"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

దాసరి రామతిలకం

From tewiki
(Redirected from రామతిలకం)
Jump to navigation Jump to search
దస్త్రం:SV Ranga rao in varudhini.jpg
వరూధిని చిత్రంలో ఎస్వీ రంగారావు (ప్రవరాఖ్యుడు) తో పాటు వరూధినిగా నటించిన దాసరి రామతిలకం

దాసరి రామతిలకం (1905-1952) సంగీత, నృత్య కళాకారిణి, రంగస్థల నటి, తొలి తరపు తెలుగు సినిమా నటి. తొలినాటి సినిమాల్లో కూడా నటించి పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ నటి గిరిజ ఈమె కుమార్తె. రామతిలకం చింతామణి చిత్రంలో చింతామణి పాత్రను పోషించారు. తెలుగు తెరపై వేశ్య పాత్ర పోషించిన తొలి కథానాయిక ఈమే.[1]

జీవిత విశేషాలు

ఆమె నివాసస్థలం బెజవాడ. ఆమె తండ్రి ఆంధ్ర దేశంలో మృదంగ వాద్యమునందు ప్రసిద్ధిగాంచినవారిలో నొకరగు పువ్వుల పెంకటరత్నం గారు. స్వజాతీయుడగు పువ్వుల నారాయణగా వద్ద ఈమె సంగీతం నేర్చుకున్నది. సంగీతంలో కచ్చేరిచేయుటకు తగినంత జ్ఞానం సంపాదించింది. కొన్నిచోట్ల కచ్చేరీలు కూడా చేసి బహుమతులు పొంది ప్రశంసింపబడ్డది.

మైలవరం కంపెనీ మేనేజరుగారైన కీ శే కొమ్మూరు పట్టాభిరామయ్యగారు స్థాపించిన లక్ష్మీవిలాస సభ లోను, అనంతరం కపిలవాయి రామనాథశాస్త్రిగారి బాలభారతి నాట్యమండలియందును, చింతామణి, చిత్రాంగి, సత్యభామ, అహల్య, సొనిత్రి మొదలైన వేషాలు వేసింది. 1982 నవంబరులో కలకత్తా ఈస్టు ఇండియా కంపెనీవారిచే తయారుచేయబడిన తెలుగు సావిత్రి ట్రాకీ ఫిల్మునందు సావిత్రిపాత్ర ధరించి అఖండకీర్తి ప్రతిష్టలాంచినది. 1933 వూర్చిలో కలకత్తా మదన్ ఫిలింకింపెనీవారి తెలుగు చితామణి టాకీయందు చింతామణిపాత్ర ధరించినది.

చిత్రమాలిక

సంవత్సరము సినిమా భాష పాత్ర
1933 సావిత్రి తెలుగు సావిత్రి
1933 రామదాసు (ఈస్టిండియా) తెలుగు
1933 రామదాసు (కృష్ణా ఫిలిమ్స్) తెలుగు
1933 చింతామణి తెలుగు చింతామణి
1935 శ్రీ కృష్ణ లీలలు తెలుగు యశోద
1936 ద్రౌపదీ వస్త్రాపహరణం తెలుగు సత్యభామ
1937 మోహినీ రుక్మాంగద తెలుగు
1937 బాల యోగిని తెలుగు
1941 తెనాలి రామకృష్ణ తెలుగు
1942 హానెస్ట్ రోగ్ తెలుగు
1946 వరూధిని తెలుగు వరూధిని

బయటి లింకులు