"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
రవి వీరెల్లి
రవి వీరెల్లి | |
---|---|
దస్త్రం:Ravi Verelly.jpg రవి వీరెల్లి | |
జననం | 1968, జూన్ 16 కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఆముదాలపల్లి గ్రామం |
నివాస ప్రాంతం | వర్జీనియా |
ఇతర పేర్లు | వీరెల్లి రవిందర్ రెడ్డి |
వృత్తి | సాఫ్ట్ వేర్ ఇంజినీర్ |
ప్రసిద్ధి | తెలుగు కవి, సంపాదకుడు |
భార్య / భర్త | సుచరిత |
పిల్లలు | అభినవ్, అపూర్వ్ |
తండ్రి | కొమురా రెడ్డి |
తల్లి | రాజేశ్వరి |
కవిగా, వాకిలి అంతర్జాల పత్రిక సంపాదకునిగా తెలుగు సాహిత్యలొకానికి పరిచయమయిన రవి వీరెల్లి పూర్తి పేరు వీరెల్లి రవిందర్ రెడ్డి.
జీవితవిశేషాలు
రవి వీరెల్లి కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని ఆముదాలపల్లి గ్రామంలో 1968లో జన్మించాడు. నాగపూర్ యూనివర్సిటీ నుండి 1990లో ఇంజనీరింగ్ పట్టా తీసుకున్నాక ఢిల్లీలో కొన్నాళ్ళు, ఆ తర్వాత హైదరాబాద్ లో కొన్నాళ్ళ పాటు పనిచేసి 1997లో అమెరికా వెళ్ళారు. ప్రస్తుతం వర్జీనియాలో ఐ.టి. మేనేజర్ గా పనిచేస్తున్నారు. 2012లో "దూప", 2017లో "కుందాపన" కవితా సంకలనాలని ప్రచురించారు. 2012 నుండి వాకిలి మాస పత్రిక సంపాదక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అమెరికా తెలుగు సంఘం వారు ప్రచురించే “అమెరికా భారతి” పత్రికకి కూడా సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. 2013 నాట్స్ సావనీర్ కి, 2014 ఆటా సావనీర్ కి సంపాదకత్వం వహించారు.
రచనలు
మూలాలు
Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).
Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).