లంకపల్లి (పమిడిముక్కల)

From tewiki
Jump to navigation Jump to search
లంకపల్లి (పమిడిముక్కల)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పమిడిముక్కల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషులు 605
 - స్త్రీలు 618
 - గృహాల సంఖ్య 398
పిన్ కోడ్ 521247
ఎస్.టి.డి కోడ్ 08676.

లంకపల్లి (Patamatalankapalli), కృష్ణా జిల్లా, పమిడిముక్కల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 247., ఎస్.టి.డి.కోడ్ = 08676.

గ్రామ చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పమిడిముక్కల మండలం

పమిడిముక్కల మండలం మొత్తం ప్రాంతంతో పాటు, పట్టణ ప్రాంతం కూడా ఉంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

ఈ గ్రామానికి సమీపంలో తెలుగురావుపాలెం, కుదేరు, చోరగుడి, పెనుమత్చ, కొడాలి గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు

మొవ్వ,పమిడిముక్కల, వేమూరు;, ఘంటసాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు

కొల్లూరు, కొడాలి నుండే రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 45 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

జిల్లాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, ఐనపూరు

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామములోనివైద్య సౌకర్యాలు

ఆయుర్వేద వైద్యశాల.

గ్రామానికి సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి వేమూరి రత్నకుమారి సర్పంచిగా ఎన్నికైనారు.
  2. పురాతనమైన ఈ గ్రామ పంచాయతీ భవనాన్ని, రెండు లక్షల రూపాయల వ్యయంతో పునరుద్ధరించి, 2015,జులై-2వ తేదీ నాడు ప్రారంభించారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం

నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2017,జూన్-16వతేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు కీర్తిధ్వజ ప్రతిష్ఠ, శ్రీ భక్తాంజనేయస్వామివారి విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి, శాంతికళాణం నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేసారు. [6]

గ్రామంలో ప్రధాన పంటలు

ఇసుక క్వారీ

లంకపల్లి గ్రామ పరిధిలో కృష్ణానది గర్భం నుండి ఇసుకను ఉచితంగా ప్రభుత్వ పనులకు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చుటకు కలెక్టరుగారు అంగీకరించారు. సదరు లంక పరిధి నుండి లంకపల్లిలోని కరకట్ట వరకు నిబంధనల మేరకు రహదారి ఏర్పరచెదరు. [7]

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

ఈ గ్రామానికి చెందిన శ్రీ చిన్నం బసవయ్య+దేవాక్షి దంపతుల కుమార్తె అయిన శ్రీమతి రాధామోహన్, ముంబాయిలోని అభినయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాన్స్ అను ఒక సంస్థకు డైరెక్టరు/ఛైర్ పర్సనుగా ఉన్నారు. ఈమె ఎం.ఏ. (ఎకనామిక్స్)., & ఎం.ఏ. (డాన్స్) చదివినారు. ఏలూరులో, ప్రఖ్యాత నాట్యాచారులైన శ్రీ కోరాడ నరసింహరావు గారి వద్ద కూచిపూడి & భరతనాట్యం నేర్చుకున్నారు. వీరు 4 దశాబ్దాలుగా, మన దేశంలోనే గాక 43 దేశాలలో నాట్యప్రదర్శనలిచ్చారు. లెక్కకు మిక్కిలి పురస్కారాలూ, సన్మానాలూ అందుకున్నారు. [2]

గ్రామ విశేషాలు

తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) పశ్చిమ కోఆర్డినేటర్ శ్రీ వేమూరి సతీష్, ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధిచేయడానికై దత్తత తీసుకున్నారు. [4]

లంకపల్లి గ్రామంలోని ఇసుక రీచ్, 2016,మే-9వ తేదీ నుండి సీనరేజ్ లేకుండా ఇసుక తీసికొని వెళ్ళటానికి అమలులోనికి వచ్చును. [5]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1565.[3] ఇందులో పురుషుల సంఖ్య 779, స్త్రీల సంఖ్య 786, గ్రామంలో నివాస గృహాలు 444 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 290 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 1,223 - పురుషుల సంఖ్య 60 - స్త్రీల సంఖ్య 618 - గృహాల సంఖ్య 398

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamidimukkala/Lankapalli". Retrieved 24 June 2016. External link in |title= (help)
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-08.

వెలుపలి లింకులు

[2] ఈనాడు కృష్ణా; 2014,జనవరి-7; 3వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,జులై-3; 39వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-22; 3వపేజీ. [5] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మే-8; 1వపేజీ. [6] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,జూన్-17; 2వపేజీ. [7] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,జూన్-20; 2వపేజీ.