"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మొలుగు బంగ్లా హనుమంతరావు

From tewiki
Jump to navigation Jump to search
మొలుగు బంగ్లా హనుమంతరావు
200 px
మొలుగు బంగ్లా హనుమంతరావు
మాతృభాషలో పేరుమొలుగు బంగ్లా హనుమంతరావు
జననంనవంబర్ 21, 1886
వేలూరు, మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం,
మరణంసెప్టెంబర్ 12, 1971
జాతీయతభారతీయుడు
సంస్థరంగస్థలం
మతంహిందూ
పిల్లలుమొలుగు బంగ్లా వెంకట్రావు (కుమారుడు); రఘుపవన్ రావు మరియు లక్ష్మీ కిరణ్ (మనుమలు)

మొలుగు బంగ్లా హనుమంతరావు (నవంబర్ 21, 1886 - సెప్టెంబర్ 12, 1971) తెలంగాణ తొలితరం నాటకకర్త. తెలంగాణలో తొలిసారిగా 1939లో సురభి నాటక సమాజంను వేలూరు గ్రామానికి రప్పించి ప్రదర్శనలు ఇప్పించాడు.[1][2]

జననం

1886, సెప్టెంబర్ 12న తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, వేలూరు గ్రామంలోని భూస్వామ్య కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి వేంకట లక్ష్మీనరసింహారావుకు కళలపై మక్కువ ఉండడంతో తన ఆస్థానంలో వివిధ కళాకారులచే ప్రదర్శనలు ఇప్పించి నజరానాలు ఇచ్చేవాడు.

రంగస్థల ప్రస్థానం

బెంగుళూరులోని 'ధార్వాడ' నాటక సమాజం వారి మరాఠి, కన్నడ ప్రదర్శనలు చూసి, తమ ప్రాంతంలో కూడా అలాంటి ప్రదర్శనలు చేయించాలన్న ఆకాంక్షతో సురభి నాటక సమాజాల గురించి తెలుసుకొని 1939లో కడపకు వెళ్ళి సురభివారిని కలిసి, ఒప్పించి మొదటిసారిగా నైజాం రాష్ట్రానికి రప్పించాడు. వారికి ఒక స్థిర నివాసాన్ని నిర్మించి ఇచ్చాడు. ఆ ఇంటిని 'నాటకోళ్ళ ఇల్లు' గా పిలుస్తారు. అలా సురభి వారు వేలూరు గ్రామంతోపాటూ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలో కూడా ప్రదర్శనలు ఇచ్చేవారు.

కొంతకాలం తరువాత తమ గ్రామంలోని యువకులకు సురభి వారిచేత శిక్షణా తరగతులు ఇప్పించాడు. 1945లో జోగి పేట వాసి డా. రంగా కృష్ణమాచార్యులు రచించి, నటించిన 'దేశభక్తి' నాటకాన్ని నైజాం ప్రభుత్వం నిషేధిస్తే, ఆ నాటక ప్రదర్శన జరగడంకోసం ఆర్థిక సహాయం అందించాడు.[3]

మరణం

1955 ప్రాంతంలో పక్షవాతంతో మంచానపడిన ఈయన 1971, సెప్టెంబర్ 12 మరణించాడు.

మూలాలు

  1. అంధ్రజ్యోతి (సిద్ధిపేట) (27 March 2018). "సురభిని రప్పించిన ఘనుడు". Archived from the original on 12 September 2018. Retrieved 12 September 2018.
  2. Telangana Today (15 July 2018). "Patron of traditional art forms". Archived from the original on 12 September 2018. Retrieved 12 September 2018.
  3. తెలంగాణ తొలితరం నాటకకర్త మొలుగు బంగ్లా హనుమంతరావు, నటకులమ్ (రంగస్థల కళల మాస పత్రిక), వ్యాసకర్త: లక్ష్మీకిరణ్, సంపాదకులు: దాసరి శివాజీరావు, హైదరాబాదు, సెప్టెంబర్ 2018, పుట. 8,9.