"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మొహమ్మద్ ఆలీ (తెలంగాణ)

From tewiki
Jump to navigation Jump to search
మొహమ్మద్ మహమూద్ ఆలీ
Deputy Chief Minister of Telangana
Assumed office
June 2, 2014
Preceded byPosition established
Member of Legislative Council
Assumed office
2010
ConstituencyTelangana
Personal details
Political partyTelangana Rashtra Samithi
Childrenone son and two daughters
ResidenceAzampura, Hyderabad, Telangana, India Religion = Sunni Islam
Alma materOsmania University

మొహమ్మద్ మహ్మూద్ ఆలీ తెలంగాణ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యంత్రి. ఆయన కొత్తగా యేర్పడిన తెలంగాణ రాష్ట్రానికి జూన్ 2, 2014 న ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా టి.రాజయ్య కూడా పదవీ స్వీకారం చేసారు.[1] ఆయన స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్, రిలీఫ్ అండ్ రీహాబితేషన్ శాఖలకు కూడా మంత్రిగా భాద్యతలు తీసుకున్నారు.[2]

ప్రారంభ జీవితం

ఆయన హైదరాబాదులో జన్మిచి అజంపుర లో నివసిస్తున్నారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.కాం చేసారు.

రాజకీయ జీవితం

ఆయన 2010లో అంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా ఎన్నికైనారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్రం లో శాసన మండలి సభ్యునిగా ఉన్నారు.[3] ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి మైనారిటీ సెల్ అధ్యక్షునిగా కూడా ఉన్నారు.[4][5][6] మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రి హోదాతోపాటు కీలకమైన రెవెన్యూ, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్, అర్బన్‌ల్యాండ్ సీలింగ్, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖలు దక్కాయి.[7]

వ్యక్తిగత జీవితం

ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు.

మూలాలు

  1. "KCR to Be Sworn in Telangana State's First CM on June 2". Deccan-Journal. Retrieved 2 June 2014.
  2. "Council of Ministers". telangana.gov.in. Retrieved 14 July 2014.
  3. Mohammad Mahmood Ali president TRS minority cell felicitated | Siasat
  4. TRS names Mohammed Mahmood Ali as MLC candidate | Siasat
  5. Heat in Delhi over MLC list | Deccan Chronicle
  6. Congress is misleading Muslims using religious groups: TRS - indtoday.com | indtoday.com
  7. ఆంధ్రప్రభ, ముఖ్యాంశాలు (13 December 2018). "అల్లా సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన మహమూద్ అలీ". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.

ఇతర లింకులు