యర్రంశెట్టి శాయి

From tewiki
Jump to navigation Jump to search

యర్రంశెట్టి శాయి' ప్రసిధ్ధ తెలుగు నవలా రచయిత. శృంగారం, హాస్యం కలగలిసిన రచనలు వీరి ప్రత్యేకత. ఎన్నో నవలలు, కథలు, రచనలు చేసారు.[1] అతను హాస్య, వ్యంగ్య కథలే కాకుండా సెంటిమెంటుతో కూడిన కథలూ, మధ్యతరగతి వారి జీవితాలను ప్రతిబింబించే కథలూ కూడా చాలానే రాశాడు. వివిధ వార, మాస పత్రికలలో దాదాపు రెండు వందల కథలు పైగా ప్రచురితమయ్యాయి. అతను రైల్వేలో ఉద్యోగం చేశాడు. అనేక నవలలు రాసాడు. కథల విషయానికొస్తే అన్ వాంటెడ్ డాక్టర్’, ‘కాకి- తందూరీ చికెను’,’భూతం ఫోన్’, ‘వదినమ్మ’, ‘ రౌడీ పిల్ల’, ‘ కాటేసిన పగ’, ‘ మిమిక్రీ ‘ మొదలైనవెన్నో ఎంతో పేరు పొందేయి. సెటైర్లకు, పదునైన వ్యాఖ్యలకు యర్రంశెట్టి సాయి పెట్టింది పేరు.[2]

రచనలు

 • హ్యూమరాలజీ[3]
 • సుడిగుండాపురం రైల్వేస్టేషన్
 • సినీపంచతంత్రం
 • అమ్మాయూ ఓ అమ్మాయూ[4]
 • లవ్ ఎట్ సెకండ్ సైడ్
 • రాభరోసా అపార్ట్ మెంట్స్
 • ప్రేమకు ఫుల్ స్టాప్ ఉందా - మా ఇంటి ప్రేమాయణం పేరుతో సినిమాగా తీయబడింది.
 • లవ్ స్టోరీస్
 • హాస్య కథానికలు[5]
 • బెస్ట్ జోక్స్[6]
 • జనరంజని
 • హ్యూమరాలజీ 3[1]
 • సినీ బేతాళం

మూలాలు

 1. 1.0 1.1 "కథానిలయం - View Writer". kathanilayam.com. Retrieved 2020-07-04.
 2. "భానుమతి సినిమాకు అందుకే రాయలేనని చెప్పా: యర్రంశెట్టి సాయి". Teluguone (in English). 2020-04-10. Retrieved 2020-07-04.
 3. హ్యూమరాలజీ(Humourology) By Yarramsetti Sai - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige.
 4. అమ్మాయీ.. ఓ అమ్మాయీ...(Ammayee O Ammayee) By Yarramsetti Sai - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige.
 5. యర్రంశెట్టి శాయి హాస్య కథానికలు(Yarramsetti Sai Hasya Kathanikalu) By Yarramsetti Sai - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige.
 6. బెస్ట్ జోక్స్ (రివైజ్డ్ ఎడిషన్)(Best Jokes Revised Edition) By Yarramsetti Sai - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige.

బాహ్య లంకెలు