"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
రాష్ట్ర విద్యా సాంకేతికాల సంస్థ
Jump to navigation
Jump to search
రాష్ట్ర విద్యా సాంకేతికాల సంస్థ (State Institute for Education Technology, (SIET) ) 1985లో ఉపగ్రహాధారిత దృశ్య శ్రవణ కార్యక్రామాల తయారీకొరకు ఏర్పడింది. ఇలాంటివి కేంద్రంలో ఒకటి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒకటి చొప్పున ఏర్పడినవి. కేంద్ర ప్రభుత్వం పూర్తి పెట్టుబడితో ఈ సంస్థ ఏర్పడింది. 5 నుండి 14సంవత్సరాల వయస్సుగల బాలబాలికలకు తెలుగులో కార్యక్రమాలను రూపొందించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. పాఠశాలవిద్యాశాఖ ద్వారా, పనితీరు మెరుగుపరచడం కోసం స్వతంత్ర ప్రతిపత్తిగల సొసైటీగా 1990 లో మార్చబడింది. కేంద్రప్రభుత్వం కార్యక్రమాల కొరకు ఖర్చులు భరిస్తుంటే ఉద్యోగుల జీత భత్యాలను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది [1]
లక్ష్యాలు
- విద్యా విధానాలు, కార్యక్రమాలు నియత, అనియత పద్ధతులలో అమలుపరచుటకు పాఠశాల విద్యా శాఖకు సహాయ పడుట
- పై లక్ష్యం కొరకు సరిపడే కార్యాలను చేయుట
మూలాలు
- ↑ "రాష్ట్ర విద్యా సాంకేతికాల సంస్థ జాలస్థలి". Archived from the original on 2013-10-29. Retrieved 2013-12-26.