"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రెండొ ఎల్జిబెత్ పట్టాభిషేకం

From tewiki
Jump to navigation Jump to search
ఈ వ్యాసం అసంపూర్తిగా ఉన్నది. వ్యాసాన్ని పూర్తి చేసి ఈ మూస తొలగించండి.

1953 సంవత్సరం జూన్ 2 వ తారీఖున గ్రేట్ బ్రిటన్ రాణిగా రాణి ఎల్జిబెత్ పట్టాభిషిక్తురాలు అయ్యింది. రాణి ఎల్జిబెత్ రాణీగా ప్రమాణిస్వీకారం వెస్ట్ మినిస్టర్ అబ్బేలో బ్రిటన్ ప్రధాన మంత్రి, కామన్ వెల్త్ రాజ్యాల ముఖ్య ప్రతినిధులు, 8000 మంది అతిధులు మధ్య మహాఆడంబరంగా జరిగింది. రాణి తాను బ్రిటన్ రాజ్యానికి, కామన్ వెల్త్ రాజ్యాల అభ్యున్నతికి పాటు పడతానని ప్రమాణం చేసింది. రాజ్యాధికారానికి చిహ్నములైన రాజ మండలం, కృపా దండం, నీలం కెంపు పొదగబడిన రాజా ముద్రికాచిహ్నమైన ఉంగరం, రాజదండం తీసుకొన్నాక, కాంటర్ బరి చెందిన ఆర్చి బిషప్ జెఫేరీ ఫిషర్ సెయింట్ ఎడ్వర్డ్ కీరిటాన్ని ఎల్జిబెత్ శిరస్సు పై ఉంచడంతో రాణి పట్టాభిషేక ప్రక్రీయ పూర్తి అయ్యింది. ఆ రోజు ఎల్జిబెత్ రాణి లండన్ వీధులలో ఊరేగింపుగా వెళ్ళినప్పుడు ప్రజలు "దేవుడా రాణిని రక్షించు" (God save the queen) అని నినాదాలు చేస్తూ అరిచారు. ఆరోజు మాడు మిలియన్ జనాలు ఆ మహారాణి లండన్ పురవీధులలో బంగారపు రాజవాహనం ( Golden state coach) మీద బకింగ్ హామ్ ప్యాలస్కు వెళ్ళుతూ ఉంటే అమెను చూడ కలిగారు. రాణి ఆరోజు రాత్రి బి.బి.సి.లో ప్రసంగిస్తూ తన జీవితాతం తన హృదయాన్ని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టు కోవడానికి కృషి చేస్తాను అని చెప్పింది. ఈ పట్టాభిషేక తతంగాన్ని బి.బి.సి. ప్రత్యక్షప్రసారం చేస్తే వేలాది మంది టెలివిజన్ సెట్ల మీద చూడ గల్గారు. ఇది బి.బి.సి అప్పటి కాలంలో బయటి దేశాలకు కూడా ప్రత్యక్ష ప్రసారం చేసిన అతి పెద్ద కార్యక్రమం. ఈ రోజు ఇంగ్లాడు పురవీధులలో పెద్ద పెద్ద పార్టీలు జరుపుకొన్నారు. ఆరోజు రాత్రి వాతావరణ్ పరిస్థితులు అనుకులంగా లేక పోయినా రాయల్ ఎయిర్ పోర్స్ ( ఆర్.ఏ.యఫ్) ఆకాశవీధుల్లో తిరిగి రాణీగారి కోసం విహారం చేశాయి. పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చారు.విక్టోరియా ఎన్ బ్యాంక్మెంట్ (లండన్ లో థేమ్స్ నది ఒడ్డున) బాణాసంచా కాల్చగా అది అకాశ వీధులను చేరింది. ఎల్జిబెత్ II తండ్రి అయిన నాలుగో జార్జి (King George IV) 16 సంవత్సరాలు రాజ్యం చేసి 1952 పిబ్రవరి 6 వ తారీఖు పరమపదించగా 25 ఏండ్ల ప్రాయంలో ఎల్జిబెత్ II సింహాసనం ఎక్కింది. అందరికి సందేహం రావచ్చు ఎల్జిబెత్ II భర్త బ్రతికి లేడా ఆమె సింహాసనం ఎక్కింది అని, కాని ఆమె భర్తది బ్రిటీషు రాజరికపు రక్తం కాదు, అందుకని ఆయన రాజు లేదా చక్రవర్తి కాలేక పోయాడు.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు