"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రాథోడ్ బాపు రావు

From tewiki
Jump to navigation Jump to search
రాథోడ్ బాపు రావు

పదవీ కాలము
2014 - 2018, 2018 డిసెంబర్ 11 - ప్రస్తుతం
నియోజకవర్గము బోథ్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం మార్చి 12, 1962
ఆదిలాబాద్
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి వందన
నివాసము బోథ్
మతం హిందూ మతం

రాథోడ్ బాపు రావు తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, బోథ్ శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యుడు.[1][2]

జననం - విద్యాభ్యాసం

బాపురావు 1962, మార్చి 12న జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. చదివాడు.

ఉద్యోగం

1987 నుంచి 2009 వరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేశాడు.

వివాహం

వందనతో బాపురావు వివాహం జరిగింది.

రాజకీయ విశేషాలు

2009లో రాజకీయ ప్రవేశం చేసిన బాపురావు, 2009 నుండి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర నాయకుడిగా పనిచేశాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాదవ్ అనిల్ కుమార్‌పై 26వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు [3][4] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోయం బాబు రావుపై 6వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5][6]

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-03. Retrieved 2019-05-03.
  2. http://myneta.info/telangana2014/candidate.php?candidate_id=27
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-03. Retrieved 2019-05-03.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-03. Retrieved 2019-05-03.
  5. https://www.timesnownews.com/amp/elections/telangana-election/article/boath-assembly-constituency-election-2018-trs-fields-bapu-rao-rathod-against-congress-bapu-rao-soyam-telangana-assembly-election/321902
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-03. Retrieved 2019-05-03.