"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రాజ్యసంక్రమణ సిద్ధాంతం

From tewiki
Jump to navigation Jump to search

రాజ్యసంక్రమణ సిద్ధాంతం (Doctrine of Lapse) 1848 మరియు 1856కు మధ్య ఈస్టిండియా కంపెనీకి గవర్నరు జనరల్ గా పనిచేసిన లార్డ్ డల్హౌసీ రూపొందించి, అమలుపరచిన రాజ్య ఆక్రమణ సిద్ధాంతము. ఈ సిద్ధాంతం ప్రకారం, ఈస్టిండియా కంపెనీ యొక్క ఆధిపత్యంలో క్రింద ఉన్న సామంత రాచారిక సంస్థానాలలో పాలకుడు అసమర్ధుడైనా లేదా పుత్రసంతానము లేకుండా మరణించినా, ఆ రాజ్యాలు అప్రమేయంగా ఈస్టిండియా కంపెనీ రాజ్యంలో కలిసిపోతాయి.[1] ఈ నియమం, తరతరాలుగా పుత్ర సంతానం లేని రాజులు వారసున్ని దత్తత తెచ్చుకోవటమనే సంప్రదాయాన్ని తిరగవేసింది. అంతేకాక, కాబోయే పాలకుడు సమర్ధుడా? కాడా? అన్న విషయాన్ని కూడా బ్రిటీషువారే నిర్ణయించేవారు. ఈ సిద్ధాంతము మరియు దీని అమలు న్యాయబద్ధంకాదని చాలామంది భారతీయులు భావించారు.

చరిత్ర

ఈ సిద్ధాంతం అమలులోకి వచ్చే సమయానికి, బ్రిటీషు ఈస్టిండియా కంపెనీకి భారత ఉపఖండంలో విస్తృతమైన భూభాగాలపై అధికారం చెలాయించేది. రాజ్యసంక్రమణ సిద్ధాంతం నిబంధనలను అనుసరించి కంపెనీ సతారా (1848), జైపూర్ మరియు సంబల్పూర్ (ఒడిశా) (1849), నాగపూర్ మరియు ఝాన్సీ (1854), తంజావూరు మరియు ఆర్కాట్ (1855), ఉదయ్‌పూర్ (ఛత్తీస్‌ఘడ్) మరియు అవధ్ (1856) రాజ్యాలను ఆక్రమించుకున్నది. వీటిలో చాలామటుకు స్థానిక పాలకుడు సరిగా పరిపాలించడం లేదని ఆక్రమించుకొన్నవే. ఈ సిద్ధాంతం పర్యవసానంగా కంపెనీ వార్షిక ఆదాయానికి అదనంగా నలభై లక్షల పౌండ్లు (స్టెర్లింగు) జత అయినవి.[2] ఉదయ్‌పూర్ ఒక్క రాజ్యంలో మాత్రం 1860లో బ్రిటీషువారు తిరిగి స్థానిక పాలకున్ని పునరుద్ధరించారు. [3]

మూలాలు

  1. Keay, John. India: A History. Grove Press Books, distributed by Publishers Group West. United States: 2000 ISBN 0-8021-3797-0, p. 433.
  2. Wolpert, Stanley. A New History of India; 3rd ed., pp. 226-28. Oxford University Press, 1989.
  3. Rajput Provinces of India - Udaipur (Princely State)