"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మోహన భోగరాజు

From tewiki
Jump to navigation Jump to search
మోహన భోగరాజు
150px
వృత్తిసినీ నేపధ్య గాయని
మతంహిందూ

మోహన భోగరాజు ప్రముఖ వర్తమాన సినీ గాయని.[1]

జీవిత విశేషాలు

మోహన సొంతవూరు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. కానీ ఆమె తల్లిదండ్రులు హైదరాబాదులో స్ధిరపడ్డారు. మోహన పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. ఆమె బీటెక్‌తో పాటే ఎంబీఏ చేశారు. వారి కుటుంబానికి సంగీత నేపథ్యం ఏమీ లేదు. కానీ వాళ్లమ్మ సరదాగా పాటలు పాడుతుండేదట. దీంతో మోహన మూడేళ్ల వయసులో పాడటం నేర్చుకున్నారు. దీంతో ఎక్కడ ఏ సంగీతం కార్యక్రమం జరిగినా వాళ్లమ్మ అక్కడికి తీసుకెళ్లేది. రెండో తరగతిలో త్యాగరాయ గానసభలో జరిగిన పోటీలో పాడి సబ్ జూనియర్ కేటగిరీలో మొదటి బహుమతి గెలుచుకుంది. అప్పటి నుంచి ఆసక్తి పెరుగుతూ వచ్చిందని మోహన చెబుతారు.

ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన జై శ్రీరామ్‌లో "సయ్యామ మాసం" అనే పాట ద్వారా ఆమె తెలుగుతెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత చదువు మీద దృష్టి పెట్టారు. చదువు పూర్తయ్యాక కొన్నాళ్లు వర్క్ ఎట్ హోమ్ చేశారు. తర్వాత సంగీతము కరెక్ట్ అని పూర్తిగా ఇటువైపు వచ్చేశారు.

మోహనకు బ్యాక్‌గ్రౌండ్ ఎవరూ లేనప్పటికీ ఆత్మస్థైర్యంతో ముందడుగు వేశారు. ఎన్నెన్నో అవమానాలు, నిరాశలు, వైఫల్యాలను చవిచూశాకే విజయాల బాట పట్టారామె. సినిమాలకు ప్రయత్నం చేసే క్రమంలో ఈవిడ ఎం. ఎం. కీరవాణి గ్రూపులో చేరారు. అక్కడ చేరాక ఏమో గుర్రం ఎగరావచ్చుకి కోరస్, రీ-రికార్డింగ్ పాడా. తర్వాత దిక్కులు చూడకు రామయ్యకు సోలో సాంగ్ పాడే అవ కాశం వచ్చింది. ఆయన దగ్గర రికార్డ్ అయిన మొదటి పాట బాహుబలి సినిమాకే. ప్రభాస్ పుట్టిన రోజుకి విడుదల చేసిన మొదటి టీజర్ అది. నిజానికి ఆ పాట బాహుబలి కోసమని అప్పటి వరకు మోహన కు తెలి యదట. ఆగ్రూపు సాంగ్ తర్వాత అదే సినిమాలో మనోహరీ పాటతెలుగు, తమిళం లో, బాహుబలి-2లో ఒరే ఒరూరిల్ ఒరేఒర్ రాజా (హంసనావ) పాట తమిళ వెర్షనలో పాడే అవకాశాన్ని మోహన దక్కించుకున్నారు.

మోహన పదో తరగతిలో ఉన్నప్పటి నుంచి తన పాటల సీడీ ప్రముఖులకు ఇవ్వాలని అనుకుందట. కానీ ఎలా ఇవ్వాలో, ఎలా కలవాలో తెలియక చాలాకాలం వరకు కుదరలేదు. చివరికి గాయని రమ్య కలిసాకే తన సీడీ ఇవ్వడం కుదిరిందని మోహన అంటారు. సినిమా రంగంలోకి ఆలస్యంగా వచ్చినప్పటికీ మోహన తక్కువ సమయంలోనే గుర్తింపునిచ్చే పాటలు పాడి తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఆమె పాడిన పాటలెన్నో సినిమాల విజయంలో కీలకం కావడం విశేషం.

మూలాలు

  1. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (October 8, 2017). "మోహన రాగం". Archived from the original on 15 July 2019. Retrieved 15 July 2019.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).