"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
రామగుండం నగరపాలక సంస్థ
రామగుండం నగరపాలక సంస్థ | |
---|---|
రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ | |
రకం | |
రకం | రామగుండం నగరపాలక సంస్థ |
నాయకత్వం | |
మేయర్ | జాలి రాజమణి, తెరాస |
డిప్యూటీ మేయర్ | ముప్పిడి సత్యప్రసాద్, తెరాస |
కమిషనర్ | బోనగిరి శ్రీనివాస్ రావు |
సీట్లు | 50 |
ఎన్నికలు | |
చివరి ఎన్నికలు | 2014 |
వెబ్సైటు | |
Ramagudam Municipal Corporation |
రామగుండం నగరపాలక సంస్థ, రామగుండం పట్టణంలోని ప్రజల అవసరాలను తీర్చడం కోసం ఏర్పడిన స్థానిక సంస్థ. ఈ సంస్థ పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని పట్టణంలో ఉంది.హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ తరువాత తెలంగాణా నగర పాలక సంస్థలలో అత్యంత జనాభా కలిగిన నగరాల జాబితాలో 6వ స్థానంలో ఉంది.రామగుండం నగరపాలక సంస్థ ప్రస్తుత మేయర్ జాలి రాజమణి.
Contents
జనాభా
2011 జనాభా లెక్కల ప్రకారం,నగరపాలక సంస్థ జనాభా 229,644. మునిసిపల్ కార్పొరేషన్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన సభ్యులను కలిగి ఉంటుంది, మేయర్ నేతృత్వంలో, నగర పాలన, మౌలిక సదుపాయాలు, పరిపాలనను నిర్వహిస్తుంది. ఈ నగరం "అమృత" కేంద్ర ప్రభుత్వ పథకం క్రింద ఈ నగరం ఎంపిక చేయబడింది.
చరిత్ర
2011 జనాభా లెక్కల ప్రకారం ఈ పట్టణంలో 2,29,644 ల జనాభా ఉంది. ఈ సంస్థలో 50 డివిజన్లు ఉన్నాయి.