రైతు

From tewiki
Jump to navigation Jump to search
Farmers near Melghat.jpg


వ్యవసాయము చేసే వారిని రైతులు అంటారు. వీరు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తారు. వీరు దుక్కి దున్ని, విత్తనాలు జల్లి, పంటను సాగు చేస్తారు.

జీవన విధానం

రైతు భూమిని  నమ్ముకుని మాత్రమే జీవనం సాగిస్తాడు. కేవలం డబ్బు సంపాదనకే కాకుండా రైతు పంటలను తన జీవన విధానంలో ఒక భాగంగా భావిస్తాడు. తాను సేద్యం చేయడానికన్నా ఎక్కువ భూమి కలిగి ఉన్న రైతు వ్యాసాయ కూలీల ద్వారా సాగు చేయిస్తాడు. పంటలను కాలాలవారీగా ఖరిప్, రబీ, జైద్  విభజించి రైతు  పంటలు పండిస్తాడు. వర్షాభావ పరిస్థితులలో రైతు నష్ట పోయినా కూడా పంటలు పండించడం మాని వేరే వృత్తిలో కొనసాగకుండా మళ్ళీ సమయం అనుకూలంగా మారినప్పుడు పంటలు పండించడం మొదలు పెడతాడు.

రైతులలో రకాలు

సాధారణంగా రైతులు తమ స్వంత భూమిలోనే పంటలు పండిస్తారు. కానీ కొంతమందికి స్వంత భూమి ఉండదు. ఈ విధంగా స్వంత భూమి లేని రైతులు ఇతర రైతుల భూమిని అద్దెకు తీసుకుని వ్యవసాయం చేస్తారు. ఇటువంటి వారిని కౌలు రైతులు అని అంటారు.

సేంద్రియ రైతులు

ఈ రైతులు పంటలు పండించడంలో ఎటువంటి పురుగుమందులు గాని కలుపు సంహారక మందులు  లేదా రసాయన ఎరువులు గాని ఉపయోగించరు.

ధాన్యం మరియు మేత పంట రైతులు

గోధుమ, బార్లీ, కనోలా, వోట్స్, అవిసెలు, బఠానీలు వంటి  ప్రత్యేక పంటలను లేదా మేత పంటలను పండిస్తారు. అలాగే మొక్కజొన్న పంటలు, వరి పంటలు, మరియు ఇతర పంటలు రైతులు పండిస్తారు. కాబట్టే మనదేశంలో రైతులు రెండో స్థానంలో ఉన్నారు.

పాడి రైతులు

వీరు పాలు మరియు పాల ఉత్పత్తుల కోసం ఆవులను పెంచే వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహిస్తారు.

ఆర్థిక వెసులుబాటు

తాము పండించిన పంటను రైతులు పట్టణాలలోని మార్కెట్లకు తరలిస్తారు. అక్కడ వారి పంటలను మధ్యవర్తులకు అమ్మి కొంత ఆర్థిక లబ్దిని పొందుతారు. ఒక్కొక్కసారి రైతులు పండించిన పంటకు సరైన ధర రక .నష్టపోతారు కూడా.

ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న రైతులు తమ స్వంత డబ్బుతో పంటలు పండిస్తారు. ఆర్థికంగా స్థోమత లేని రైతులు బ్యాంకుల ద్వారా, ఇతర వడ్డీ వ్యాపారస్తుల ద్వారా రుణ సహాయం పొంది పంటలు పండిస్తారు.

ప్రభుత్వము రైతులు పంటలు పండించడానికి వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది.

మూలాలు

https://en.wikipedia.org/wiki/Farmer

https://www.careerexplorer.com/careers/farmer/