"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
యాదాద్రి భువనగిరి జిల్లా
యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ లోని 33 జిల్లాలలో ఒకటి.[1]
Script error: No such module "Settlement short description".
యాదాద్రి - భువనగిరి జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
ముఖ్య పట్టణం | భువనగిరి |
మండలాలు | 16 |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,091.48 కి.మీ2 (1,193.63 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 7,26,465 |
• సాంద్రత | 230/కి.మీ2 (610/చ. మై.) |
జనగణాంకాలు | |
• అక్షరాస్యత | 68 శాతం |
వాహనాల నమోదు కోడ్ | TS-30[2] |
ఈ జిల్లా 2016 అక్టోబరు 11న, అవతరించింది. ఈ జిల్లాలో 17 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు, ఉన్నాయి.జిల్లా పరిపాలన కేంద్రం భువనగిరి.
యాదాద్రి అనునది ఇంతకు పూర్వం భువనగిరి మరియు యాదగిరి గుట్ట అను రెండు వేరు వేరు మండలాలుగా ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత శ్రీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు మరియు శ్రీ చిన్నజీయర్ స్వామి గారి ఆజ్ఞల మేరకు యాదగిరి గుట్టను యాదాద్రి గా మార్చ బడినది. దీనియొక్క ముఖ్య ఉద్దేశం యాదగిరి గుట్ట అనగా "గిరి" అనేది "గుట్ట" అనేవి రెండు కూడా పర్యాయ పదాలుగా చెప్పాడుతున్నవి కావున రెండు ఒకే అర్దనిస్తునందునా వాటిని సంస్కృత పదమైన "అద్రి" అనగా కొండా అనే అర్ధం తో యాదగిరి గుట్ట ను యాదాద్రి గా మార్చబడినది. తెలంగాణలోని ముఖ్యమైన అధ్యాత్మికక్షేత్రం యాదాద్రి పేరిట జిల్లాకు నామకరణం చేయబడింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి నల్గొండ జిల్లా లోనివే.[3] మూస:Infobox mapframe
Contents
పరిపాలనా విభాగాలు
ఈ జిల్లాలొ భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.
ముఖ్య ప్రదేశాలు
- యాదగిరిగుట్ట
మహర్షి ఋష్యశృంగుని కుమారుడైన యాదగిరి అనే సన్యాసి వలన ఈ కొండకు ఈ పేరు వచ్చింది. యాదర్షి ఇక్కడ ఉన్న ఒక గుహలో ఆంజనేయుడి అనుగ్రహంతో నరసింహుని గురించి తపమాచరించాడు. ఈ కొండ నల్లగొండ లోని భువనగిరి మరియు రాయగిరి మధ్యలో ఉంది. యాదర్షి గాఢతపస్సుకు మెచ్చి నరసింహుడు ఐదు రూపాలలో సాక్షాత్కరించాడు. జ్వాలానరసింహ, యోగానంద నరసింహ, గంఢభేరుండ నరసింహ, ఉగ్ర నరసింహ మరియు లక్ష్మీ నరసింహ అనేవి ఆ ఐదు రూపాలు. ఇలా ప్రత్యక్షమైన నరసింహ రూపాలు ఈ కొండలలో స్వయంభువులుగా వెలసి భక్తుల పూజలు అందుకుకుంటున్నాడు. అందుకనే ఇది పంచ నరసింహ క్షేత్రం అయింది. పురాణ కథనం ప్రకారం యాదర్షికి మొదట జ్వాలా నరసింహుడిగా ప్రత్యక్షమైన జ్వాలా నరసింహరూపాన్ని దర్శించే శక్తి లేని యాదర్షి కోరిక మీద నరసింహుడు తరువాత యోగనరసింహుడిగా దర్శనమిచ్చాడు. యాదర్షి అంతటితో సంతోషపడక లక్ష్మీ సహితంగా దర్శనమివ్వమని కోరడంతో ఓడిలో లక్ష్మీసహితంగా లక్ష్మీనరసింహుడై దర్శనమిచ్చాడు. లక్ష్మీనరసింహుడు ఆళ్వారుల పూజలు అందుకుంటున్నాడు. ఊగ్రనరసింహుడి ఉగ్రతను తగ్గించడానికి గరుత్మంతుడు గండభేరుండ పక్షి రూపంలో స్వామికి ముందు నిలిచి స్వామి ఉగ్రతను తగ్గిస్తుంటాడు. ఈ శిలను దాటి వంగుతూ వెళ్ళి స్వామిని దర్శించాలి. ఈ క్షేత్రానికి పాలకుడు ఆంజనేయుడు. యాదర్షి స్వామిని ఈ ప్రదేశాన్ని తనపేరుతో పిలవాలని కోరాడు. అందుకే ఇది యాదగిరి గుట్ట అయింది. చాలాకాలం నుండి ఇక్కడ లక్ష్మీనరసింహుడు భక్తుల పూజలు అందుకుంటున్నాడు.
దర్శనీయ ప్రాంతాలు
జిల్లాలోని రెవెన్యూ మండలాలు
క్ర.సం. | భువనగిరి రెవెన్యూ డివిజన్ | క్ర.సం. | చౌటప్పల్ రెవెన్యూ డివిజన్ |
---|---|---|---|
1 | అడ్డగూడూర్ మండలం * | 13 | (బి) పోచంపల్లి మండలం |
2 | ఆలేరు మండలం | 14 | చౌటుప్పల్ మండలం |
3 | ఆత్మకూర్ (ఎం) మండలం | 15 | నారాయణపూర్ మండలం |
4 | బీబీనగర్ మండలం | 16 | రామన్నపేట్ మండలం |
5 | భువనగిరి మండలం | 17 | వలిగొండ మండలం |
6 | బొమ్మల రామారాం మండలం | ||
7 | మూటకొండూరు మండలం * | ||
8 | మోతుకూరు మండలం | ||
9 | రాజాపేట మండలం | ||
10 | తుర్కపల్లి మండలం | ||
11 | యాదగిరిగుట్ట మండలం | ||
12 | గుండాల మండలం[4] |
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (2)
మూలాలు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "Telangana New Districts Names 2016 Pdf TS 31 Districts List". Timesalert.com. 11 October 2016. Retrieved 11 October 2016.
- ↑ "New districts". Andhra Jyothy.com. 8 October 2016. Retrieved 8 October 2016.
- ↑ "జనగామ జిల్లా నుంచి యాదాద్రి భువనగిరికి మారిన గుండాల మండలం".