"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

యాత

From tewiki
Jump to navigation Jump to search

ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా ఏ.గ్రూపులోని 33వకులం.[1]శ్రీకాకుళం జిల్లాలో ఈ కులస్తులు ఎక్కువ.ఈ కులస్తులు తాటిఆకుతో చేసిన గొడుగులను యాతగొడుగులు లేదా గిడుగులు అంటారు.వర్షాకాలంలో యాతకులస్తులు పూర్వం గ్రామాల్లో తిరిగి గిడుగులు అమ్మేవారు.వీరుతయారు చేస్తున్న గొడుగులకు గిట్టుబాటు ధర లభించడంలేదు.ప్లాస్టిక్‌, పాలిస్టర్‌తో తయారు చేసిన గొడుగులు ఎక్కువ కాలం మన్నికను ఇస్తాయని తాటాకు గొడుగులైతే ప్రతీ ఏటా కొనుగోలు చేయాల్సివస్తోందని అంటూ ప్రజలు ప్లాస్టిక్‌ తొడుగులు, బటన్‌ గొడుగులపై మోజు పెంచుకోవటంతో వీటికి ఆదరణ కరువైంది. ఈ వృత్తిపై ఆధారపడిన కొరసవాడలో సుమారు 40 కుటుంబాలున్నాయి. చేతికి పూర్తిస్థాయిలో పనిలేని కారణంగా ఉపాధి కోసం నగరాలకు వలసపోతున్నారు.

మూలాలు

  1. Kutikuppala, Himasagar. "Andhra Pradesh Backward Caste List : Srikakulam Online". Srikakulam Online Portal (in English). Retrieved 2020-08-25.

బాహ్య లంకెలు