రఘుతు సత్యనారాయణ

From tewiki
Jump to navigation Jump to search

రఘుతు సత్యనారాయణ తెలుగు సినిమా నిర్మాత.సత్తెన్నగా చిత్రసీమలో సుపరిచితుడు.ఆయన ‘శివాజీ’, ‘ఒరేయ్‌ తమ్ముడు’ చిత్రాల నిర్మాత.

జీవిత విశేషాలు

తెలుగు సినిమా

శ్రీహరి హీరోగా ‘శివాజీ’ (2000), శ్రీహరి, దాసరి అరుణ్‌ కుమార్‌ హీరోలుగా ‘ఒరేయ్‌ తమ్ముడు’ (2001) సినిమాలను ఆయన నిర్మించారు.తన చిన్న కుమారుడు హరి వరుణ్‌ను ‘లైలామజ్ను’ (2007) సినిమాతో హీరోగా పరిచయం చేశారు. హీరో శ్రీహరికి సన్నిహిత మిత్రుడైన సత్యనారాయణ డా.దాసరి నారాయణరావు, మోహన్‌బాబుకు కూడా ఆప్తుడు.[1]

వ్యక్తిగత జీవితం

ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం వీరంతా అమెరికాలో ఉన్నారు.

మరణం

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సీతాఫల్‌మండికి చెందిన స్నేహితులతో సత్యనారాయణ మూడు రోజుల క్రితం భీమవరం వెళ్ళారు.జనవరి 8 2015 రాత్రి సంబరాలల్లో ఉన్న ఆయన ఉన్నట్లుండి క్రింద పడిపోవటంతో భీమవరం ఆసుపత్రికి తరలించారు. మెదడులో రక్తప్రసరణ ఆగిపోవటంతో వైద్యులు అదేరోజు రాత్రి ఆపరేషన్‌ చేశారు. రఘుతు సత్యనారాయణ శుక్రవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జనవరి 9 2015 న మృతి చెందారు.

మూలాలు

ఇతర లింకులు