"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రికార్డింగ్ డాన్స్

From tewiki
Jump to navigation Jump to search

ఆంధ్రప్రజల వినోదాలలో ప్రాచుర్యం పొందిన నాటకాలు, బుర్రకథలు మాదిరిగానే విశేష ప్రాచుర్యం పొందిన మరొక వినోద కార్యక్రమం రికార్డింగ్ డాన్స్ (Recording Dance). దీని నిర్వహణ ఒక బృందంగా జరుగుతుంది. ఈ కళ దక్షిణ భారతదేశమంతటా కనిపించినా, ఆంధ్రప్రదేశ్లో మరింతగా ప్రసిద్ధి చెందింది. దీన్ని ఉత్తరభారతదేశంలోనూ, పాకిస్తాన్లోనూ విశేషంగా ప్రదర్శించబడే ముజ్రాతో పోల్చవచ్చు.

పుట్టు పూర్వోత్తరాలు

రికార్డింగ్ డాన్స్ ప్రదర్శనలు ఆంధ్రదేశమంతటా జరిగినా, ఈ బృందాలు, కళాకారులు ఎక్కువగా ప్రోత్సాహము కోస్తా ప్రాంతములో ఉంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో అత్యధికంగా రికార్డింగ్ డాన్స్ ట్రూపులు ఉన్నాయి. అంధ్రదేశంలోని గ్రామాలలో పండుగలకు, జాతరల సందర్భంలో ఊళ్లో ప్రజలందరూ చందాలు వసూలు చేసి, రికార్డింగు డాన్సు ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. అయితే రానురాను ఇందులో హాస్యం, వినోదం స్థానే చాలామటుకు రికార్డింగు డాన్సు ప్రదర్శనలలో శృతిమించిన శృంగారరసం, అశ్లీలం చోటుచేసుకుంటుండటంతో ఈ కళ ప్రధానస్రవంతి ప్రేక్షకుల ఆదరణతో పాటు గౌరవం కోల్పోయింది. ఇలా పరిణమించటానికి ఆధునిక మాధ్యమాలైన టీవీలు, వాటితో పాటు వీసీయార్లు, డీవీడీలు మొదలైన మాస్ మీడియా సాధనాలు ప్రాచుర్యం పొంది, కుటుంబవృత్తిగా సాగుతున్న రికార్డింగు డాన్సు బృందాలలోని కుటుంబాలపై ఆర్థిక వత్తిల్లు అధికం కావటం కూడా దోహదం చేసిందని చెప్పుకోవచ్చు.

కథాకమామిషు

రికార్డింగ్ డాన్స్ ప్రధానంగా సినిమాలలోని గీతాల అనుకరణ. సినిమాలలో నటించే నటీనటుల హావభావాలను, నృత్యాలను అనుసరిస్తూ ఆ నటీ నటుల పోలికలలో ఉండే వారిని ఈ కళ కోసం ఎన్నుకొనడం జరుగుతుంది. వారివారి అనుకరణలను, పోలికలను బట్టి ఈ కళాకారుణిలు, డిస్కో రమ్యకృష్ణ, డిస్కో విజయశాంతి, డిస్కో రాధ మొదలైన పేర్లతో తెరపై ప్రసిద్ధి చెందుతుంటారు.

ప్రాచుర్యం పొందిన ట్రూపులు

దంపుదు లక్ష్మి వినుకొ

విశేషాలు

ప్రముఖ దర్శకుడు వంశీ ఈ కళ ఆధారంగా శ్రీ కనక మహలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ అనే చలన చిత్రాన్ని తెరకెక్కించి, వారి యొక్క సాధక బాధకాలను కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించారు.