"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

లక్సెట్టిపేట

From tewiki
Jump to navigation Jump to search

లక్సెట్టిపేట, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా, లక్సెట్టిపేట మండలానికి చెందిన గ్రామం.[1]ఇది జనగణన పట్టణం

మంచిర్యాల జిల్లాలోని ముఖ్య పట్టణాలలో లక్సెట్టిపేట. ఒకటి.

పట్టణ విశేషాలు

లక్సెట్టిపేటలో చూడదగ్గ ప్రదేశం. సి.ఎస్.ఐ గార్దెన్ చర్చ్, రెవ. హార్లీ అనే పాస్టరు ఆద్వర్యంలో, 1930 లో నిర్మించబడింది. ఈ సి.ఎస్.ఐ సంఘం ఆధ్వర్యంలో వైద్యసేవలు, హాస్టల్ వసతి, పాఠశాల, ఆశిర్వాద కేంద్రము ద్వారా పేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, టైప్ రైటింగ్ వంటి శిక్షణను అందించుచు పలు సేవా కార్యక్రమాలను విజయవంతముగా నడిపించుచుంది. ఈ నగరం పవిత్ర గోదావరి నదికి ఆనుకొని ఉంది. ఎక్కువమంది భక్తులు పుణ్య స్నానాల కొరకు ఈ పట్టణానికి వస్తుంటారు. ఈ పట్టణం మంచిర్యాలకు సమీపంలో ఉన్నందున వర్తక వాణిజ్యాలు ఎక్కువుగా కొనసాగతాయి. ఈ పట్టణం నేషనల్ హైవేను ఆనుకొని ఉంది.

విద్యాసౌకర్యాలు

ఇక్కడి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలు మంచి ఫలితాలతో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నిలుస్తున్నాయి.

  1. ప్రభుత్వ పాఠశాలలు: జిల్లా పరిషత్ సెకండరి బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరి బాలుర పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాల
  2. ప్రైవేటు పాఠశాలలు : 4
  3. ప్రైవేటు కాలేజీలు : 2

గణాంకాలు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 50,674 - పురుషులు 25,501 - స్త్రీలు 25,173

వ్యవసాయం, పంటలు

లక్సెట్టిపేట మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 4338 హెక్టార్లు, రబీలో 2937 హెక్టార్లు.ప్రధాన పంటలు వరి, జొన్నలు, గోధుమ.[2]

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 228

వెలుపలి లంకెలు

en:Luxettipet