"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

యానాదులు

From tewiki
Jump to navigation Jump to search

యానాదులు(అ.సం.లి.వ.: యానా దులు) అనగా ఒక సంచార గిరిజన తెగకు చెందిన ప్రజలు. యానాది కులం ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితా లో 32వ కులం. నల్లమల అడవుల నుంచి నెల్లూరు స ముద్రతీరం వరకూ/చిత్తూరుజిల్లాలో విస్తరించిన యానాదులు,సామాజిక పరిణామంలోసేకరణకొరకు అడవులలోజీవిస్తూ అటవీఫలసా యా ల ఆధారంగా బ్రతుకుజీవనంచేస్తూ కాలక్రమేణా మా రుతున్న జీవనవైవిధానాన్ని దృష్టిలో ఉంచుకుని అడ వులకు దగ్గరగా గ్రామాలను ఏర్పాటుచేసుకుని జీవ నంసాగిస్తారు,అటవీఫల సాయాలకు అడ్డుపడుతూ వీరి పూర్వీకుల కాలంనుండి సాగుచేసుకుంటున్న అ టవీ భూములను ఫారెస్ట్ వారు తమ ఆదీనంలోనికి తీసుకుని వెళ్లగొట్టడం వలన జీవనాదారం లేక సం చారజాతిగా ఉన్నారు. ఒక యానాదికి భూస్వామి మణియంకు, మధ్య జరిగిన సంఘర్షణను డా॥ కేశ వరెడ్డి ‘‘చివరి గుడిసె’’ నవలలో చిత్రించారు. [ [గిరిజనులు|గిరిజనుల కళల్లో ముఖ్యమైనది చిం దు నాట్యం. యానాదులు, ఎరుకలు, సుగాలీలు పండుగ పర్వదినాలలో చిందులే స్తారు. వివిధ పురాణ పాత్రలు గూడా ధరిస్తారు. యానాదులు ‘రంగము’ అనే దైవచింతనతో వారి పూర్వీకుల లేదా బాధిత పెద్దల ఆత్మలను లేదా వా రుకొలిచే కుల దైవాన్ని ఆవాహనా చేసుకుని నిజా న్ని నిక్కచ్చిగా చెప్పగలరు, ఉదాహరణ: ఏదైనా వ స్తువు పోయిందనో/ఎవరైనా కనిపించకుండా పోయా రనో/ ఇంటిలోభాదలకో/చీడపీడలకో కులదైవం ఎదు ట దీపాన్ని వెలిగించి డప్పుకొడుతూ వాద్యం యి స్తూ నృత్యం చేస్తూ వారి కులదైవాన్ని గొంతెత్తి ఆల పిస్తారు. వారి దేవత వారి శరీరంలో ప్రవేశించి ([ [పూనకం]] వచ్చి) పోయిన వస్తువు జాడ తెలు పుతుంది. చిత్తూరు జిల్లాలోని 66 మండలా లలో యానాదులు ఉన్నారు,సరైనటువంటి జీవనా ధారం లేక తాత్కాలిక నివాసాల్ని ఏర్పరచుకుని బ్ర తుకు జీవనం కొరకు వీరు నివాస స్థలాలను వది లి వేరే యితర ప్రాంతాలకు తరలిపోతూ ఉంటారు . గ్రామాలలో రైతుల పొలాలలో కూ లికి ఎలుకలు పడుతూ కొంతమంది జీవిస్తు న్నారు. తెలుగు భాషకు మూలపురుషులు యానాదులేనని కత్తి పద్మారావు లాంటివారి వాదన. ప్రముఖ జానపద పరిశోధకులు వెన్నెలకంటి రాఘవ య్య యానాదులపై చేసిన పరిశోధనకు గుర్తింపుగా ఆయనను యానాది రాఘవయ్యగా పిలుస్తారు.

శబ్దోత్పత్తి(ఎటిమాలజీ)

తెలుగు భాషలోని చాలా పదాలలాగే యానాదులు అనేది ఒక సంస్కృత పదం నుండి పుట్టిన పదంగా తెలుస్తు న్నది. కానీ దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నా యి. ఈ పదాన్ని రెండు విధాలుగా అర్థం చేసుకో వచ్చు . యానాది అనేది అనాది యొక్క శబ్ద రూపాంతరం కావచ్చు. అనాది అనగా ఆది లేనిది, అంటే మొదలు లేనిదని అర్థం. అంటే అ ప్పట్లోని మిగతా తెగల వారికి వీరి యొక్కమూలం తెలిసి అ లా వ్యవహరించి ఉండవచ్చు. ఒక విధం గా వారు పురాతనమైనవారు అన్న అర్థం వస్తుంది.Cite error: Invalid <ref> tag; invalid names, e.g. too many అదే కాకుండా యానా (నిజానికి య [1]) అనేది సంస్కృతంలోని ఒక మూల పదం కూడా. ఉదాహరణకు ప్రయాణం, విమానయానం. దీని అర్థం గమనానికి సంబంధించింది. దీనిని బట్టి వీరు సంచార జాతికి చెందిన వారు కాబట్టి ఆ పేరు వచ్చి ఉండవచ్చని మరి కొందరి అభిప్రాయం.[2]

యానాదులపై నవలలు,కథలు

  • డా॥ కేశవరెడ్డి ‘‘చివరి గుడిసె’’
  • ఏకుల వెంకటేశ్వర్లు "ఎన్నెల నవ్వు"
  • ఎన్.విజయరామరాజు "యానాదుల దిబ్బ"(భట్టిప్రోలు కథలు)

యానాదులు ... సమగ్ర పరిశోధనా గ్రంథం ....శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య.

  1. Yana, aka: Yāna; 6 Definition(s)[1]
  2. Cite error: Invalid <ref> tag; no text was provided for refs named :0