"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

యోగి వేమన విశ్వవిద్యాలయం

From tewiki
Jump to navigation Jump to search
యోగి వేమన విశ్వవిద్యాలయం
దస్త్రం:Yogi-Vemana.jpg
నినాదంబోధన, పరిశోధన, సేవ
రకంప్రభుత్వ విశ్వవిద్యాలయము
స్థాపితం2006
ఛాన్సలర్ఈ.ఎస్.ఎల్.నరసింహన్
వైస్ ఛాన్సలర్ఆచార్య బి. శ్యామ సుందర్‌
స్థానంకడప
ఆంధ్రప్రదేశ్
, భారతదేశం,
516003
కాంపస్గ్రామీణ
అనుబంధాలుయు.జి.సి
జాలగూడుఅధికారిక వెబ్సైటు

యోగి వేమన విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ లోని కడపలో ఏర్పాటుచేయబడిన నూతన విశ్వవిద్యాలయము. ఇంతకుముందు ఇది శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా గుర్తించబడేది. 2006 మార్చి 9 వ తేదీన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్నాతకోత్తర కేంద్రం స్థాయి నుంచి స్వతంత్ర విశ్వవిద్యాలయంగా ఏర్పడింది. 2012-13 సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయ మొట్టమొదటి స్నాతకోత్సవం జరిగింది. కులపతి హోదాలో ఈ ఉత్సవానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ హాజరయ్యారు. ఈ ఉత్సవాలలోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన పరిశోధకుడు పల్లె రామారావు గారికి డాక్టరేట్ ప్రధానం చేశారు. ఇది కడప నుండి పులివెందుల వెళ్ళే మార్గంలో మిట్టమీదపల్లె పంచాయితీ పరిధిలో సుమారు 450 ఎకరాలలో విస్తరించివుంది.

మరికొంత సమాచారం

రాయలసీమ ప్రజల కోరిక మేరకు ప్రజా కవి యోగి వేమన పేరున యోగి వేమన విశ్వ విద్యాలయమును కడప పట్టణంలో ప్రారంబించారు. ఈ విశ్వవిద్యా లయాం 2006 మార్చి 9వ తేదీన ఏర్పాటైనది. వ్యవస్థాపక వైస్‌ ఛాన్స లర్‌గా ప్రొ|| ఎ. రామచంద్రారెడ్డి అదే ఏడాది నవంబరు 6వ తేదీన బాధ్యతలు స్వీకరించారు.. ఐదు లక్షల చదరపు అడుగుల మేరకు వివిధ రకాల భవన సముదాయాలను నిర్మించారు. మరో 3 లక్షల చదరపు మీటర్ల భవన సముదాయాలు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. 700 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం ఉంది. 112 కాలేజీలు అను బంధంగా ఉండగా 2013 వ సంవత్సరంలో 15 వేల మంది విద్యా ర్థులు పరీక్షలు రాశారు. శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యా లయం కన్నా ఈ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 123 మంది అధ్యాపకులు, 40 మంది అకాడమిక్‌ కన్సల్టెంట్లు ఉన్నారు. ప్రొద్దుటూరులో ఇంజనీరింగ్‌ కాలేజీని కూడా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. 21వ గురుకులాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకుంది. వివిధ వృత్తి విద్యా కోర్సులను రాబోయే సంవత్సరాల్లో ప్రవేశపెట్టాలని యోచి స్తోంది.

విభాగాలు

ఇందులో మొత్తం 17 విభాగాలు ఉన్నాయి. 17 అంశాలలో వివిధ విద్యా తరగతులను నిర్వహిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భాగస్వామ్యంతో ఈ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరుగుతున్నాయి.

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు
  • అర్జల రామచంద్రారెడ్డి - 2006 - 2013 ఫిబ్రవరి 4 వ తేదీ వరకు
  • ఉదయగిరి రాజేంద్ర - 2013 ఫిబ్రవరి 5 నుండి జూలై 14 వరకు (తాత్కాలిక ఉపకులపతి)
  • బేతనభట్ల శ్యామ సుందర్‌ - 2013 జూలై 15 నుండి ఉపకులపతిగా బాధ్యతలు తీసుకున్నారు.

మూలాలు

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూస:ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయాలు

.