రోడ్ రాష్

From tewiki
Jump to navigation Jump to search

మూస:Infobox VG

రోడ్ రాష్ అనేది ఎలెక్ట్రానిక్ ఆర్ట్స్ వారి మోటార్ సైకిల్ రేసింగ్ వీడియో ఆట సిరీస్. ఈ ఆట ఆడేవారు చట్టవిరుద్ధమైన హింసాత్మక వీధి పందాల్లో పాల్గొంటారు. ఈ ఆటని మొట్టమొదట సేగా మెగా డ్రైవ్/జేనేసిస్ని ఉద్దేశించి విడుదల చేయబడింది. అయితే అనేక ఇతర సిస్టంలకు పోర్ట్ చేయబడింది. 1991 నుండి 1999 లోగా ఆరు వివిధ ఆటలు విడుదల చేయబడ్డాయి. గేమ్ బాయ్ అడ్వాన్స్కు 2004 లైసెన్స్ పోర్ట్ విడుదల చేయబడింది. తరువాత రోడ్ రాష్ మరియు దాని యొక్క రెండు తరువాయి భాగాలు PSP కొరకు EA రీప్లే సేకరణలో ఉన్నాయి.

మోటర్ సైక్లింగ్ చేసేటప్పుడు క్రింద పడితే అత్యధిక వేగంతో చర్మం నేలతో తాకుతుంది. మోటారు బైకు మీద నుండి పడినందువలన వచ్చే ఒరిపిడి కారణంగా ఏర్పడే తీవ్రమైన కాలిన గాయాలే నుండి పుట్టిన యాస పదమే ఈ ఆట పేరుగా పెట్టబడింది.

అవలోకనం

హాంగ్-ఆన్ మాదిరిగా మూడో-వ్యక్తి యొక్క దృష్టిలో చూపబడుతున్న ఈ ఆటలో, ఆటగాళ్ళు చట్టవిరుద్ధమైన వీధి పందాల్లో పోటిబడి అన్ని పందాల్లో మొదటి మూడు స్థానాల్లోపు రావాలి (మొట్ట మొదటి అసలు ఆటలో మొదటి నాలుగులో రావాలి). అప్పుడే తరువాత స్థాయికి వెళ్లగలరు. స్థాయిలు పెరిగే కొద్ది పత్యర్ధులు ఇంకా వేగంగా నడుపుతారు, ఇంకా గట్టిగా పోరాడతారు మరియు మార్గం పొడవు పెరిగి ఇంకా ప్రమాదకరంగా మారుతుంది. ప్రతి పందెంలో లభించే స్థానం బట్టి డబ్బు లభిస్తుంది. స్థాయి పెరిగే కొద్ది డబ్బు గణనీయంగా పెరుగుతుంది. ఈ డబ్బుతో ఆట ఆడేవాళ్లు పోటీని తట్టుకోవడానికి ఇంకా వేగవంతమైన బైక్ లని కొనుక్కోవచ్చు. ఆడేవాళ్ళు మోటర్ సైకిల్ చెడిపోయినప్పుడు, బాగు చేసుకోవడానికి డబ్బులు చెల్లించలేక పోతే లేదా అరెస్ట్ అయితే ఫైన్ కట్టలేక పోతే ఆట ముగుస్తుంది.

== ఆడే విధానం==

దస్త్రం:MD Road Rash.png
సేగా మెగా డ్రైవ్/జేనేసిస్ కొరకు రోడ్ రాష్ యొక్క స్క్రీన్ షాట్

రోడ్ రాష్ సజావుగా పైకి వెళ్ళగలిగే సామర్ధ్యం కలిగి ఉండేది. ఆ రోజుల్లో ఈ అంశం కన్సోల్ లలో ఉండేది కాదు. అనేక సాంప్రదాయకమైన పాత నాటి పందెం ఆటలలో, ఆడేవాళ్ల వాహనం ఒకే సమాంతరమైన సమతలంలోనే ఉండి, కుడివైపు కాని ఎడమవైపు కాని తిరగడానికే సాధ్యమయ్యేది (పోల్ పోసిషన్ (వీడియో ఆట) చూడండి). రోడ్ రాష్ ఆడేవాళ్లు గ్రేడ్ మార్పులని ఎదురు కోవాలి. కొండ ఎక్కడం మరియు దిగటం, ఎక్కేటప్పుడు తిరగడం వంటి చర్యలకు, ఈనాటి ఆటలతో పోలిస్తే చాల ప్రారంభస్తాయిలో ఉన్నప్పటికీ, భౌతిక శాస్త్రం దానికి సహాయపడింది. దీని వల్ల మోటర్ సైకిల్ ని ఎక్కువ దూరాలు ఎగిరించగలిలే సామర్ధ్యం లభించింది. అయితే తరచు హాస్యాస్పదమైన క్రాష్ అనిమేషన్ లు ఏర్పడతాయి. రోడ్ రాష్, వీధి గుర్తులు, చెట్లు, స్తంభాలు మరియ పశువులు వంటి వానితో ప్రతిస్పందించవలసిన అవసరమున్న పందెం వాతావరణాన్ని ప్రవేశపెట్టింది.[1] యాక్టివ్ ట్రాఫిక్ అంశాన్ని కలిగి ఉండి మొదట్లో వచ్చిన ఆటల్లో ఇది ఒకటి. దీని వల్ల ఎక్కువ ఆకర్షణీయమైన మరియు సహజమైన వాతావరణాన్ని ఏర్పరిచింది. ఆట ఆడేవాళ్లు ఇతర బైకర్ లతో పందెంలో పోటి చేసేటప్పుడు, నెమ్మదిగా నడిచే పెద్ద వాగన్ వంటి వాహనాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. అత్యధిక వేగం, గొప్ప వాతావరణం, అధ్బుతమైన ప్రమాదాలు వంటి అంశాలతో పాటు ఈ ఆటలో ఉన్న ఘర్షణ అంశం ఈ ఆటని ఇతర పందెం ఆటలనుండి వేరు చేసి చూపించింది. రక రకాల చేతి ఆయుధాలతో ఆడేవాళ్లు ఇతర బైకర్ లతో పోట్లాడోచ్చు. ముందుగా తన చేతులు కాళ్లని మాత్రమే వాడాలి. అయితే ఒక దెబ్బ సరిగ్గా కొట్టగలిగితే, ఇంకా రైడర్ నుండి ఆయుధాన్ని లాగుకోనవచ్చును. కర్రలు, గడ్డపారలు, నంచాకు మరియు ఆవులను తోలే అంకుశాలు వంటి ఆయుధాలు ఈ ఆటల్లో ఉంటాయి. రైడర్ లు ఒక్కరినొకరు కొట్టుకొని, బైక్ నుండి పడేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు బైక్ తరచు అత్యధిక వేగంతో ట్రాఫిక్, పాదచారులు, వీధి పక్కన ఉన్న అడ్డంకుల మధ్య వెళ్లవలసి ఉంటుంది. విజేత స్థానం సంపాదిస్తాడు, ఓడినవాళ్లు సమయం కోల్పోవడంతోపాటు వాళ్ల బైక్ లు చెడిపోతాయి.

మోటర్ సైకిల్ లో వస్తున్న పోలీస్ అధికారులకు రెండు విరుద్ధమైన బాధ్యతలు ఉంటాయి. వాళ్లు మరొక ప్రత్యర్థి లాగ ఆట ఆడేవాళ్లతో పోటి పడుతారు. మరియు పోలీసులాగ ఆట విధులని అమలు చేస్తారు. పందెంలో పాల్గొనే వాళ్ల వెనకే వస్తూ, చాల వెనకబడుతున్న ఆటగాళ్లని మరియు పందెంలో ఉంటూ పందెంలో పాల్గొనకుండా ఇతర ప్రదేశాలలో తిరిగే వాళ్లను నియంత్రిస్తారు. పోలీసు అధికారితో పోట్లాడి ఓడిపోతే ఏర్పడే నష్టము వేరొక ఆటగాడుతో ఓడిపోతే ఏర్పడే నష్టానికంటే ఎక్కువగా ఉంటుంది: అధికారితో పోట్లాడి ఓడిపోతే లేదా మోటర్ సైకిల్ నుండి బైట ఉన్నప్పుడు పోలిస్ అధికారి పట్టుకుంటే, ఆటగాడు "బస్ట్" అయి పందెం ముగిస్తుంది.

మొదట్లో వచ్చిన ఆటల్లో, ప్రతి పందెం ఒకే వీధిలో జరుగుతూ ఉండేది. ఆడేవాళ్లు స్థాయి పెరిగినప్పుడు, ముగింపు రేఖ అదే వీధిలోనే మరింత దూరంగా జరుగుతూ ఉండేది. తరువాత ఆటల్లో, ఒకదానికొకటి ముడి పడి ఉన్న ఒక వీధుల నెట్వర్క్ ఉంటుంది.

== ధ్వని==

మొట్ట మొదటి మెగా డ్రైవ్/జేనేసిస్ ఆటలలో రాబ్ హబ్బర్డ్ సౌండ్ ట్రాక్ ఉండేది.[2] పెద్ద సంగీత కళాకారుల యొక్క లైసెన్స్డ్ సంగీతాన్ని కలిగి ఉన్న మొట్ట మొదటి వీడియో ఆటల్లో తరువాత రోడ్ రాష్ ఆటలు ఉన్నాయి.[3]

విడుదలలు

రోడ్ రాష్

రోడ్ రాష్ 16-బిట్ సేగా మెగా డ్రైవ్/జేనేసిస్ లో రంగప్రవేశం చేసింది. అన్ని పందాలు కాలిఫోర్నియా పరిసరాలలో, క్రమంగా నిడివి పెరిగే రెండు బాటలు ఉన్న వీధులలో జరుగుతాయి. ఈ ఆటలో ఇద్దరు ఆడే విధం ఉండేది. అయితే ఇద్దరు ఒకే సమయములో ఆడలేరు. ఒకరి తరువాత ఒకరు వారి ఆటని వరుసలో ఆడాలి.

ట్రాక్ ల గురించి ముఖ్యంగా చెప్పాలి. చాలా ట్రాక్ లు అంచుల వారిగా పైకి వెళ్లినప్పుడు, కాలిఫోర్నియా రాష్ట్ర రహదారిని సరిగ్గా చూపిస్తున్నాయి. ప్రారంభం నుండి స్క్రీన్ లో కుడి వైపు నొక్కడం వల్ల స్థాయిలను ఎన్నుకోవచ్చు.

 • సియరా నెవాడ (CA 89)
 • పసిఫిక్ కోస్ట్ (CA 1)
 • రెడ్ వుడ్ ఫారస్ట్ (రహదారి షీల్డ్ లు ఉండవు)
 • పామ్ డెసర్ట్ (CA 74)
 • గ్రాస్ వాలీ (CA 49)

మొత్తం ఎనిమిది బైక్ ల నుండి ఒకటి ఎన్నుకోవచ్చు. పిడికిలి, కర్రలు అనే రెండు ఆయుధాలు ఉంటాయి. ఈ ఆటని తరువాత గేమ్ గియర్, సేగా మాస్టర్ సిస్టం లలో పోర్ట్ చేయబడింది. ఇతర కన్సోల్ లలో పోర్ట్ చేయబడిన ఏకైక రోడ్ రాష్ ఆట, ఈ ప్రారంభ ఆట మాత్రమే.

రోడ్ రాష్ II


మొదటి ఆట యొక్క తరువాయి భాగమైన రోడ్ రాష్ II , మరుసటి సంవత్సరం అనగా 1922 లో విడుదల చేయబడింది. ఇది కూడా సేగా జేనేసిస్ లోనే విడుదల చేయబడింది. మొదటి రోడ్ రాష్ ఆటలోని అదే ఇంజన్ మరియు స్ప్రైట్ లు రోడ్ రాష్ II లో కూడా చాల వరకు వాడబడ్డాయి. U.S. రాష్ట్రాలైన అలాస్కా, హవాయ్, టేనేసి, అరిజోనా మరియు వెర్మాంట్ లలో పందాలు జరుగుతాయి.

మెను స్క్రీన్ లో చేసిన మార్పే రెండు ఆటలకు ముఖ్యమైన తేడా. రోడ్ రాష్ IIలో మెను స్క్రీన్ లను వాడటం గణనీయంగా సుళువయింది. మొదటి ఆటలోని పాస్ వర్డ్ లో సగానికంటే తక్కువ సైజ్ లో పాస్ వర్డ్ తరువాతి ఆటలో సాధ్యమయింది. ఇవే కాక ఎన్నో ఆటా విధానాలను పరిచయం చేశారు. మొదటి రోడ్ రాష్ రెండు విధానాలతో ఇద్దరు నిజమైన ఆటగాళ్ళతో ఆడే ఆట. దానిని "స్ప్లిట్ స్క్రీన్"గా పిలిచి, 14 గవ మరియు 15 వ ఆటగాళ్లకు బదులుగా మనుషులే అడునట్లు "మానో ఏ మానో" అనబడు ఒక ద్వివిధ పద్ధతిలో ఆడే ఆటను రూపొందించారు. ఇందులో ఆ ఇద్దరు మానవ ఆటగాళ్ళు పందెం మొదలుపెట్టేముందు బైకుగానీ, ఆయుధం గానీ మార్గము యొక్క నిడివి గానీ తమ ఇష్టానుసారం మార్చుకునేటట్లుగా తయారు చేశారు.

రోడ్ రాష్ II అత్యధికులతో అత్యుత్తమ రోడ్ రాష్ ఆటగా కొనియాడబడింది. చిన్న స్క్రీన్ వైశాల్యము మరియు కొట్టవచ్చినట్లుగా నిదానించిన ఫ్రేము మార్పిడి వలన ఈ ఇద్దరు ఆటగాళ్ళు కలిగిన ఆటా విధానము పలువురి నిరసనకు గురి అయింది. రోడ్ రాష్ II కు ఆనెస్ట్ గేమర్స్ వెబ్ సైట్ లో 9/10 ఈయడం జరిగింది.[4]

=

రోడ్ రాష్ II: టూర్ డి ఫోర్స్ ===

1995 సంవత్సరములో సెగ మెగా డ్రైవ్ లో రాష్ యొక్క అంతిమ భాగమైన రోడ్ రాష్ III:టూర్ డి ఫోర్స్ విడుదలయింది. స్థాయికి అనుగుణంగా మార్గం ఎన్నుకోవటానికి సంబంధించిన తేడాలు కలిగి అన్ని పందాలు ఏడిటిలో ఐదు దేశాలలో జరుగుతాయి: బ్రెజిల్, యునైటెడ్ కింగ్డం (దాని వివరణ ఐల్ ఆఫ్ మాన్కు సంస్మరణ ఇచ్చినా కూడా), జర్మనీ, ఇటలీ, కెన్యా,ఆస్ట్రేలియా మరియు జపాన్.

వివిధ తరగతులలో పదిహేను బైకులు లభ్యంగా ఉన్నాయి. అందులో నాలుగింటిని మెరుగుపరిచి అందిస్తున్నారు. ఎనిమిది ఆయుధాలు లభ్యంగా ఉన్నాయి. అవి ఆట మరల క్రొత్తగా అమర్చనంతవరకు ఆటగాడికి అందుబాటులో వుంటాయి.

మొదటి రెండు విడతలలోని "కార్టూనీ" స్ప్రైట్లకు బదులుగా డిజిటలైస్డ్ స్ప్రైట్లను వాడి ఆట యొక్క అలంకారాన్ని మెరుగు పరచారు.

=

రోడ్ రాష్ (3DO)===

రోడ్ రాష్ 3D లేక రోడ్ రాష్ 3DO అని తరుచుగా పిలువబడే రోడ్ రాష్ , అదే పేరుతో పిలువబడే జెనిసిస్ ఒరిజినల్ నుండి విడిగా అర్ధం చేసుకోవటానికి 3DOగా విడుదల చేయబడింది. తరువాత సోనీ ప్లే స్టేషన్ కు, సేగా సాటర్న్కు మరియు PCకి కూడా విడుదల చేయబడింది.సూపర్ నిన్తెన్డో యొక్క ఒక నమూనా విడుదలకు ఆలోచన జరిగినా చివరకు దానిని విరమించడం జరిగింది.[citation needed] ఆ ఆటలో పూర్తి స్థాయి చలన చిత్రీకరణ దృశ్యాలు కలిగి ఆట యొక్క ఉద్ధ్యేశాన్ని మరింత ముందుకు జరుపుతాయి.

అందులో మొత్తం ఐదు స్థాయిలు, ఐదు దారులు, అన్నీ కాలిఫోర్నియా ప్రాంతాలే వున్నాయి: ద సిటీ,ద పెనిన్సులా,పసిఫిక్ కోస్ట్ హైవే, సియర్రా నెవాడా మరియు నాపా వ్యాలీ. ఆ రోడ్డులు కొద్దిపాటి దూరం మాత్రమే విడదీయబడి వుండి బహుళ బాటలు కలవై వుంటాయి.

ఆ ఆట యొక్క ఉద్ధ్యేశము గత విడతలలోని వరుసక్రమములోని వంటిదే:ఆన్ని మార్గాలలోనూ "గేం ఓవర్" అని కాని "బస్తేడ్" కాని కాకుండా విజయవంతముగా పూర్తి చేసినాక, మొత్తం 14 స్థానాలలో మొదటి, రెండవ లేక మూడవ స్థానములలో వస్తే స్థాయి పెరుగుతుంది. మార్గాలలోని తేడాలు వాటి నిడివి,దారిలోని వాహనాల సంఖ్య, పోలీసులకు దొరికినప్పుడు భారీ జరిమానాలు కట్టవలసి రావటం మరియు మార్గమును విజయవంతముగా పూర్తి చేసినప్పుడు ఒనగూరే అతి పెద్ద ప్రతిఫలము.

ఆడేవాళ్లు ఏ పాత్రనైన ఎన్నుకోవచ్చు. ప్రతి పాత్రకు ఒక నిర్ణీతమైన ధర ఉంటుంది. అ పాత్ర తన సొంత మోటర్ సైకిల్ తో వస్తుంది. వీనిలో కొన్ని పాత్రల పేర్లు మొట్టమొదటి జెనిసిస్ విడుదలలు అయిన "ఆక్సిల్" మరియు "రొండా" వంటి వానిలోని పోరాటదారుల పేర్ల నుండి వచ్చినవి. ఆ పాత్రకు తన యొక్క తోటి బైకర్లలో ఒక హొదా వుంటుంది. ఆ హొదా పందెం తరువాత కూడా అందుబాటులో వుంటుంది. NPC ఆశించినట్లు (కొందరు గ్రుద్ధడం ఇష్టపడితే మరికొందరు ఇష్టపడలేదు), పందెములోని ఇతర పాత్రధారులు ఆటగాడు గాని ఆటగత్తెగాని పందెములలో ఎలా చూపబడిందో దానికి అనుగుణం గానే శక్తిమంతంగా ప్రతిఘటిస్తారు.

రోడ్ రాష్ ని 32-బిట్ ఇంట్లో ఆడే కన్సోల్ లలో ప్రవేశపెట్టినప్పుడు, మొదట్లో 3DO వెర్షన్ నుండి పోర్ట్ చేయబడ్డాయి. ఆట శ్రేణిలో నాలుగవది అయినప్పటికి ఈ ఆటలన్ని కూడా "రోడ్ రాష్" అనే పిలవబడ్డాయి.

తరువాత ఈ ఆటలని మైక్రోసాఫ్ట్ విండోస్ మరియు నిన్టెన్డో 64 ప్లాట్ ఫోరం లలో పని చేసేవిధముగా పెంచి మరల రూపొందించబడ్డాయి. అలాగే దిగువ స్థాయిలో ఉన్న సేగా మెగా-CD మరియు చేతిలో పట్టుకునే కన్సోల్ లకు కూడా తిరిగి రూపొందించబడ్డాయి.

సంగీతం

3DO ఆటలో సౌండ్ గార్డన్, పా, హీమర్ బాక్స్, థెరపి?, మాన్స్టర్ మెగ్నెట్, మరియు స్వేర్వ్ డ్రైవర్.[5][6] వంటి ఏ&ఎం రికార్డ్స్ కళాకారుల యొక్క 14 సంగీత ట్రాక్ లు ఉన్నాయి. రోడ్ రాష్ విడుదల కావడానికి కొన్ని నెలలు ముందే, 3DO యొక్క 1994 సంవత్సరానికి గాను "సౌండ్ ట్రాక్ ఆఫ్ ది ఇయర్" పురస్కారాన్ని 3DO కైవసం చేసుకుంది. ఆఖరి వెర్షన్ లో గ్యారేజ్ మరియు పేరు తెలియని బ్యాండ్ లు, తమ టేప్ లని పంపించడం ద్వారా ఆటలో పాల్గొనే సదుపాయం కలిగి ఉంది.[3]

==

బైక్ లు====

ఆడేవాళ్లు మూడ రకాల మోటార్ సైకిల్ లు వివిధ ధరలలో తీసుకోవచ్చు: సపోర్ట్/GT బైక్ లు, రేస్ రీప్లికాలు మరియు కృయిసర్ లు. సపోర్ట్/GT బైక్ లు యురోపియన్ గ్రాండ్ టూరింగ్ బైక్ లని పోలి రూపొందించబడినవి. అవి వాడటానికి బాగా ఉండి, ఒక మోస్తరు బరువు కలిగి ఉండి, ఒక మోస్తరు శక్తి కలిగి ఉంటాయి. రేస్ రేప్లికాలు జపనీస్ సూపర్ బైక్ లని పోలి ఉండి, అత్యధిక వేగం మరియు చాల తక్కువ బరువు కలిగి ఉంటాయి. కృయిసర్ లు అమెరికన్ బైక్ లని పోలి ఉంటాయి. సుమారైన బరువు కలిగి ఉండి, త్రిప్పేటప్పుడు అంత మంచి ప్రదర్శన చూపించవు. అయితే నేరుగా వెళ్ళేటప్పుడు అధిక శక్తి కలిగి ఉన్నాయి. 32-బిట్ వ వెర్షన్ లు నాలుగో రకపు రాట్ బైక్ ని ప్రవేశ పెట్టాయి. ఇవి ఫ్రాన్కేస్టీన్ బైక్ లని పోలి ఉన్నాయి కాని వాటిలో అనేక అంశాలు లేవు. ఆ బైక్ లు చాల చురుకుగాను ఎక్కువ మన్నిక కలిగి ఉండేవి. పై స్థాయిలలో కొన్ని బైక్ లు N2O పెంచే సౌలభ్యం కలిగి ఉన్నాయి.

స్వీకరణ

. మీన్ మెషిన్స్ పత్రికలో రోడ్ రాష్ కు మంచి అనుకూలమైన విమర్శన లభించింది. 91% తుది స్కోర్ లభించి, ఈ ఆటలోని సంగీతం, గ్రాఫిక్స్ మరియు ఆటతీరు వంటి అంశాలు మెచ్చుకోబడ్డాయి.[7] రోడ్ రాష్ యొక్క కమోడర్ అమిగా విడుదలకు ఒక మోస్తరు ఎక్కువ రేటింగ్ లభించింది. అమిగా ఫార్మాట్ [8] నుండి 84% మరియు CU అమిగా నుండి 81% రేటింగ్ లు లభించాయి.[9] అయితే అమిగా పవర్ నుండి తక్కువ రేటింగైన 70% లభించి మంచి విమర్శ లభించలేదు.[10] ఈ ఆట ఎలెక్ట్రానిక్ గేమింగ్ మంత్లి నుండి, వాళ్ల 1994 వీడియో గేమ్ పురస్కారాలలో, అనేక పురస్కారాలు అందుకుంది. అత్యుత్తమ డ్రైవింగ్ ఆట, CD ఆటల్లో అత్యుత్తమ సంగీతం మరియు 1994 లో అత్యుత్తమ 3DO ఆట అనే పురస్కారాలు ఎలెక్ట్రానిక్ గేమింగ్ మంత్లి నుండి అందుకున్నది.[11]

=

రోడ్ రాష్ 64===

నిన్టెన్డో 64 కొరకు రోడ్ రాష్ 64 , 1999లో విడుదల చేయబడింది. ఇది విశేషమైనది ఎందుకంటే ఎలెక్ట్రానిక్స్ ఆర్ట్స్ దీన్ని రూపొందించడం కాని ప్రచురించడం కాని చేయలేదు. బదులుగా, దీనికి సంబంధించిన ఇంటేలీక్చువల్ ప్రాపర్టి హక్కులు THQ కు లైసన్స్ ఇవ్వబడ్డాయి. THQ కు సొంతమైన పసిఫిక్ కోస్ట్ పవర్ & లైట్ (డాన్ ట్రేగర్ అనే పూర్వ EA ఉద్యోగి స్థాపించింది) అనే స్టూడియోలో ఈ ఆటని రూపొందించింది.

రోడ్ రాష్ 64 కూడా F-జీరో X మాదిరిగానే రూపొందించబడింది. అనగా, చాల తక్కువ పాలిగన్ మాదిరీలు, తక్కువ రిసల్యుషన్ కలిగిన టెక్స్చర్ లు మరియు కొన్ని ప్రత్యేక ఎఫెక్ట్ లు మాత్రమే కలిగి ఉంది. దానివల్ల ఆటలో అనేక డజనుల మోటార్ సైకిల్ లు, ట్రాఫిక్ మాదిరిలు మరియు అడ్డంకులు కల్పించడానికి వీలు కలిగింది. అదే సమయములో ఫ్రేం రేట్ ని కూడా ఎక్కువగా ఉంచుకోవడానికి వీలు కలిగింది. పూర్వం 16-బిట్ ఆటల్లో ఉన్న ఘర్షణ విషయాల్లో ఈ ఆట కూడా ఎక్కువ శ్రద్ధ చూపించింది. కన్సోల్ ఆటలలో ఆ రోజుల్లో సెట్టింగ్ లని కావలసిన విధముగా మార్చుకోడానికి వీలు తక్కువగా ఉండేది. అయితే ఆ విషయములో ఈ ఆట అ కాలానికి ముందు ఉండేది.

N64 వాడేవాళ్లు ఒక రామ్ ఎక్స్పాన్స్హన్ పాక్ ఉపయోగించి, డిఫాల్ట్ గ్రాఫిక్స్ సెట్టింగ్ తో పాటు వైడ్ స్క్రీన్, లెటర్ బాక్స్, ఎక్కువ రేసల్యుషన్ వంటి సెట్టింగ్స్ ని కూడా వాడే సదుపాయం కలిగింది. ఆడియో కంప్రెషన్ సాఫ్ట్ వేర్ ద్వారా రోడ్ రాష్ 3D నుండి ఇదు ట్రాక్ లని ఈ ఆటలో వాడటానికి వీలు కలిగింది.

దీనికి ముందు వచ్చిన ఆటలలో మాదిరిగా వేరు వేరు ప్రదేశాల్లో ఒకే పెద్ద పొడుగాటి వీధిని వాడకుండా, రోడ్ రాష్ 64 లో'ఒకదానికొకటి సంబంధం ఉన్న వీదుల వ్యవస్థ లో ఉన్న వివిధ మార్గాల్లో పందాలు జరిగాయి. పందెం మార్గాలు బ్రాంచ్ వీధిలు కూడా కలిగి ఉండేవి. ఆట యొక్క నాలుగు మూలలు వ్యత్యాసము కలిగి ప్రత్యేక పరిసరాలు కలిగి ఉండేవి. మొదటి స్థాయి దాటినాక, పందాలు వివిధ పరిసరాల మధ్యలో నుండి జరిగేవి.'

=

రోడ్ రాష్: జైల్ బ్రేక్===

రోడ్ రాష్: జైల్ బ్రేక్ 1999లో ప్లేస్టేషన్ కొరకు విడుదల చేయబడింది. తరువాత 2004లో గేమ్ బాయ్ అడ్వాన్స్లో కూడా వచ్చింది. ఈ ఆట యొక్క ముఖ్యమైన అంశాలలో ఒక వీధి వలయ వ్యవస్థ మరియు ఒక సైడ్ కార్ తో కూడిన ఇద్దరు ఆడే విధానము ఉన్నాయి.

రోడ్ రాష్: జైల్ బ్రేక్ యొక్క గేమ్ బాయ్ అడ్వాన్స్ వెర్షన్ కు మిశ్రమ విమర్శలని ఎదుర్కొంది. మెటాక్రిటిక్లో ఈ ఆటకు 67% స్కోర్ లభించింది.[12]

=

ఇతర విడుదలలు===

ప్లేస్టేషన్ పోర్టబుల్లో EA రీప్లెని ఎలెక్ట్రానిక్స్ ఆర్ట్స్ నవంబరు 2006లో విడుదల చేసింది. దీంట్లో రోడ్ రాష్ I, II మరియు III పోర్ట్ లు ఉన్నాయి. అయితే దీంట్లో రోడ్ రాష్ I లో అసలు విడుదలలో ఉన్న రాబ్ హబ్బర్డ్ సౌండ్ ట్రాక్ లేదు. రోడ్ రాష్ II వయర్లెస్ మల్టీప్లేయర్ అంశం కలిగి ఉంది.[13]

సూచనలు

 1. Road Rash Sega Game Gear Manual. U.S. Gold. 1991. p. 12. |access-date= requires |url= (help)
 2. "Road Rash Technical Details". GameSpot. Retrieved 2007-10-12.
 3. 3.0 3.1 "Electronic Arts and BAM Magazine Announce the Road Rash Music Search". Business Wire. 1999-05-28. Retrieved 2007-10-12.
 4. K T (2005-06-10). "Road Rash II (Genesis) review on HonestGamers". HonestGamers. Retrieved 2009-10-29.
 5. Brown, Matt. "Road Rash: Review by Matt Brown". ibiblio. Retrieved 2007-12-26.
 6. "Electronic Arts and Atlantic Records Sign Licensing Agreement for Road Rash 3D". Business Wire. 1998-03-10. Archived from the original on 2012-07-08. Retrieved 2007-10-12.
 7. Rignall, Julian (September 1991), "Road Rash Review from Mean Machines", Mean Machines, EMAP
 8. "Road Rash Review from Amiga Format author=Jackson, Neil", Amiga Format, Future Publishing, December 1992 Missing pipe in: |title= (help)
 9. "Road Rash Review from CU Amiga", CU Amiga, EMAP, November 1992
 10. Campbell, Stuart (July 1992), "Road Rash review from Amiga Power", Amiga Power
 11. "Electronic Gaming Monthly's Buyer's Guide". 1995. Cite has empty unknown parameters: |month= and |coauthors= (help); Cite journal requires |journal= (help); |access-date= requires |url= (help)
 12. "Road Rash Jailbreak Review". Metacritic. Retrieved 2007-10-12.
 13. Sinclair, Brendan (2006-08-31). "EA confirms Retro Replay". GameSpot. Retrieved 2007-10-12.

బాహ్య వలయాలు

మూస:Papyrus Design Group games