"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

రేచర్ల పద్మనాయకులు

From tewiki
Jump to navigation Jump to search

రుద్రమదేవి కూతురు కొడుకు ప్ర‌తాప‌రుద్రుడు. ఇతనిని వారసునిగా చేసుకోవటానికి రుద్ర‌మదేవి దత్తత తీసుకొంది. క్రీ. శ. 1289లో కాయస్థ సేనాని అంబదేవుని తిరుగుబాటును అణిచి వేసే ప్రయత్నంలో రుద్రమదేవి మరణించింది. త‌ద‌నంత‌రం ప్రతాపరుద్రుడు సింహాసనం అధిష్ఠించాడు. అంబదేవునితో పాటు.. నెల్లూరులో మనుమగండుని, కర్ణాటక‌ రాజులను జయించిన పోరాట యోధుడు ప్ర‌తాప‌రుద్రుడు. క్రీ.శ. 1303,1309, 1318, 1320 లో ఢిల్లీ సుల్తాను అలా ఉద్దీన్ ఖిల్జీ వ‌రుస‌గా కాక‌తీయ సామ్రాజ్యంపై దాడులు చేసి విఫలమయ్యాడు. చివ‌ర‌కు అప్ప‌టివ‌ర‌కు కాక‌తీయ సామ్రాజ్యంలో చ‌క్రం తిప్పిన కొంత మంది స‌హాయ నిరాక‌ర‌ణ‌తో క్రీ. శ. 1323 లో జరిగిన‌ యుద్ధములో ప్రతాపరుద్రునికి అపజయము ఎదురైంది. ఎంతో ఘ‌న చ‌రిత్ర క‌లిగిన కాక‌తీయ సామ్రాజ్యం అంత‌మైంది.