యలమంచిలి హనుమంతరావు

From tewiki
Jump to navigation Jump to search
యలమంచిలి హనుమంతరావు
250px
యలమంచిలి హనుమంతరావు
జననం1938 మార్చి 1
మరణంజనవరి 19 2016
ఎల్లారెడ్డి గూడెం
మరణ కారణంగుండెపోటు
ఇతర పేర్లుయలమంచిలి హనుమంతరావు
విద్యఅగ్రికల్చర్ బి.యస్సీ
ఉద్యోగంఆలిండియా రేడియో
సుపరిచితుడురేడియో ప్రముఖులు
తల్లిదండ్రులుసాంబశివరావు
వరలక్ష్మి

యలమంచిలి హనుమంతరావు రేడియో హనుమంతరావుగా తెలుగు రాష్ర్టాల రైతులకు సుపరిచితుడైన వ్యక్తి.[1]

జీవిత విశేషాలు

ఆయన కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా మేడూరులో 1938 మార్చి 1 న సాంబశివరావు, వరలక్ష్మి దంపతులకు జన్మించారు. 3వ తరగతి వరకు మేడూరులో చదివి, ఇంటర్మిడియట్ వరకు విజయవాడలో సి.వి.ఆర్.జి.ఎం. హైస్కూలులో, ఎస్.ఎస్.ఆర్ & సి.వి.ఆర్ కళాశాలలో 1956 నుండి 1959 వరకు బాపట్ల వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బి.యస్సీ చదివారు. 12 ఏళ్లు వ్యవసాయ శాఖలో పనిచేసిన హనుమంతరావు 1971లో ఆల్‌ఇండియా రేడియోలో చేరారు. రైతుల కార్యక్రమాలను రేడియోలో వినసొంపుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది. అన్నదాతగా, ఆత్మబంధువుగా, రేడియోరావుగా హనుమంతరావు గుర్తింపు పొందారు.

మరణం

ఎల్లారెడ్డిగూడలోని స్వగృహంలో జనవరి 19 2016 ఉదయం 10.30 గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందారు.

మూలాలు

ఇతర లింకులు