"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
లక్షణ
Jump to navigation
Jump to search
శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలైన అష్టమహిషులలో ఒకరు లక్షణ. ఈమె బృహత్సేనుని కూతురు. ఈమె నారదుని ద్వారా శ్రీకృష్ణుడి గుణగణాలు, మాయలు, రూపురేఖలు, సామర్థ్యం తెలుసుకుంటుంది. ఈమె శ్రీకృష్ణునుని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. అయితే ఈమె తండ్రి మత్స్య యంత్రం ఏర్పాటు చేసి దానిని కొట్టిన వానికే తన కూతురుని ఇస్తానని చాటిస్తాడు, అనేక దేశాధీశులు, రాజకుమారులు ప్రయత్నించి విఫలమయ్యాక శ్రీకృష్ణుడు మత్స్యాన్ని పడేస్తాడు. ఈ విధంగా లక్షణకు శ్రీకృష్ణునుని పెళ్ళి చేసుకోవాలనుకున్న కోరిక సిద్ధిస్తుంది.
లక్షణకు, శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది.