"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
యాదవ
![]() | విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
భారతదేశంలో పశుపోషణ వృత్తిగా కలిగిన తెగలు ఎన్నియో ఉన్నవి. అందులోని యాదవ అనేది భారతదేశానికి చెందిన ప్రాచీన జాతి. [1][2]యాదవులు (మహారాజ్ యాడు యొక్క భూమి- వారసులు) పురాతన భారతదేశ ప్రజలు పురాణ రాజు యదు వారసులు. యాదవ్ రాజవంశం ప్రధానంగా ఆభీరాస్ (ప్రస్తుత అహిర్ ), ఆంధక్, వృృష్ణి, సత్వత్ అనే సమాజాలను కలిగి ఉంది, వీరు శ్రీకృష్ణుని ఆరాధకులు. పురాతన భారతీయ సాహిత్యంలో ఈ ప్రజలు యదువంష్ యొక్క ప్రధాన అవయవాలుగా వర్ణించబడ్డారు. యాదవ్ మహారాజ్ యాడు వంశస్థుడు, యాదవ్ అనే పేరుతో పిలుస్తారు. యాదవ తెగ వేదవ్యాసుడు వ్రాసిన మహాభారత కావ్యంలో పేర్కొనబడటంతో ప్రసిద్ధిపొందినది. ఆ కావ్యంలో యాదవులు చంద్రవంశపు క్షత్రియులు అని ప్రస్తావన ఉంది. మహాభారత కావ్యం ప్రకారం వృషిణి అను తెగకు చెందిన యదు అను రాజుయొక్క సంతానమునకు యాదవులని పేరు వచ్చింది. యాదవులకు ప్రధాన ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడు. వీరు సంస్కృత మహాభారత కావ్యం రచించబడిన కాలంలో శ్రీ కృష్ణుడు నుంచే వర్ణ వ్యవస్థ పుట్టినట్టు తెలుస్తుంది. భారతీయ రిజర్వేషన్ సిస్టం ప్రకారం ఒ.బి.సి. వర్గాలకు చెందిన వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం, పశు పోషణ. లూసియా మిచెలుట్టి యొక్క యాదవులపై చేసిన పరిశోధన ప్రకారం -
" | యాదవ్ కులం యొక్క మూలంలో పాతుకుపోయిన రాజవంశం యొక్క నిర్దిష్ట సూత్రం ప్రకారం, భారతీయ గోపాలక్ కులాలన్నీ శ్రీకృష్ణ (గోపాలక్, క్షత్రియ) జన్మించిన అదే యదువంష్ నుండి వచ్చాయి… .అవారందరూ శ్రీ కృష్ణుడికి చెందినవారని వారిలో బలమైన నమ్మకం ఉంది ఉన్న, ప్రస్తుత యాదవ్ కులాలు అదే పురాతన పెద్ద యాదవ్ సమూహం నుండి రద్దు చేయబడ్డాయి. |
క్రిస్టోఫ్ జాఫెర్లాట్ ప్రకారం
" | యాదవ్ అనే పదం అనేక పేర్లతో పిలువబడుతుంది, మొదట హిందీ ప్రాంతంలో, పంజాబ్, గుజరాత్లలో - అహిర్ , మహారాష్ట్ర, గోవాలో - గావ్లి , ఆంధ్ర, కర్ణాటక - గొల్ల , తమిళనాడులో - కోనర్ , కేరళ. - మనేర్ సాధారణ సంప్రదాయక శ్రామిక కౌబాయ్, ఎద్దు-మంద, పాలు అమ్మకాలలో ఉంది. |
Contents
ఇతిహాసాల్లో ప్రస్తావన
యాదవులు మహాభారత కావ్యంలో పేర్కొనబడటంతో ప్రసిద్ధిపొందారని చెప్పవచ్చు. సంస్కృత మహాభారత కావ్యం ప్రకారం యాదవులు యదు అను రాజు యొక్క వంశస్థులు. యాదవ వంశము అనేకశాఖలు కలిగి మిక్కిలి ప్రసిద్ధులు అగు రాజులను పలువురను కలిగి ఉండెను. అందు యదువునకు జ్యేష్ఠపుత్రుఁడు అయిన సహస్రజిత్తునుండి హేహయ వంశము ఆయెను. వారికి మాహిష్మతి ముఖ్యపట్టణము. ఆవంశమున కార్తవీర్యార్జునుఁడు మిగుల ప్రసిద్ధికి ఎక్కిన రాజు. అతని వంశస్థులు తాళజంఘులు అను పేర వెలసిరి. యదుని రెండవ పుత్రుఁడు అగు క్రోష్టువు వంశమున ప్రసిద్ధికి ఎక్కినరాజులు శశిబిందువు, జ్యామఘుఁడు, విదర్భుఁడు. వారలలో విదర్భుఁడు విదర్భరాజు వంశస్థాపకుఁడు ఆయెను. అతని మూడవ కొమరుని నుండి చేదివంశము వచ్చెను. రెండవ కొమరుని వంశస్థుఁడు అగు సాత్వతుని నుండి భోజవంశమును, అంధకవంశమును, వృష్ణివంశమును కలిగెను. అందు భోజవంశస్థులు ధారాపురాధిపులు అయిరి. అంధక వంశమున కృష్ణుఁడు పుట్టెను. వృష్ణివంశమున సత్రాజిత్తును సాత్యకియు పుట్టిరి.
వీరు ప్రధాన యాదవ వంశాలు
- యదువంషి - యదు యదువుని వంశ వృక్షం (Aala Golla)
- నంద్ వంషి - (అహిర్స్) నందుని వంశ వృక్షం
- గ్వాల్వంషి - హొలీ గ్వాల వంశ వృక్షం,(కురుమగొల్ల / కురుబ గొల్ల)
- అందక వంశం- గొల్ల వారు
యాదవ గోత్రాలు
బోధినీల్ల(వర్ధం), వెయ్యవులా, (చండియ), కొషలియ, కనింవాల్, కల్గాన్, కాంకస్, కస్నియ,కలలియ, కత్, కదియాన్, ఖోల్, పెడేంద్ర (గోపిదేశి), ఖైర్, ఖతోదియ, ఖోద్మియ, ఖుదోతియ, ఖుదోలియ, ఖైర్వాల్, ఖేద్కియ, కేశివ్, ఖోసియ, గరాహ్, గంవాల్, గిదాద్, ఘూంగ్లా, చోరా, చైవాదియ, చైదాలియ, జంజాదియ, జాదం, జద్వాల్, చదోదియ, నానపాల్, జద్గోలియ,ఝావత్, తెహ్రాకియ, తొండక్, తక్రాన్, అదుక్వాల్, తతన్, దగర్, దాబర్, దేహ్మివాల్, దాంతర్త, దేశ్వాల్, దహియ, ఉల్లేంల, నిగనియ, నహరియ, నిర్బాన్, నికుం, నిచ్వానియ, పంహార్, పచ్పడియ, రోద్వాల్,బల్రియ,బోగోలు,
ఆచార వ్యవహారాలు
వీరి ఆరాధ్య దైవం మహాభారత కావ్యంలోని శ్రీకృష్ణుడు.
రాజకీయ ప్రముఖులు :
- అనిరూద్ జగన్నాథ్ , మారిషస్ దేశ మాజీ రాష్ట్రపతి, ప్రధాన మంత్రి
- ప్రావింద్ జగన్నాథ్ , మారిషస్ దేశ ప్రస్తుత ప్రధానమంత్రి
- ములాయంసింగ్ యాదవ్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
- లాలూ ప్రసాద్ యాదవ్ , బీహార్ మాజీ ముఖ్యమంత్రి
- అఖిలేశ్ యాదవ్ , ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి
- బసుదేవ్ పాండే , టి & టి దేశ మాజీ ప్రధానమంత్రి
- డా.రామ్ బరన్ యాదవ్, నేపాల్ రాష్టపతి
- శ్రీమతి చిత్ర లేఖ యాదవ్, స్పీకర్, నేపాల్
- ములాయం సింగ్ యాదవ్, సమాజ్వాది పార్టీ చీఫ్
- శరద్ యాదవ్, జనతా దల్ చీఫ్
- రావు బీరెంద్ర సింగ్ యాదవ్, హర్యానా 2 వ ముఖ్యమంత్రి
- చౌదరి బ్రహ్మ ప్రకాష్ యాదవ్, ఢిల్లి మొదటి ముఖ్యమంత్రి
- శ్రీమతి రబ్రిదేవి యాదవ్, మాజి బిహార్ ముఖ్యమంత్రి
- తను పిళ్ళై, కేరళ 2 వ ముఖ్యమంత్రి
- బి.పి. మండలం యాదవ్ (లేట్), మాజి బీహర్ ముఖ్యమంత్రి
- బాబు లాల్ గౌర్, మాజీ మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి
- రాందేవ్ బాబా యోగ గురు పతంజలి
- అన్నహజారే
క్రీడా, ఇతర రంగాలలో ప్రముఖులు
- కేదార్ జాధవ్, తొలి వ్యక్తిగత గోల్డ్ మెడల్ విజేత
- వికాస్ యాదవ్,2010 ఆసియా గేమ్స్ విజేత
- రంజిత్ సింగ్ యాదవ్,
- అజయ్ జడేజా
- శివలాల్ యాదవ్
- ఉమేశ్ యాదవ్
- శ్రీమతి సంతోశ్ యాదవ్, తొలిసారి ఎవరెస్ట్ ని 2 సార్లు అధిరోహించిన మహిళ
- ధనరాజ్ పిళ్ళై
- శివాజి రావ్ గైక్వాడ్ (రజినీ కాంత్), సూపర్ స్టార్ ఆఫ్ సౌత్ ఇండియా ( డంగర్ లేదా కురుబ/ కురుబ గొల్ల)
- అర్జున్, నటుడు (కురుబ/ కురుబ గొల్ల ) కర్నాటక రాష్ట్రం
- కె. యస్. ఆర్. దాస్, సినీ దర్శకుడు (మోసగాళ్ళకు మోసగాడు మొ..వి)
- సముద్ర ఖని, సినీ దర్శకుడు
- కె. యస్. రవి కుమార్, సినీ దర్శకుడు
- సూర్య, నటుడు
- కార్తీక్, నటుడు
- నిఖిల్, నటుడు
- రంజిత్ సింగ్ యాదవ్
- అజయ్ జడేజా
- శివలాల్ యాదవ్, (మాజీ బి.సి.చీఫ్)
- ఉమేశ్ యాదవ్
- సూర్య కుమార్ యాదవ్
- రవీంద్ర జడేజా
- ధీరజ్ జాదవ్
- కుల్దీప్ యాదవ్
- ఏక్తా చౌధురి, (మిస్ ఇండియా యూనివర్స్)
- రఘు బీర్ యాదవ్, హిందీ నటుడు
- మాధవి, నటి
- బోయిన సుబ్బారావు, దర్శకుడు.
సంబంధిత ఇతర తెగలు
భారతదేశంలోని పశుపోషణ వృత్తిగల తెగలు చాలా ఉన్నా, ఆ తెగలను వివిధ రాష్ట్రాలలో వేర్వేరు పేర్లతో పిలుస్తారు [3]. యాదవులు మహాభారత కావ్యంలో పేర్కొనబడటంతో దేశ ప్రసిద్ధినొందారు. కొన్ని తెగలు ఒకే వృత్తిని జీవనాధారంగా కలిగియున్నప్పుడు ఆ తెగలన్నీ ఒకే జాతికి చెందినవారనే భావన కలుగడం సహజము. ఆ క్రమంలో వృత్తిపరంగా యాదవులను పోలిన ఇతర పశుపోషణ వృత్తిగల తెగలు యాదవులను తమ పూర్వీకులుగా భావించాయి. యాదవులను పూర్వీకులుగా విశ్వసించే జాతుల పేర్లు, గోపాలులు, ఏయాగొల్లలు, కురుమగొల్ల , సద్గోప, గౌర్, అహిర్, గౌడ, దుమల గౌడ, మధురపురియ గౌడ, నంద గౌడ, కంజ గౌడ, మగధ గౌడ, లక్ష్మీనారాయణ గౌడ, జడేజా, రావత్, జాదవ్,కురుబ/ కురుబ గొల్ల
మూలాలు
- ↑ Caste and Politics: Identity Over System, Dipankar Gupta
- ↑ Comprehensive History and Culture of Andhra Pradesh p 15 M. L. K. Murty, Dravidian University - 2003 -"In addition to Scheduled Tribes, there are other social groups, like Golla, Kuruba, Kuruva and Kuruma, whose traditional economy is predominantly sheep/goat herding and cattle pastoralism."
- ↑ Diversity at Three Tetrameric STR Loci in a Substructured Golla Caste Population of Southern Andhra Pradesh, in Comparison to Other Indian Populations - B. Mohan Reddy, Ranjan Dutta , Banrida T. Langstieh1 and V.K. Kashyap
లంకెలు
- https://en.wikipedia.org/wiki/Yadava
- https://web.archive.org/web/20190626101250/http://www.yadavhistory.com/
- https://web.archive.org/web/20150412001510/http://www.drdo.gov.in/drdo/ceptam/download/OBClist.pdf
- https://en.wikipedia.org/wiki/Ahir
- http://www.peoplegroupsindia.com/profiles/yadav/
- https://web.archive.org/web/20150316213027/http://www.yadavclub.com/yadav-gotra.html
- http://nikeshyadav.com/yadav_gotra_list/
- http://www.iyadavhistory.com[permanent dead link]
- htttp://Alias used for YADAV in different regions _ Nikesh.html
- https://web.archive.org/web/20150218141954/http://archives.cerium.ca/IMG/pdf/Caste_and_Politics-_Identity_Over_System_.pdf
- తక్కువ వికీలింకులున్న వ్యాసాలు from అక్టోబరు 2016
- All articles with too few wikilinks
- Articles covered by WikiProject Wikify from అక్టోబరు 2016
- All articles covered by WikiProject Wikify
- మౌలిక పరిశోధన కలిగివున్నాయని అనుమానమున్న వ్యాసాలు
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- కులాలు