"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

మహారాజు

From tewiki
(Redirected from రాజులు)
Jump to navigation Jump to search


ఫ్రాన్స్ , నెవెర్రెను పరిపాలించిన లూయిస్ XVI

రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తిని రాజు లేదా మహారాజు (King) అంటారు. రాజ్యాన్ని, రాజ్యానికి సంబంధించిన కోటను, రాజ్యపు ప్రజల్ని రక్షించే బాధ్యత మహారాజు, ఇతర రాజోద్యోగులపై ఉంటుంది.

మహారాజు, మహారాణి ఇద్దరిని రాజ దంపతులు అంటారు. మహారాజు తల్లిని రాజమాత అంటారు. వీరి సంతానంలో పెద్ద కొడుకు మామూలు రాజ సంప్రదాయాలలో తరువాత రాజుగా పదవి నిర్వహించ వలసి ఉంటుంది. ఇతన్ని యువరాజు అంటారు. ఆడపిల్ల అయితే యువరాణి అంటారు. మహారాజు అనంతరం యువరాజుకు పట్టాభిషేకం చేస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన భాగం మకుటం ధరించడము. దక్షిణ భారతదేశంలో చాలా రాజ్యాలు పరిపాలించిన ఆంధ్ర క్షత్రియులను రాజులు అని పిలుస్తారు.

ప్రపంచంలోని రాజులు

  • ఎడ్వర్డ్ రాజు, ఇంగ్లండ్
  • రాజు బీరేంద్ర, నేపాల్

భారతీయ రాజులు

పురాణ కాలమునుండి నేటి వరకూ భారతీయ రాజులలో ప్రముఖులైన వారు అనేకులు కలరు. వీరిలో సూర్య వంశం, చంద్ర వంశం రాజులు ప్రముఖులు.