఋజువైనాయి. మిగతావారికి చారిత్రక ఆధారం లేదు. కైకోల ముదలియార్లు చోళ సామ్రాజ్యంతో చోళ సైన్యపు ప్రత్యేక శాఖగా సంబంధం కలిగిఉన్నారు. ఆర్కోట్ ముదలియార్లు పల్లవ సామ్రాజ్యంతో సంబంధాన్ని కలిగిఉన్నారు.

తొండై మండల శైవ వెల్లలార్

తొండైమండల ముదలియార్ లేదా తొండై మండల శైవ వెల్లలార్ భారతదేశపు[10] తమిళనాడులోని అగ్ర వర్ణ కులం. వారి వారి మూలాన్ని పెరియ పురాణం సృష్టికర్త శేక్కిఝర్ గా కనుగొన్నారు. వీరే ముదలియార్ల నిజ స్వజాతి వర్గమునకు చెందినవారు, వీరే చోళ రాజు కరికాల చోళ[11][12][13] ఇచ్చిన దక్షిణ భారతంలో ఇచ్చిన తొండైమండలం లేదా తొండైనాడులో నివాసమేర్పరుచుకున్నవారు.[14].

తొండై మండల కొండయ్ కట్టి వెల్లలార్

సంప్రదాయం ఈ వర్గీకులే అబొండై చక్రవర్తి ద్వారా కురుమ్బర్ ఆధిపత్యాన్ని కూలదోసిన తరువాత తొండైమండలంలో స్థిరపడ్డ మొదటి వేల్లలర్ వర్గీకులని సూచించింది.[15].

అదొండై చక్రవర్తి వివిధ రకాలుగా వర్ణించబడ్డాడు: అ) చోళ రాజ్యంలో సైన్యాధికారిగా[16], b) ప్రాచీన చోళ రాజు కొక్కిలి కొడుకు మరియు నాగ యువరాజుగా, c) రాజేంద్ర కులోత్తుంగ చోళుడు I మరియు దాసికి పుట్టిన అక్రమ సంతానంగా[17], d) కరికాల చోళుడి కొడుకుగా[18]. ఈ వాదన అతోండై చక్రవర్తి సందిగ్థ ఉనికి మరియు స్థిరపడిన సమయంతో కొంచెం మసకబారుతుంది. విభిన్న ఆధారాలున్నాయి, కొన్ని స్థిరపడటం ఎడి 7వ లేదా 8వ శతాబ్దాలలో అంటే కొందరు ఎడి 11వ లేదా 12వ శతాబ్దంలో అంటారు. ఏమైనా ఈ స్థిరపడటం కరికాల చోళుడి తొండైమండలం స్థిరపడటంకంటే చాలా ఆలస్యంగా జరిగిందిCite error: Invalid <ref> tag; invalid names, e.g. too many. ఈ వర్గానికి చెందిన అనేక మిరాసిదార్లు , జమిందార్లు ఉన్నారు. వీరు ముఖ్యంగా చెన్నై, కాంచీపురం మరియు వెల్లోర్ జిల్లాలలో ఉన్నారు.

ఆగముదయ ముదలియార్

ఆగముదయ ముదలియార్ ముదలియార్ పేరును 13వ శతాబ్దపు ఆదినుంచి వాడడం మొదలుపెట్టారు. కులాట్టుర్ నుండి కయిలాడమూడైయాన్ అలియాస్ సోలాకోన్-పల్లవరైయార్ ఒకరు 13వ శతాబ్దంలో తిరువిందలుర్ నాడులో ముదలి కార్యాలయం ఉండేదని పేర్కొన్నారు Cite error: Invalid <ref> tag; invalid names, e.g. too many.[unreliable source?] వారి ఉపస్థితి తమిళనాడు ఉత్తర జిల్లాలలో ఎక్కువ మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో విస్తరించియున్నారు.(రెఫర్ people of india) అఘముడియర్లు తాము అఘముడిముదలియార్ అఘముడి ముదలియార్ గా చెప్పుకుంటారు . భాషాపరంగా చూస్తే “అఘముడి” అను పదమునకు అర్ధం గర్వంగా స్థిరముగా వుండడం అని. “ముదలియార్” అంటే అన్నీ విషయాలలో ముందుండే వ్యక్తి అనీ అర్ధం. వీరిని ముదలియార్ అనీ, ముదలి అనీ, రెడ్డి అనే (Titles తో) పేర్లు కలవు ;. ముదలియార్ అను పదమునకు పెద్దవాడు లేదా ముఖ్యమైన వ్యక్తి అని కూడా అర్ధం. ఈ కులానికి సంబంధించి అనేక పర్యాయపదాలు వాడుకలో ఉన్నాయి. తుళువ వెల్లాల, ఆర్కాట్ వెల్లాల, ఆర్కాట్ ముదలి, అఘముడియన్, అఘముడి వెల్లలర్, అఘముడి రెడ్డి మరియు మరియు అఘముడి ముదలియార్. వీరు తుళు రాజ్యానికి సంబంధించినటువంటి అతి ప్రాచీన కులానికి సంబంధించినవారు. వీరు పశ్చిమ కనుమల అవతల కోస్తా ప్రాంతం నుండి దక్షిణ భారతదేశంలోని ప్రాచీన పల్లవ రాజ్యంలోకి వచ్చి స్థిరనివాసమేర్పరచుకొన్నరు. కాబట్టి వీరు తుళు రాజ్యానికి చెందిన తుళువ వెల్లాలగా గుర్తించారు. తుళువవెల్లాల అంటే తుళువ రాజ్యంలోని వ్యవసాయదారులు అని అర్ధం. అగముడియార్ యొక్క పుట్టుక సంస్కృతి వారసత్వాలను ప్రొఫెసర్ థర్స్టన్ (1909) సంపూర్ణ విషయసంగ్రహనాన్ని వివరించారు. ఈయన ప్రకారము ప్రాచీన అగముడియార్లు గౌతమ అను ఒక యోగి దగ్గర భయంలేకుండా నిలబడ్డారు కావున వీరు అగముడియార్ గా వాసికేక్కరు. వీరి చారిత్రక నేపథ్యాన్ని పల్లవుల సామ్రాజ్యంలో కనుగొనడం జరిగింది. వీరిలో చాలామంది విజయనగర రాజుల దగ్గర మరియు బల్లాల రాజుల దగ్గర 15వ శతాబ్దంలో సైనికులుగా పనిచేసినట్లు అంతేకాకుండా ఆధునికకాలంలో పుంగనూరు రాజుల దగ్గర సైనికులుగా, అంతఃపుర పరిచాలకులగాను పనిచేసారు. వీరు ఎక్కువగా ఉత్తర తమిళనాడు జిల్లాల్లోనూ మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో విస్తరించియున్నారు. వీరు వారిలోవారు తమిళంలోనూ, పరిసరాలలోని వారితో తెలుగులో మాట్లాడుతారు. వీరిలో కొంతమంది దక్కన్ ఉర్దూ, కనడ భాషను కూడా మాట్లాడగలరు. వీరు వ్రాతలలో తమిళ మరియు తెలుగు భాషను ఉపయోగిస్తారు. వీరు పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని ఉపయోగిస్తారు. వీరిలో చదువుకున్నవారు ఆంగ్లంలో మాట్లాడగలరు. వీరి వస్త్రదారణ చాలామటుకు ఆ ప్రాంతాల వస్త్రదారణను పోలివుంటారు. మగవారు ధోవతి, చొక్కా మరియు తలపాగాను ఉపయోగిస్తారు. స్త్రీలు రవిక, చీర మరియు ఆధునిక వస్త్రాలంకరణ చేసుకుంటారు. వీరి మహిళలు కుంకుమబొట్టు పైన నుదుటన తెల్లని విభూదిని రాసుకుంటారు. అంతేకాకుండా ముక్కుకు (ముకూతి) ముక్కుపుడకలు మరియు మిడత ఆకృతి కలిగిన తాళిని ధరిస్తారు. ఈ చిహ్నాలను బట్టి వీరు అఘముడియా స్త్రీగా గుర్తించవచ్చు.

ఆర్కోట్, తుళువ వెల్లలార్

తుళువ వెల్లలార్ లేదా తుళువ లేదా తులుమార్ అనేది వెల్లలార్ ఉప-కులం, వీరు ఆధునిక దక్షిణ కెనరా జిల్లా తుళునాడు నుంచి వలస వచ్చినవారు. అతోండై చక్రవర్తి అనే పేరు గల రాజు తుళువ వెల్లలార్ ప్రజలను ప్రస్తుతపు తమిళనాడు తొండైమండలానికి తీసుకువచ్చాడు. అతోండై చక్రవర్తి కురుమ్బర్ల మీద యుద్ధంలో గెలిచిన తరువాత ఉత్తర తమిళనాడు మీద అధికారాన్ని సంపాదించాడు. ఉత్తర తమిళనాడు ప్రాంతానికి తొండైమండలం అని పేరు రావడానికి ఇదే కారణం, విజయం సాధించిన రాజు పేరు పెట్టబడింది. అతోండై చక్రవర్తి శ్రీశైలం నుండి వెల్లలార్లను తీసుకువచ్చి తొండైమండలంలో స్థిరపరచాడని కూడా సూచించబడింది.

కేరళ ముథలి/ముదలి

కేరళ ముథలి (ముదలి) వివిధ ముదలియార్ వర్గాలకి చెందినది. వీరు ఎక్కువగా త్రివేండ్రం మరియు కేరళ పాల్ఘాట్ జిల్లాలోను, తమిళనాడు కన్యాకుమారి జిల్లాలలోను కనిపిస్తారు. వీరు ఆయా ప్రదేశాలకి 17వ శతాబ్దం చివరిలో వ్యవసాయం, కొబ్బరినూనె తీయడం, తాటినార వ్యాపారం, పోరాట నిపుణులు, నమ్మదగ్గ గూఢచారులు వంటి వివిధ కారణాల వలన వలస వచ్చారు. త్రావంకోర్ రాజ కుటుంబం వారి సంస్కృతి సారూప్యత మరియు రాజభక్తి కారణంగా వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ హోదా త్రావంకోర్ లో వారి ప్రభావం ఘాడమవడానికి కారణమయ్యింది. బ్రిటీష్ యుగంలో చాలా కుటుంబాలు క్రిస్టియానిటివైపు మళ్ళాయి. కేరళలో సూక్ష్మ-మైనారిటి కులమైనప్పటికీ ఇప్పటికి వారు వారి ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తున్నారు. భాషాపరంగా, విద్యాపరంగా వారి వెనుకబాటుతనపు కారణంగా కేరళ[19], తమిళనాడు[20], పాండిచ్చేరి[21] రాష్ట్రాలు వారిని బిసిలుగా వర్గీకరించాయి. స్వాతంత్ర్యం మరియు రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ తరువాత క్రమంగా కేరళ ముథాలిలు కేరళ సంస్కృతితోటి మమేకమయ్యారు, కానీ ఇప్పటికి వారు మురుగా/సుబ్రహ్మణ్య స్వామిని వారి కులదైవంగా పూజిస్తారు అదే ఎక్కువమంది కేరళ హిందువులు విష్ణు భగవానుడి భక్తులు.

స్వాతి తిరునాళ్ తంజావూరు సుగంధవల్లి అలియాస్ సుగంధ పార్వతి భాయిని తన భార్యగా ఒప్పుకోవడంతో త్రావంకోర్ రాజకుటుంబం మీద మనసు విరగడం మొదలయ్యింది. ఇతని మొదటిభార్య తిరువత్తార్ అమ్మ వీట్టిల్ పానపిళ్ళై ఆయికుట్టి నారాయణి పిళ్ళై కేంద్ర ట్రావంకూర్ కు చెందిన శక్తివంతమైన నాయర్ కుటుంబానికి చెందినది. స్వాతి తిరునాల్ 33 ఏళ్ళ చిన్న వయస్సులో అనుమానాస్పద మరణం తరువాత కేరళ ముథాలి వర్గం అనేక బెదిరింపులని ఎదుర్కుంది. అప్పుడు బ్రిటీష్ పౌరుడు జనరల్ కులేన్ సరైన సమయంలో కలిగించుకోవడం ఈవర్గపు పెద్ద వినాశనం బెడిసికొట్టడానికి సహాయపడింది. దక్షిణ త్రావంకోర్ కేరళముథాలి సమాజం ఈ వర్గం కోసం గొడుగుల పనిచేస్తున్న సంస్థ[22].

నంజిల్ ముదలి

నంజిల్ ముదలి అనేది ముదలి ఇంటి పేరు గల ఇంకొక వర్గం. వీరు కన్యాకుమారి జిల్లాలోని నంజిల్ కు చెందినవారు. [23]

సేన్ గుంత ముదలియార్

కైకోలార్ లేదా సేన్ గుంతార్ దక్షిణ భారతదేశపు రాష్ట్రాలలోని అధిక సంఖ్యాక తమిళులు[24]. చారిత్రకంగా డెబ్భై-రెండు ఉపవిభాగాలున్నాయి (నాడు లేదా దేశాలు). వీరి పేరు తమిళ పదాలు "కై" (చెయ్యి) మరియు "కోల్" (వాయుదండం లేదా బల్లెంలో ఉపయోగించే కర్ర) నుంచి వచ్చింది. వీరు వాయుదండపు వివిధ భాగాలు వివధ దేవుళ్ళు మరియు ఋషులకు ప్రాతినిధ్యం వహిస్తాయని భావిస్తారు. వీరిని సేన్ గుంతార్ అని కూడా అంటారు, అంటే తమిళంలో ఎర్ర బాకు అని అర్థం.

చోళుల పరిపాలన సమయంలో కైకోలార్లు సైనికులుగా పనిచేసేవారు, వీరిని "తేరింజ కైకోలార్ పడై" అనేవారు. (తేరింజ అంటే తమిళంలో "తెలిసిన", పడై అంటే "సైనిక దళం"), కనుక "తేరింజ-కైకోలార్ పడై"లు వ్యక్తిగత అంగరక్షకులు. కైకోలార్లు చోళ సామ్రాజ్యపు సమయంలో సైన్యికరించబడి చోళుల సైన్యంలో 8వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు అనేక దళాలని ఏర్పరిచారు. ఎడి 10వ శతాబ్దపు చోళ పరిపాలనా సమయంలో కూడా కైకోలార్లు తమిళ సమాజపు పేరున్న సభ్యులు.[25][unreliable source?] స్మరకేసరిట్-తేరింజ-కైకోలార్ మరియు విక్రమసింగట్-తేరింజ-కైకోలార్ వారి పేరును పరంతక నుండి సాధ్యమైన శీర్షికల నుండి పొందారు[26][unreliable source?]

[27][unreliable source?] [28][unreliable source?] [29][unreliable source?] ఉదైయర్-గండరదిట్టత్తెరింజ-కైక్కోలార్[8] కచ్చితంగా ఉత్తమ-చోళుని తండ్రి గండరాదిత్య రాజు పేరుతో పిలిచే సైనిక దలపు పేరు అయ్యుంటుంది.

[30][unreliable source?] [31][unreliable source?] సింగలంతక-తెరింద-కైక్కోలార్ (సింగాలంతక అంటే పర్నాటక I పేరు మీద పిలిచే దళం)

[32][unreliable source?] [33][unreliable source?] దనతొంగ-తేరింజ-కైక్కోల (దళం లేదా జట్టు). ప్రాచీన శాసనాలు మరియు ఇంటిపేరు పర్నాటక I దనతుంగ అతని రాజ్యానికి సంబంధించినదిగా సూచిస్తుంది. [34][unreliable source?] [35][unreliable source?] [36][unreliable source?] ముత్తవల్పెర్ర రాజు ద్వారా దళానికి ఇచ్చే గౌరవం లేదా శ్రేణిని సూచిస్తుంది కావచ్చు. [37][unreliable source?] [38][unreliable source?] [39][unreliable source?] [40][unreliable source?] [41][unreliable source?] [42][unreliable source?] [43][unreliable source?]

శ్రీలంకన్ ముదలియార్లు

పుస్తకం: ది తమిళ్స్ ఇన్ ఎర్లీ సిలోన్ బై సి. శివరత్నం కొంత మంది సిలోన్ లోని ముదలియార్లని తనినాయక ముదలియార్కి దగ్గరివారిగా తెలుపుతుంది (ఇతరుల నడుమ), తొండైమండలం' నుండి సిలోన్ కి వలస వెళ్ళిన గొప్ప శైవ వెల్లాల[5].

జాఫ్నాలో ముదలి ఇంటిపేరుతో తొండైమండలం నుండి వచ్చిన రెండు లేదా మూడు వర్గాలున్నాయి. సేయ్యూర్ నుండి ఇరుమరపం తూయ తనినాయగ ముదలి, మన్నడుకొండ ముదలి వర్గాలు ప్రముఖ కవి కంబర్ కాలంలో కూడా ఉల్లేఖించబడ్డాయి. తొండైనాడు నుండి జాఫ్నాకి వలస మీద జాఫ్నా చారిత్రక పుస్తకం కైలయ మలై నుండి సూటి ఉల్లేఖన ఇక్కడ ఇవ్వబడింది. మిగతా వర్గాలు ఈ విభాగం క్రిందనైనా లేదా శ్రీలంకన్ వెల్లలార్ విభాగం క్రిందనైనా వస్తాయి.

తరువాత మానడుకండ ముదలి పేరు గల, తామర పూల దండను ధరించే, విస్తృత ఖ్యాతి గల, తొండైనాడు దేశ్యజుడైన, కంబన్ మీద అతని రచన ఎరేజ్హుపాటుకు గాను కనకవర్షం కురిపించిన వ్యక్తి కుటుంబమైన వెల్లలది. ఇతను ఇరుపలై వద్ద నివశించేవాడు. తరువాతది ఇంద్రుని వంటి వైభోగం గల, ఎన్నడు జ్ఞానపథం నుండి తప్పుకొని, తెల్ల కలువల దనదని ధరించే సేయూర్ వెల్లాలది. గొప్ప ఖ్యాతి గల, పితృ, మాతృ వంశాలు రెండు శుద్ధ, అసమానమైనవైన తనినాయగ పేరు గలవానిది. ఇతను నేడుంతివ అధికారి. [6].[unreliable source?]

ముదలియార్ల తరగతి కోసం బ్రిటీష్ పాలకులచేత 19వ శతాబ్దపు శ్రీలంక సమయంలో సృష్టించబడిన శ్రీలంకన్ ముదలియార్ల చూడండి.

సెనైతలైవార్ ముదలియార్

చూడడానికి ఆసక్తి కలిగించే అంశం ఈ వర్గం భిన్న ప్రాంతాలలో భిన్న శీర్షికలని ఇంటిపేర్లుగా వాడుతుంది. అంతర్జాలంలో దీనికి సంబంధించిన సూచనలు కనిపించకపోయినప్పటికీ ధర్మపురి, తిరునల్వేలి, విరుధునగర్, పుదుకొట్టై, పుదుచ్చేరి మరియు చుట్టుప్రక్కల ప్రాంతాలలో ముదలియార్ పేరును వాడె వందల కొద్దీ కుటుంబాలున్నాయి. తాంజోర్, నాగపట్టిణం, పోరాయర్ చుట్టుప్రక్కల ప్రాంతాలలో చెట్టియార్ పేరు గల వందల కుటుంబాలున్నాయి. మధురై, తేని, రామ్నాడ్ ప్రాంతాల చుట్టుప్రక్కల పిళ్ళై పేరు గల కొన్ని కుటుంబాలున్నాయి. తిరునల్వేలి ప్రాంతపు చుట్టుప్రక్కల మూపనార్ పేరు గల వందల కుటుంబాలున్నాయి.

ప్రముఖమైన ముదలియర్లు

సూచనలు

http://www.mudaliarinternational.org
http://www.mudaliarcommunity.com

 1. ఇర్స్చిచ్క్, యూగినే ఎఫ్. డైలాగ్ అండ్ హిస్టరీ: కన్స్ట్రక్టింగ్ సౌత్ ఇండియా, 1795-1895. బర్కిలీ: యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రెస్, 1994. డైరెక్ట్ వెబ్ రిఫరెన్స్: http://content.cdlib.org/xtf/view?docId=ft038n99hg&brand=eschol
 2. T. K. T. విరరాఘవాచార్య చే హిస్టరీ అఫ్ తిరుపతి: ది తిరువెంగడం టెంపుల్
 3. సమ్ కాన్ట్రిబ్యూషన్స్ అఫ్ సౌత్ ఇండియా టు ఇండియన్ కల్చర్ - పేజ్ 161 S. కృష్ణస్వామి ఐయంగర్ చే
 4. ఏషియాటిక్ కథనం మరియు నెలసరి విషయమంజరీ
 5. 5.0 5.1 ది తమిళ్స్ ఇన్ ఎర్లీ సిలోన్ బై సి. శివరత్నం, http://books.google.com/books?vid=0PrqSaY8TV9DtgCG9v&id=hlocAAAAMAAJ&q=mudaliyar+vellala&dq=mudaliyar+vellala&pgis=1
 6. 6.0 6.1 noolaham.net
 7. ముడాలి శీర్షిక తో ముస్లిం వర్తకుడు http://www.google.com/url?sa=t&ct=res&cd=1&url=http%3A%2F%2Fbooks.google.com%2Fbooks%3Fid%3D11FYACaVySoC%26pg%3DPA17%26lpg%3DPA17%26dq%3Dmudali%2Bpillai%2Bmarakkayar%26source%3Dweb%26ots%3DeiwtCjhi7G%26sig%3D-2kNNkzgn_Yr1C_A7Ox3aTW0Rs4&ei=SfFOR9_1II-4gQTV7_TsCg&usg=AFQjCNEilgXz8uD_MNmmVvhnu7B5PDldkw&sig2=Ip7S5Nt8KflOsrXjzNcwRw
 8. http://books.google.com/books?id=vbJtAAAAMAAJ&q=mudaliar+title&dq=mudaliar+title&lr=&pgis=1
 9. http://books.google.co.in/books?id=73msCkfD5V8C&pg=PA112&lpg=PA112&dq#PPA112,M1
 10. కాథ్లీన్ గఫ్ఫ్ చే రూరల్ సొసైటి ఇన్ సౌత్ఈస్ట్ ఇండియా
 11. V. కనకసభై చే ది తమిళ్స్ ఐతీన్ హండ్రెడ్ యియర్స్ ఏగో
 12. "ఇర్స్చిక్, యూగెన్ F. డైలాగ్ అండ్ హిస్టరీ: కన్స్ట్రక్టింగ్ సౌత్ ఇండియా, 1795-1895. బెర్కెలే: యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రెస్, 1979.
 13. ఆర్డర్ అండ్ డిస్ఆర్డర్ ఇన్ కొలోనియల్ సౌత్ ఇండియా యూగెన్ F. ఇర్స్చిక్ మోడరన్ ఆసియన్ స్టడీస్, సం||. 23, No. 3 (1989), పేజీలు. 459-492,
 14. ది హిందూ : ఆఫ్ టిల్టింగ్ పిల్లర్స్
 15. రెలిజియన్ అండ్ పబ్లిక్ కల్చర్: ఎన్కౌంటర్స్ అండ్ ఐడిన్టిటిస్ ఇన్ మోడరన్ సౌత్ ఇండియా బై జాన్ జేయా పాల్, కిత్ ఎడ్వర్డ్ యండేల్,http://books.google.com/books?vid=ISBN0700711015&id=x3GuKnZTGG4C&pg=PA241&lpg=PA241&ots=0mGugDgcw8&dq=adondai+kondaikatti&sig=rvjX3UZKGetOlVMyoGQS0IC4ac0
 16. జర్నల్ ఆఫ్ ది రాయల్ ఎసియాటిక్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్ బై రాయల్ ఎసియాటిక్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్,http://books.google.com/books?vid=0o3HpzvAK7y1RHyxOc&id=JLFfVFU1mCoC&pg=PA581&lpg=PA581&dq=adondai+chola#PPA581,M1
 17. సమ్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ సౌత్ ఇండియా టు ఇండియన్ కల్చర్ బై ఎస్. కృష్ణస్వామి అయ్యంగార్, http://books.google.com/books?vid=ISBN8120609999&id=vRcql-QBhRwC&pg=PA394&lpg=PA394&dq=adondai+chola&sig=CUdOfMyvFWr60FUG2jBelSkCQhQ
 18. హిస్టరీ ఆఫ్ తిరుపతి: ది తిరువెంగడం టెంపుల్ బై టి. కే. టి. వీరరాఘవాచార్య, http://books.google.com/books?vid=0EAC1QqCYpse1n8eEo&id=VBoaAAAAMAAJ&q=adondai&dq=adondai&pgis=1
 19. [1]
 20. [2]
 21. [3]
 22. [4]
 23. వెనకబడిన తరగతుల యొక్క జాబితా
 24. లిస్ట్ ఆఫ్ బ్యాక్ వార్డ్ క్లాస్సేస్ అప్రువ్డ్
 25. సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్-వాల్యుం-XIX-ఇన్స్క్రిప్షన్స్ అఫ్ పరకేసరివర్మాన్@ whatisindia.com
 26. సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్-వాల్యుం-XIX-ఇన్స్క్రిప్షన్స్ అఫ్ పరకేసరివర్మాన్ @ whatisindia.com
 27. సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్-వాల్యుం_13 - ఇన్స్క్రిప్షన్స్ of రాజకేసరివర్మాన్ @ whatisindia.com
 28. సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్-వాల్యుం_13 - చోలాస్ ఇన్స్క్రిప్షన్స్ @ whatisindia.com
 29. సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్-వాల్యుం 17 ఇన్స్క్రిప్షన్స్ కలక్టేడ్ డ్యురింగ్ ది యియర్ 1903-04 @ whatisindia.com
 30. సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్-వాల్యుం_13 - ఇన్స్క్రిప్షన్స్ of రాజకేసరివర్మాన్ @ whatisindia.com
 31. సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్- ఇన్స్క్రిప్షన్స్ కలక్టేడ్ డ్యురింగ్ ది యియర్ 1908-09 @ whatisindia.com
 32. సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్-వాల్యుం 2 - రాజరాజేశ్వర టేమ్పిల్ ఇన్స్క్రిప్షన్స్ ఏట్ తంజావూర్ @ whatisindia.com
 33. సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్-వాల్యుం_3 - నాగేస్వరస్వమిన్ & ఉమంబెస్వర & అడిములేస్వర టేమ్పిల్స్ ఇన్స్క్రిప్షన్స్ @ whatisindia.com
 34. సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్-వాల్యుం-XIX-ఇన్స్క్రిప్షన్స్ అఫ్ పరకేసరివర్మాన్ @ whatisindia.com
 35. సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్-వాల్యుం_13 - ఇన్స్క్రిప్షన్స్ of రాజకేసరివర్మాన్ @ whatisindia.com
 36. సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్-వాల్యుం-XIX-ఇన్స్క్రిప్షన్స్ of పరకేసరివర్మాన్@ whatisindia.com
 37. Sసౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్-వాల్యుం-XIX-ఇన్స్క్రిప్షన్స్ of పరకేసరివర్మాన్@ whatisindia.com
 38. సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ - ఇన్స్క్రిప్షన్స్ of రాజరాజ I @ whatisindia.com
 39. సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ - తిరువరూర్ (తిరువరూర్) టేమ్పిల్ ఇన్స్క్రిప్షన్స్ @ whatisindia.com
 40. సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ - ఇన్స్క్రిప్షన్స్ కలక్టేడ్ డ్యురింగ్ ది యియర్ 1906-07 @ whatisindia.com
 41. సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ - ఇన్స్క్రిప్షన్స్ కలక్టేడ్ డ్యురింగ్ ది యియర్ 1908-09 @ whatisindia.com
 42. సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ - ఇన్స్క్రిప్షన్స్ కలక్టేడ్ డ్యురింగ్ ది యియర్ 1908-09 @ whatisindia.com
 43. సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ - ఇన్స్క్రిప్షన్స్ కలక్టేడ్ డ్యురింగ్ ది యియర్ 1908-09 @ whatisindia.com