"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

యాదగిరిగుట్ట పురపాలకసంఘం

From tewiki
Jump to navigation Jump to search
యాదగిరిగుట్ట పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి భువనగిరి
మండలం యాదగిరిగుట్ట
ప్రభుత్వము
 - చైర్‌పర్సన్‌ ఎరుకల సుధ
 - వైస్ చైర్‌పర్సన్‌ మేడబోయిన కాటంరాజు
జనాభా (2011)
 - మొత్తం {{#property:P1082}}
 - పురుషుల సంఖ్య 7,890
 - స్త్రీల సంఖ్య 7,747
 - గృహాల సంఖ్య 3,160
పిన్ కోడ్ - 508115
ఎస్.టి.డి కోడ్ - 08685
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

యాదగిరిగుట్ట పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] దీని ప్రధాన కార్యాలయ కేంద్రస్థానం యాదగిరిగుట్ట పట్టణం. ఈ పురపాలక సంఘం భువనగిరి లోకసభ నియోజకవర్గంలోని, భువనగిరి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర

మేజర్ గ్రామ పంచాయితిగా ఉన్న యాదగిరిగుట్ట, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం

యాదగిరిగుట్ట 12.74 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, సముద్రమట్టానికి 609.9 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది 170–35 N 780-56’ E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. జిల్లా కేంద్రం భువనగిరి నుండి 12 కిలోమీటర్ల దూరంలో, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. యాదగిరిగుట్ట మునిసిపాలిటీ ప్రధానంగా నివాస ప్రాంతాల పరిధిలో ఉంది, తరువాత వాణిజ్య, పబ్లిక్ సెమీ పబ్లిక్ కార్యాలయాలు మరియు సినిమా హాల్, టి.ఎస్.ఆర్.టి.సి బస్ డిపో, మార్కెట్ యార్డులు ఉన్నాయి.[4]

జనాభా గణాంకాలు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 15637 మంది కాగా, అందులో 7890 మంది పురుషులు, 7747 మంది మహిళలు ఉన్నారు. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 15 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[5]

పౌర పరిపాలన

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకారం దీనిని 12 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎరుకల సుధ చైర్‌పర్సన్‌గా, మేడబోయిన కాటంరాజు వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[6][7][8] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు

  1. అరుణ గౌలికర్
  2. మేడబోయిన కాటంరాజు (వైస్ చైర్‌పర్సన్)
  3. బూడిద సురేందర్
  4. విజయాలక్ష్మీ సీసా
  5. గుండ్లపల్లి వాణి
  6. మాలోతు సరోజ
  7. ఎరుకల సుధ (చైర్‌పర్సన్)
  8. ముక్కెర్ల మల్లేష్
  9. దండబోయిన అనిల్
  10. అవుల మమత
  11. తల్లాపల్లి నాగరాజు
  12. బబ్బూరి మౌనిక

మూలాలు

  1. "Yadagirigutta Municipality". yadagiriguttamunicipality.telangana.gov.in. Retrieved 7 March 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 7 March 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 7 March 2021.
  4. "Yadagirigutta Municipality". yadagiriguttamunicipality.telangana.gov.in. Retrieved 7 March 2021.
  5. "Basic Information of Municipality, Yadagirigutta Municipality". yadagiriguttamunicipality.telangana.gov.in. Retrieved 7 March 2021.
  6. "Council, Yadagirigutta Municipality". yadagiriguttamunicipality.telangana.gov.in. Retrieved 7 March 2021.
  7. నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 7 March 2021.
  8. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 7 March 2021.

వెలుపలి లంకెలు