"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
యువరాజ్ సింగ్
దస్త్రం:Yuvraj Singh appointed as Ulysse Nardin watch brand ambassador.jpeg | ||||
Yuvraj Singh at a promotional event in January 2013. | ||||
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
జననం | Chandigarh, Punjab, భారత దేశము | 12 డిసెంబరు 1981|||
ఇతర పేర్లు | Yuvi | |||
ఎత్తు | 6 అ. 2 in (1.88 మీ.) | |||
బ్యాటింగ్ శైలి | ఎడమ చేతి వాటం | |||
బౌలింగ్ శైలి | Slow left arm orthodox | |||
పాత్ర | All-rounder | |||
సంబంధాలు | Yograj Singh (father) | |||
అంతర్జాతీయ సమాచారం | ||||
జాతీయ జట్టు | India | |||
టెస్టు అరంగ్రేటం(cap 247) | 16 October 2003 v New Zealand | |||
చివరి టెస్టు | 5 December 2012 v England | |||
వన్డే లలో ప్రవేశం(cap 134) | 3 October 2000 v Kenya | |||
చివరి వన్డే | 5 December 2013 v South Africa | |||
టి20ఐ లో ప్రవేశం(cap 15) | 13 September 2007 v Scotland | |||
చివరి టి20ఐ | 10 October 2013 v Australia | |||
దేశవాళీ జట్టు సమాచారం | ||||
సంవత్సరాలు | జట్టు | |||
1996–present | Punjab | |||
2003 | Yorkshire | |||
2008–2010 | Kings XI Punjab | |||
2011–present | Pune Warriors India | |||
కెరీర్ గణాంకాలు | ||||
పోటీ | Test | ODIs | T20I | FC |
మ్యాచ్లు | 40 | 292 | 34 | 106 |
సాధించిన పరుగులు | 1900 | 8329 | 868 | 6829 |
బ్యాటింగ్ సగటు | 33.92 | 36.53 | 33.38 | 44.92 |
100s/50s | 3/11 | 13/51 | 0/7 | 20/32 |
ఉత్తమ స్కోరు | 169 | 139 | 77* | 209 |
బాల్స్ వేసినవి | 931 | 4988 | 316 | 2508 |
వికెట్లు | 9 | 111 | 23 | 28 |
బౌలింగ్ సగటు | 60.77 | 38.18 | 16.22 | 51.78 |
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | 0 | 1 | 0 | 1 |
మ్యాచ్ లో 10 వికెట్లు | 0 | 0 | 0 | 0 |
ఉత్తమ బౌలింగ్ | 2/9 | 5/31 | 3/17 | 5/94 |
క్యాచులు/స్టంపింగులు | 31/- | 92/- | 9/- | 97/- |
Source: Cricinfo, 5 December 2013 |
1981, డిసెంబర్ 12 న చండీగర్ లో జన్మించిన యువరాజ్ సింగ్ భారత దేశపు క్రికెట్ క్రీడాకారుడు. భారత మాజీ బౌలర్, పంజాబీ సినీ నటుడు అయిన యోగ్రాజ్ సింగ్ కుమారుడైన యువరాజ్ సింగ్ 2000 నుంచి వన్డే క్రికెట్ లో, 2003 నుంచి టెస్ట్ క్రికెట్|టెస్ట్ క్రికెట్ లో భారత జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇతను ప్రస్తుతం 2007 ప్రపంచ కప్ క్రికెట్లో ఇంగ్లాండుకు చెందిన స్టూవర్ట్ బ్రాడ్ ఓవర్లో వరుసగా 6 సిక్సర్లు సాధించి అంతర్జాతీయ క్రికెట్లో ఆ ఘనత సాధించిన మొట్టమొదటి బ్యాట్స్మెన్ గా క్రికెట్ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
2007 టి20 ప్రపంచ కప్ లో ప్రధాన బ్యాట్సమన్ గా రాణించాడు. అలాగే , 2011 వన్డే ప్రపంచ కప్ భారత్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు , ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారతీయుల హృదయాల్లో చిరస్థాయి గా నిలిచి పోయాడు.
టి20 పొట్టి క్రికెట్లో తక్కువ బంతుల్లో(12) అర్ధ శతకం ఇప్పటికి ఈ బ్యాట్సమెన్ పేరిట వుంది.
ఇప్పటి వరకు వన్డే ప్రపంచ కప్ క్రికెట్ లో అల్ రౌండర్ అత్యుత్తమ ప్రదర్శన ఈ యువి పేరిట వుంది. (మొత్తం టోర్నమెంట్లో 300లకు పైగా పరుగులు , 15 వికెట్లతో).
అలాగే వన్డే ప్రపంచ కప్ క్రికెట్ లో ఒక టోర్నమెంట్లో సచిన్ తర్వాత అధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను పొందిన క్రికెటర్.
అలాగే వన్డే ప్రపంచ కప్ క్రికెట్ లో అన్ని టోర్నమెంట్లో సచిన్ తర్వాత అధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను పొందిన క్రికెటర్.
ఇప్పటి వరకు వన్డేల్లో 26 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నాడు. అందులో రెండు మ్యాచుల్లో తప్ప అన్ని మ్యాచులు భారత విజయానికి ఉపయోగపడ్డాయి.
అలాగే వరసగా వన్డేల్లో మూడు మ్యాన్ అఫ్ ది సిరీస్ అవార్డులను పొందిన అతి తక్కువ మందిలో యువరాజ్ ఒకడు.
భారత క్రికెట్లో ఫీల్డింగ్ బాగా చేసే వారిలో యువి ఒకరు.
దుర్భేద్యమయిన పిచ్లయినా ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా , సౌత్ ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్ లలో అలవోకగా బ్యాట్టింగ్ చేయగల బ్యాట్సమెన్ లలో ఒకడిగా పేరొందాడు.
1999 లో అండర్ 19 వన్డే ప్రపంచ కప్ క్రికెట్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.
2011 ప్రపంచ కప్ తరువాత యువి కి కాన్సర్ అనే భయంకరమైన వ్యాధి సోకింది.
తరువాత అందులోనుండి బయటపడ్డాక క్రికెట్ లో మళ్ళి పునరాగమనం చేసాడు.
భారత ప్రభుత్వం నుండి అర్జున, పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నాడు.
యువరాజ్ సింగ్ 2019 సంవత్సరం జూన్ 10 తేదీన రిటైర్మెంట్ ప్రకటించాడు.
బయటి లింకులు
మూలాలు
Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).