రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి

From tewiki
Jump to navigation Jump to search

రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి (1860 - 1935) సుప్రసిద్ధ గాయకుడు. అతను పల్లవి పాడటం లో నేర్పరి. అందువల్ల అతనికి పల్లవి వెంకటప్పయ్య అనే వేరొక పేరు ఉండేది.

జీవిత విశేషాలు

అతను గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జన్మించాడు. అతను చిన్నతనంలోనే సంగీతం మీద అభిరుచి కలిగి సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారి వద్ద సంగీతంలో శిక్షణ పొందాడు[1]. తర్వాత పలుప్రాంతాలలో కచేరీలు చేసి గొప్ప సంగీతవేత్తగా పేరుపొందాడు.అతను సంగీత విద్యను శాస్త్రీయ రీతిలో శిష్యులకు అన్నదానంతో పాటుగా బోధించేవారు.[2]

వీరి శిష్యులలో వారణాసి రామసుబ్బయ్య, షేక్ సిలార్ సాహెబ్, పెదమౌలానా, చినమౌలానా పేర్కొనదగినవారు. వీరి కుమారులు రాజనాల వెంకట్రామయ్య కూడా సంగీత విద్వాంసులుగా పేరుపొందారు.

మూలాలు

  1. www.andhrajyothy.com https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-510462. Retrieved 2020-06-22. Missing or empty |title= (help)
  2. gdurgaprasad (2020-01-08). "దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -15 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు 2". సరసభారతి ఉయ్యూరు. Retrieved 2020-06-22.