"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రామవరప్పాడు

From tewiki
Jump to navigation Jump to search
రామవరప్పాడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం విజయవాడ గ్రామీణ
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి పీకా లక్ష్మీకుమారి
జనాభా (2011)
 - మొత్తం {{#property:P1082}}
 - పురుషుల సంఖ్య 11,092
 - స్త్రీల సంఖ్య 11,130
 - గృహాల సంఖ్య 6,130
పిన్ కోడ్ 521 108
ఎస్.టి.డి కోడ్ 0866

రామవరప్పాడు, కృష్ణా జిల్లా, విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 108., ఎస్.టి.డి.కోడ్ = 0866.

గ్రామం అన్న పేరే గాని ఇది ప్రస్తుతం విజయవాడ నగరంలో కలిసిపోయింది.

దస్త్రం:APvillage Ramavarappadu 1.JPG
రామవరప్పాడు మెయిన్ రోడ్‌పై దృశ్యం
దస్త్రం:APvillage Ramavarappadu 2.JPG
రామవరప్పాడు పంచాయితీ ఆఫీసు
దస్త్రం:APvillage Ramavarappadu 3.JPG
రామవరప్పాడు జైకిసాన్ ప్రజా మార్కెట్
దస్త్రం:APvillage Ramavarappadu 4.JPG
రామవరప్పాడు మెయిన్ రోడ్‌పై ఆలయం

గ్రామ చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా ఉంది. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం అనేవి ఉన్నాయి.

విజయవాడ రూరల్ మండలం

విజయవాడ రూరల్ మండలంలోని ఎనికెపాడు, కుందావారి ఖండ్రిక, కొత్తూరు, గూడవల్లి, గొల్లపూడి, జక్కంపూడి, తాడేపల్లి, దోనె ఆత్కూరు, నిడమానూరు, నున్న, పాతపాడు, పైదూరుపాడు, ప్రసాదంపాడు, ఫిర్యాది నైనవరం, బోడపాడు, రామవరప్పాడు, రాయనపాడు, వేమవరం, షహబాదు, సూరాయ పాలెం గ్రామాలు ఉన్నాయి.

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 22,222 - పురుషుల సంఖ్య 11,092 - స్త్రీల సంఖ్య 11,130 - గృహాల సంఖ్య 6,130

గ్రామ భౌగోళికం

[2] సముద్ర మట్టంనుండి 21 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

నాగార్జున నగర్ 1 కి.మీ, శ్రీ రామచంద్రనగర్ 1 కి.మీ, ప్రసాఅదంపాదు 1 కి.మీ గుణదల 1 కి.మీ, శ్రీనివాస నగర్ 1 కి.మీ

సమీప మండలాలు

విజయవాడ, పెనమలూరు, తాడేపల్లి, గన్నవరం

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

రైలు వసతి

విమానాశ్రయం

రామవరప్పాడు విజయవాడ నగరానికి 5 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇక్కడికి దగ్గర్లో గన్నవరం విమానాశ్రయం ఉంది.

బస్సు

ఈ గ్రామానికి సిటి బస్సుల సౌకర్యం ఉంది.

గ్రామ పంచాయతీ

ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీమతి పీకా లక్ష్మీకుమారి సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ కొల్లా ఆనందకుమార్ ఎం.బి.య్యే. ఎన్నికైనారు. [1]

జనాభా (2011) - మొత్తం 22,222 - పురుషుల సంఖ్య 11,092 - స్త్రీల సంఖ్య 11,130 - గృహాల సంఖ్య 6,130

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ వెంకమ్మ పేరంటాళ్ళు ఆలయం

  1. ఇక్కడ దసరాకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించెదరు. పలు సాంస్కృతిక కార్యక్రమ్మాలు గూడా నిర్వహించెదరు.
  2. కార్తీకమాసం సందర్భంగా ఇక్కడి పేరంటాలమ్మ తల్లి ఆలయంలో కొలువుదీరిన శివాలయం వద్ద కోటివొత్తుల దీపోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొంటారు. ఓంకారం, దేవతామూర్తుల రూపాలలో దీపాలను ఏర్పాటు చేసి వెలిగిస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి మహోత్సవాలు, ఘడియలతో పనిలేకుండా, జనవరిలో 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ ఉత్సవాలు జరుపుతారు. పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించెదరు. [2]&[3]

శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం

ఈ ఆలయం స్థానిక వెంకమ్మ పేరంటాళ్ళు ఆలయంలో ఉపాలయంగా ఉంది. 2016,ఏప్రిల్-1వతెదీనుండి, ఈ ఆలయ పునర్నిర్మాణం చేపట్టెదరు. [5]

శ్రీ అంకమ్మ పేరంటాలమ్మ తల్లి అలయం

గ్రామ విశేషాలు

చాగంటిపాడు ట్రస్ట్:- ఈ ట్రస్ట్ ద్వారా గత కొంత కాలంగా పేద, బడుగు, బలహీనవర్గాలవారికి సేవలందించుచున్నారు. ఈ ట్రస్ట్ కార్యాలయాన్ని, ఈ గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో, 2015,అక్టోబరు-14వ తేదీనాడు ప్రారంభించారు. [4]

బయటి లింకులు

[1] ఈనాడు విజయవాడ; 2013,ఆగస్టు-3; 5వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2013,నవంబరు-27; 4వపేజీ. [3] ఈనాడు విజయవాడ; 2014,జనవరి-14; 4వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-15; 5వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2016,ఏప్రిల్-1; 5వపేజీ.

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Vijayawada-Rural/Ramavarappadu". Retrieved 18 June 2016. External link in |title= (help)